వంశీగారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా “జోకర్”. సంగీతం చాలా వరకూ ఇళయరాజా మార్క్ లో చేయడానికి ప్రయత్నించినా ప్రయత్నం మాత్రమే అనే విషయం తెలిసిపోతుంటుంది. ఈసినిమాలో “బండిరా పొగబండిరా”, రీమిక్స్ చేసిన “రేపంటి రూపం కంటి” పాటలు ఎక్కువ హిట్ అయినా నాకు మాత్రం ఈ “పాల నవ్వుల లోనా” పాట చాలా ఇష్టం. బేబీ షామిలితో చిత్రీకరణ కూడా బాగుంటుంది. సంధర్బోచితమైన సాహిత్యం కూడా అలరిస్తుంది కానీ పాట రాసినది ఎవరో తెలియదు. క్యాసెట్ ఇన్ లే కార్డ్ మీద కూడా లేకపోవడం శోచనీయం. ఈ చక్కని పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.
చిత్రం : జోకర్
సాహిత్యం : వంశీ ?
సంగీతం : వంశీ
గానం : బాలు, బేబీ షామిలీ
హాఅ..... జోకర్...
హహహ హహ హహహహహహ
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు..
బాల పలుకులోనా పలకాలి చిలకలూ..
పైన పగటి వేషం ఒక వేడుకైనదీ..
లోన తెగని పాశం ఈ జోకరైనదీ..
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా..
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా..
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు..
బాల పలుకులోనా పలకాలి చిలకలూ..
పైన పగటి వేషం ఒక వేడుకైనదీ..
లోన తెగని పాశం ఈ జోకరైనదీ..
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా..
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా..
చిలిపి మాటలూ చిలికే పాట పేరడీ
చురుకు చేతిలో తిరిగే పేక గారడీ..
చిట్టిపాప బెట్టూ అది హాటు ట్రాజెడీ
రట్టు చేయి బెట్టూ ఇది స్వీటు కామెడీ..
గువ్వా నువ్వూ నేను నవ్వే నవ్వూలోన
పువ్వూ పువ్వూ వాన జల్లాయెనూ..
కయ్యాలు నేటికి కట్టాయెనూ..
చిన్నారి ఆటల పుట్టయెనూ..
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు..
బాల పలుకులోనా పలకాలి చిలకలూ..
పైన పగటి వేషం ఒక వేడుకైనదీ..
లోన తెగని పాశం ఈ జోకరైనదీ..
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా..
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా..
అయ్యయ్యో హ..
ఫైటింగ్ చేసేస్కుంటున్నారేంటి
హమ్మా... హహహ
తగువు పాపతో చెలిమి చేసి జోకరూ..
బిగువు లాగితే పొంగీ పోయె హ్యూమరూ..
ఎత్తు వేసి వస్తే ఎదురైన నేస్తమా
చిత్తు చేసినావే ఎదలోని బంధమా..
చిన్నా చిన్నా లేత పొన్నా పొన్నా
ప్రేమ కన్నా మిన్నా లేదు లేదోయన్నా..
కుందేలు జాబిలి ఫ్రెండాయెనూ...
అందాల స్నేహము విందాయెను.
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు..
బాల పలుకులోనా పలకాలి చిలకలూ..
పైన పగటి వేషం ఒక వేడుకైనదీ..
లోన తెగని పాశం ఈ జోకరైనదీ..
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా..
నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మా..
4 comments:
జోకర్ లో పాటలన్నీ వినీ వినీ కేసెట్ అరిగి పోయింది.మంచిపాట గుర్తు చేసారు .రాధిక (నాని) .
థాంక్స్ రాధిక గారు :-)
యెందుకో జోకర్ అన్న మాట విన గానే, రాజ్ కపూర్- జానే కహా" పాట గుర్తు కొచ్చేస్తుంది..తరువాత యెందరు ప్రయత్నించినా..మళ్లీ-నిన్ను తలచీ (విచిత్ర సోదరులు), తకధిమితక (ఇది కధ కాదు)..అంటూ కమల్ మాత్రమే మెప్పించ గలిగారు..ఈ పాటని ఆ స్థాయి లో అనుకోలేక పోయినా..ఇందులో బీట్ డెఫ్నెట్ గా మనసుని హాంట్ చేసేలా వుంటుందండి..వీలైతే "తక ధిమి తక" సాంగ్ వినిపించ గలరా వేణూజీ..
జోకర్ గా రాజ్ సాబ్ మన మనసులమీద వేసిన చెరగని ముద్ర అలాంటిది శాంతి గారు. ఈ పాటకి మీరుచెప్పిన వాటితో పోలిక లేకపోయినా మీరన్నట్లు ఈ బీట్ హాంటింగ్ గా ఉంటుంది. తప్పక తకధిమితక పాట త్వరలో ప్రచురిస్తానండీ. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.