కొన్ని కొన్ని పాటలు జీవితకాలం వెంటాడుతుంటాయి. ఎలాంటి మూడ్ లో విన్నా ఎపుడు విన్నా ఆ పాట మూడ్ లోకి అలా లాక్కెళ్ళిపోగల పాటలుంటాయి. అలాంటి పాటే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా “ నువ్వే నువ్వే” లోని ఈ పాట. కోటి స్వరకల్పనలో సిరివెన్నెల గారి సాహిత్యం చిత్రగారి గళంలో మనల్ని వెంటాడుతుంది. ఈ పాట మీకోసం... ఆడియోమాత్రం వినాలంటే ఇక్కడ వినండి.
చిత్రం : నువ్వే నువ్వే
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: కోటి
గానం: చిత్ర
ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాశ లేని ఆశ నేనై.. మిగలనా.ఆఅ..ఆఆ..
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
నేల వైపు చూసే నేరం చేసావనీ
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకునీ
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమనీ
తల్లి తీగ బంధిస్తుందా మల్లెపువ్వునీ
ఏ మంత పాపం ప్రేమా ప్రేమించటం
ఇకనైనా చాలించమ్మా వేధించటం
చెలిమై కురిసే సిరివెన్నెలవా...
క్షణమై కరిగే కలవా... ఆఆఅ..ఆ.ఆ.
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాశ లేనీ ఆశ నేనై మిగలనా
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడా చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకూ నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
3 comments:
e song enno saarlu vinna gani Lyrics antala vinaledu.. Chala bavundi .Thanks Venu garu :)..Radhika.
Very heart touching song. I like it too.
$iddharth
థాంక్స్ రాధిక గారు, సిద్దార్ధ్ గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.