ఆదివారం, డిసెంబర్ 29, 2013

వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా..

వంశవృక్ష అనే కన్నడ నవల ఆధారంగా బాపూగారి దర్శకత్వంలో వచ్చిన "వంశవృక్షం" సినిమాలోని ఈ "వంశీ కృష్ణా యదు వంశీ కృష్ణా" పాట చాలా బాగుంటుంది. సినారేగారు తేలికైన పదాలతో చాలా అందంగా రాస్తారు ముఖ్యంగా రెండో చరణంలో ప్రాణులంతా వేణువులై నీరాగాలే పలుకుతున్నారని అన్నీ నీలీలలే అని అన్నా ఆటగా రణమును నడిపిన కృష్ణ అనీ పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా అని అన్నా కృష్ణతత్వాన్ని ఎంత సింపుల్ గా చెప్పారని అనిపిస్తుంది. ఈ పాట ఆడియో రాగాలో ఇక్కడ వినవచ్చు లేదా కింది ప్లగిన్ లో వినవచ్చు. వీడియో దొరకలేదు మీకు కనిపిస్తే కామెంట్స్ లో పంచుకోగలరు.



చిత్రం : వంశవృక్షం(1980)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, శైలజ

వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా
వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా
వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా

పుట్టింది రాజకుమారుడుగా
పెరిగింది గోపకిశోరుడుగా
తిరిగింది యమునా తీరమున
నిలిచింది గీతాసారంలో
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా
వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా

ప్రాణులందరూ వేణువులే
అవి పలికేది నీ రాగములే
పాడేది పాడించేది
ఆడేది ఆడించేది
ఓడేది ఓడించేది
అంతా నీవేలే 
అన్నీ నీ లీలలే
గోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణా
వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా

నోటిలో ధరణి చూపిన కృష్ణా..
గోటితో గిరిని మోసిన కృష్ణా..
ఆటగా రణము నడిపిన కృష్ణా..
ఆటగా రణము నడిపిన కృష్ణా..
పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా..
పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా..
కిల కిల మువ్వల కేళీ కృష్ణా.. కేళీ కృష్ణా..
తకధిమి తకధిమి తాండవ కృష్ణా... తాండవ కృష్ణా..
కేళీ కృష్ణా.. కేళీ కృష్ణా.. 
 తాండవ కృష్ణా.. తాండవ కృష్ణా.. 
కేళీ కృష్ణా.. కేళీ కృష్ణా.. 
 తాండవ కృష్ణా.. తాండవ కృష్ణా.. 
కేళీ కృష్ణా.. కేళీ కృష్ణా.. 
 తాండవ కృష్ణా.. తాండవ కృష్ణా..

2 comments:

ముద్దు ముద్దు కారకా నవ మోహనాంగా రా
నిగ్గంపు చెక్కిళ్ళ వాడ నీరజాక్ష రారా..
నిన్ను చూడ లేదురా నీలవర్ణ రారా..
కన్నుల పండుగ యెంతో కన్న తండ్రీ రారా..
యెందుకో ఈ పాట రాముడిదైనా నాకెప్పుడూ వింటుంటే చిన్న కృష్ణుడే గుర్తొస్తాడు వేణూజి..ఈ పాట విన్నా సేం ఫీలింగ్..

మీరు చెప్పిన పాట ఎపుడూ వినలేదు శాంతిగారు.. నిజమే సాహిత్యం చూస్తే కృష్ణుడిపై రాసినట్లే అనిపిస్తుందండీ. థాంక్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.