గురువారం, డిసెంబర్ 26, 2013

యమునా ఎందుకె నువ్వు

ఇళయరాజ సంగీతం సమకూర్చిన మరువలేని ఆల్బమ్స్ లో నిరీక్షణ కూడా ఒకటి. ఇందులోని "ఆకాశం ఏనాటిదో", "చుక్కల్లే తోచావే", "తియ్యన్ని దానిమ్మ" పాటలతో పాటు కన్నయ్యమీద ఉన్న ఈపాట కూడా నాకు బోలెడంత ఇష్టం. యమునా నదికి నల్లని రంగు కిట్టయ్యతో కూడడం వలన అబ్బిందట ఎంత చక్కని భావనో కదా.. మనసుకవి ఆత్రేయ గారిది చాలా బాగా రాశారు సాహిత్యానికి తగిన సంగీతం కూడా మనల్ని అలరిస్తుంది. చిత్రీకరణ సైతం బాగుంటుంది ఈ పాట తెలుగు వీడియో ఎక్కడా దొరకలేదు కనుక తెలుగు ఆడియో ఇక్కడ వింటూ తమిళ్ వీడియో చూసేయండి.



చిత్రం : నిరీక్షణ
సంగీతం : ఇళయరాజ 
సాహిత్యం : ఆత్రేయ
గానం : జానకి

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ
వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడుతాడే

పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బో ఏం పిల్లడే..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే
 శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే

మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ


7 comments:

మాటలు:జంధ్యాల
పాటలు:ఆత్రేయ
సంగీతం:ఇళయరాజా

జానికీ గారు చాలా ఆద్భుతంగా పాడారు .ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు.. రాధిక (నాని)

ఇందులొ అత్రేయ గారి గొప్పతనం కన్న రాజా గారి సంగీతం , జానకి గారి గొంతు ఎక్సెలెంట్ అనిపిస్తుంది నాకు. అత్రేయ గారి నుంచి ఇంత కన్నా గొప్ప సాహిత్యం ఆశించవచు అని నా వుద్దేశం. కాని రాజా గారి సంగీతం కూర్పు, జానకి అమ్మ గాత్రం కి ఇంత కన్నా గొప్ప లేదు. They made it more than 100%

థాంక్స్ శ్రీనివాస్ గారు, రాధిక గారు, సీతారాం రెడ్డి గారు, శ్రీ గారు.

సిగ్గుతో యెరుపెక్కిన మంకెన పూలు..అందరికీ తెలిసిన వర్ణనే..బట్, నల్లని కన్నయ్య తో కూడి నలుపెక్కిన యమున..యెంత అందమైన భావన..హేట్సాఫ్ టు ఆత్రేయ, ఇసై ఙ్ఞాని, జానకమ్మ, యెండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాలు మహేంద్ర..

థాంక్స్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.