శుక్రవారం, డిసెంబర్ 06, 2013

మాటకందని పాటగా...

ఈరోజు నుండీ కొంతకాలంపాటు ఈ బ్లాగ్ లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఒక మంచి పాటతో మిమ్మల్ని పలకరించాలని నిర్ణయించుకున్నాను, అలాగే మీకు నచ్చిన పాటలు వేటికైనా లిరిక్స్ కావలసి ఉంటే కూడా ఈ బ్లాగ్ పోస్టులలో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. తప్పకుండా సాధ్యమైనంత త్వరలో అందించడానికి ప్రయత్నిస్తాను.

ముందుగా మధురమైన పాటలంటే పాతవి మాత్రమే కాదు కొత్తపాటల్లోనూ అందమైన పాటలూ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలూ ఉంటాయనే నమ్మకాన్ని కలిగించిన కొత్త సినిమా “మల్లెలతీరం” నుండి “మాటకందని పాటగా” పాట సాహిత్యం మీకోసం. సినిమా కథా నేపధ్యాన్ని పక్కన పెడితే ఇద్దరు ప్రేమికుల మధ్య పాటగా చూసినపుడు ఈ పాట చాలా చాలా బాగుంటుంది దదాపు ఒక నెలపాటు నేను రోజూ విన్నపాట ఇప్పటికీ తరచుగా వినేపాట. కొత్తపాటలలో ఇలా వినగలిగేవి దీర్ఘకాలం మనగలిగేవీ బహు అరుదు అని చెప్పచ్చేమో. అలాంటి అరుదైన పాట ప్రోమో మీకోసం.


పూర్తిపాట ఆడియో వర్షన్ రాగాలో ఇక్కడ కానీ కింద ఎంబెడ్ చేయబడిన జ్యూక్ బాక్స్ లో ఇక్కడ కానీ వినవచ్చు. డివిడి రిలీజ్ కానందున ఇంకా పూర్తి వీడియో సాంగ్ లభ్యత లేదు.



చిత్రం : మల్లెలతీరం
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
సంగీతం : పవన్ కుమార్
గానం : నిత్యసంతోషిణి

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

తూరుపు వెలుగుల పడమటి జిలుగుల
పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుసున ఇద్దరమే
చీకటి నలుపున మనమే
చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు అలసట ఎరుగని
నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!

ఆఅ... మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

స్వఛ్చపు తొలకరి వెచ్చని జల్లుల
పచ్చని కాంతులలో మనమే..
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటల మనమే
నింగి నేల చిన్నబోయే రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతము ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియకథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

 

12 comments:

good idea! all the best for the best songs to come..

బాగుందండి .ఐతే ఇక నుండి రోజు మీ నుంచి ఓ మంచి పాట వినొచ్చనమాట (రాధిక నాని )

థాంక్స్ రాధిక గారు :-) అవునండీ వినిపించాలనే నా ప్రయత్నం :-))

కాలం కాని కాలం లో కోయిల పాట యెందుకనీ..యెందుకైనా వెణూజీ..శీతాకాలం లో కురిపిస్తున్న మీ పాటల వర్షాన్నీ..వేసవి లోంచి వేరు చేసిన మంచు మల్లెపూలనీ ఆహ్వానిస్తున్నాము..అస్వాదిస్తున్నాము..

ధన్యవాదాలు శాంతిగారు :-)

>>>అలాగే మీకు నచ్చిన పాటలు వేటికైనా లిరిక్స్ కావలసి ఉంటే కూడా ఈ బ్లాగ్ పోస్టులలో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. <<<

వేణు గారు!!
థాంక్ యు, ఆఫర్ ఇచ్చినందుకు,
నాకు ఈ పాట కావాలి :)

మెరిసే మేఘ మాలిక ఉరుములు చాలు చాలిక
http://www.raaga.com/play/?id=224484

అలాగే ఫోటాన్ రేపే పోస్ట్ చేస్తాను ఆ పాట :-)

ee album release ayinappudu ee patalanu rojantaa malli malli vinevallam. nee needana ila nadavanaa, ala chandamamanai kuda chala baguntuntayii. movie chudatame veelavvaledu :( DVD eppudu release chestaro

మాటకందని పాటగా song Tejaswini padinidi anukunnaa, kaadaa

థాంక్స్ మహెక్ గారూ.. అవునండీ డివిడి చాలా లేట్ చేస్తున్నారు ఎందుకో. ఈ పాటపాడింది నిత్యసంతోషిణి అండీ నో డౌట్.

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
ఇక్కడే కొద్దిగా మారిస్తే బాగుండేది పరాగం సుమంలో ఉంటే బాగుంటుంది సరసులోకంటే
పరాగం సుమంలో ఉంటే ప్రయోజనం సరస్సులో ఉంటె నిష్ప్రయోజనం
సరస్సులో విరిసే సుమంలో పరాగమే మనమే ఇలా వున్నా పరవలేదుగా
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

థాంక్స్ ఫర్ ద నైస్ కామెంట్ విస్సా గారూ.. బహుశా కవి హృదయంలో మీరన్న భావమే ఉండుంటుందండీ పాట మీటర్ లో ఒదగాలంటే కొన్ని పదాల సర్ధుబాటులో ఇటు అటు అయుంటాయంతే..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.