బుధవారం, డిసెంబర్ 18, 2013

అదిగదిగో యమునాతీరం

ఈ పాట మీలో ఎందరికి తెలిసి ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా చాలా ఇష్టమైన పాట, ఇదికూడా రేడియోలోనే పరిచయం నాకు. వస్తున్నపుడు ఎందుకో తెలీదు అలా ఆగిపోయి వినేవాడ్ని చేస్తున్న పనులు అన్నీ ఆపేసి శ్రద్దగా ఈ పాట వినేసి మళ్ళీ పనులు చేసుకోవడం అనమాట. ఈ సినిమా గురించికానీ వీడియో గురించి కానీ నాకు తెలీదు యూట్యూబ్ లో వెతికినా కనిపించలేదు కానీ పాట మాత్రం ఎంతో ఇష్టం, బాలు జానకి గార్లు సరదాగా ఆటలాగా పాడిన పాటలలో ఇదీ ఒకటి. ఈ అందమైన పాటని ఇక్కడ వినండి ప్లగిన్ పనిచేయకపోతే చిమటాలో ఇక్కడ వినచ్చు.
చిత్రం : తెల్లగులాబీలు
సాహిత్యం : మైలవరపు గోపీ
సంగీతం : శంకర్-గణేష్
గానం : బాలు, జానకి

అదిగదిగో..ఓఓ..ఓ.. యమునా తీరం..
మాసం చైత్రం.. సంద్యాసమయం..
అటు-ఇటు.. పొద ఎద..
అంతా..విరహం. విరహం..
మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..
అయినా.. ప్రణయం మధురం..
ప్రియ..ప్రియ..జారిపోనీకు తరుణం..

అదిగదిగో.. యమునా తీరం..
మాసం చైత్రం.. సంద్యాసమయం..
అటు-ఇటు.. పొద ఎద..
అంతా..విరహం. విరహం..
మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..
అయినా.. ప్రణయం మధురం..
ప్రియ..ప్రియ..జారిపోనీకు తరుణం..


దూరాన యే వాడలోనో..
వేణుగానాలు రవళించ సాగే..
ఓఓ..ఓ.. గానాలు వినిపించగానే..
యమున తీరాలు పులకించి పోయే..

పూల పొదరిళ్ళు పడకిళ్ళు కాగా..
చిగురు పొత్తిళ్ళు తల్పాలు కాగ..
ఎన్ని కౌగిళ్ల గుబులింతలాయే..

అదిగదిగో.. యమునా తీరం..
మాసం చైత్రం.. సంద్యాసమయం..
 

అటు-ఇటు.. పొద ఎద..
అంతా..విరహం. విరహం..
మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..
అయినా.. ప్రణయం మధురం..
ప్రియ..ప్రియ..జారిపోనీకు తరుణం..

 

విధి లేక పూచింది కానీ..
ముళ్ళగోరింట.. వగచింది..ఎదలో..

ఆఆఆ.ఆ..ఆ...పూచింది యే చోటనైనా..
పూవు చేరింది పూమాలనేగా...
యే సుడిగాలికో.. వోడిపోక..
యే జడివానకీ.. రాలిపోక..
స్వామి పాదాల చేరింది..తుదకు..


అదిగదిగో.. హాఅ..ఆ.ఆఅ.. యమునా తీరం..
మాసం చైత్రం.. సంద్యాసమయం..
అటు-ఇటు.. పొద ఎద..
అంతా..విరహం. విరహం..
మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..

హాఆఅ..ఆ..అయినా.. ప్రణయం మధురం..
ప్రియ..ప్రియ..జారిపోనీకు తరుణం..

5 comments:

నాకు చాలా ఇష్టమండి . చిన్నప్పుడు రేడియోలో ఎక్కువగా వచ్చేది .రాధిక (నాని)

సాంగ్స్ సెలెక్షన్ చాలా బావుంటోంది, వేణూ!
:-)

థాంక్స్ రాధిక గారు, నిషీ.

ఈ పాట లో ముఖ్యం గా బాలూ గారి గొంతులో విరహం వెన్నెల తీరాలని తలపిస్తోది..మీ పాటల వరుస చూస్తుంటే వేణూజీ మిమ్మల్నో ప్రశ్న అడగాలనుందండీ..యేమీ అనుకోరుగా..ఇంతకీ, మీ కవితా కన్యక యెవరో తెలుసుకోవచ్చా..

థాంక్స్ శాంతి గారు, అవునండీ బాలు గొంతు చాలాబాగుంటుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.