శుక్రవారం, ఏప్రిల్ 09, 2021వేణూశ్రీకాంత్వ్యాఖ్యల్లేవు
ఈ రోజు విడుదలవుతున్న ’వకీల్ సాబ్’ సినిమా విజయవంతమవాలని ఆ సినిమా బృందానికీ పవన్ అభిమానులకూ బెస్ట్ విషెస్ చెబుతూ అందులోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
జాన్ అప్పారావ్ 40 ప్లస్ సినిమా కోసం "ఎన్నెన్నో జన్మల బంధం" పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జాన్ అప్పారావ్ 40 ప్లస్ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
రీమిక్స్ : కిరణ్ వారణాసి
గీతరచయిత : దాశరథి
గానం : హేమచంద్ర, గీతామాధురి
రాజన్-నాగేంద్ర గారు స్వరపరచిన ఈ అందమైన ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : దాశరథి
గానం : బాలు, వాణీ జయరాం
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి నిన్నే చూసిన వేళా నిండును చెలిమి ఓహో హో హో ..నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా. చేరనా.. చేరనా...
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
విరిసిన కుసుమము నీవై మురిపించేవు తావిని నేనై నిన్నూ పెనవేసేను ఓహో హో హో మేఘము నీవై నెమలిని నేనై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా...
మంగమ్మ గారి మనవడు సినిమాలోని ఈ పాట తెలియని తెలుగు వారుండరేమో. ఈ పాటని తనీష్, నాని నటించిన రైడ్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. రీమిక్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ హేమచంద్ర బాగానే దంచడంతో అప్పట్లో కుర్రకారు ఒక రేంజ్ హిట్ చేశారు, నేనూ తెగ వినేవాడ్ని. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. మంచి క్వాలిటీ వీడియో ఉంది కానీ కాపీరైట్స్ వల్ల అనుకుంటా ఇండియా లో బ్యాన్ అయింది. మీరు ఇతర దేశాల్లో ఉంటే అది ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రైడ్ (2009)
సంగీతం : కె.వి.మహదేవన్
రీమిక్స్ : హేమచంద్ర
సాహిత్యం : సినారె
గానం : టిప్పు, సైంధవి
ఇక ఒరిజినల్ ప్రత్యేకత ఒరిజినల్ దే కదా ఎప్పుడూ.. ఆనాటి ఈ సూపర్ హిట్ సాంగ్ ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ రోజు ఇటీవల విడుదలైన బేవార్స్ అనే చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. భాస్కరభట్ల గారు దీపావళిని కాంతిపూల పండగ అనడం నాకు చాలా నచ్చింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
శనివారం, సెప్టెంబర్ 15, 2018వేణూశ్రీకాంత్2 వ్యాఖ్యలు
వరుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : వరుడు (2010) సంగీతం : మణిశర్మ సాహిత్యం : వేటూరి గానం : రంజిత్, సునంద, మాళవిక,
హేమచంద్ర, జమునా రాణి
ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు
ఇందరింతుల చేయి సుందరుడీ హాయి తలకు పోసె చేయి తలపులొక్క వేయి నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు
మగపెళ్లి వారట నేమాని వారట పెళ్లికి తరలి వస్తున్నారట కాఫీలు అడగరట ఉప్మాలు ఎరగరట వీరికి సద్దన్నమే ఘనమౌ వీరి గోప్పలు చెప్ప తరమా బాండ్ మేళాం అడగరట డోలు సన్నాయి ఎరగరట వీరికి భోగ మేళాం ఘనమౌ వీరి గోప్పలు చెప్ప తరమా మగపెళ్లి వారట నేమాని వారట పెళ్లి కి తరలి వస్తున్నారట ఇమ్మని కట్నం కోరి మేం అడగేలేదు ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాల్మాకు దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి కానుపూరు కండ్ల జోడు కావాల్మాకు దానికి తగిన రిస్టు వాచ్ ఇప్పించండి ఇమ్మని కట్నం కోరి మేం అడగేలేదు ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి
నచ్చె నచ్చె అచ్చ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ యె ఎక్కడ
అది లబొ దిబొ గబ్బొ జబ్బొ మారేజి లవ్వు మారేజి అది హనీ మూన్ అవ్వoగానె డామేజీ ఎవరికి వారె యమునా తీరె పాకేజి తోక పీకేజి అది అటొ ఇటొ అయ్యిందంటె దారెదీ కృష్ణా బారేజ్
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ
చేదు కాదోయి తమలాకు ముక్క అందులొ వెయ్యి సిరిపోక సెక్క సున్నమేసావొ నీ నోరు పొక్క ఫక్కు మంటాది మా ఇంటి సుక్క పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక ఎక్క వచ్చోయి పూమల్లె పక్క
పంచుకొవచ్చు మా పాల సుక్క పండుకోవచ్చు సై అంటె సుక్క తెల్లవారాక నీ బుగ్గ సుక్క గుమ్మ తిలకాల గురుతైన లక్క కడిగినా పోదు ఈ బంధమల్లూడొ నిండు నూరేళ్ళదీ జంట అక్క
నిన్ను దీవించిన ఆడ బిడ్డ ఊరు దివిసీమలో నందిగెడ్డ ఆడ పంతుళ్ల అక్షింతలడ్డ మంచి శకునాల మీ ఇంట సెడ్డ మమ్ము కనిపెట్టు మా రాస బిడ్డ
తట్టలొ కూర్చుండ బెట్టిన వధువునా గుమ్మడి పువ్వులొ కులికెనొకటీ.. అది మంచు ముత్యమా మన వధువు రత్నమా
హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
మామ్ చిత్రంలోని ఒక చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
రాజుగాడు చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఇంద్రసేన చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఇంద్రసేన (2017) సంగీతం : విజయ్ ఆంథోని సాహిత్యం : భాష్యశ్రీ గానం : హేమచంద్ర, సుప్రియ జోషి
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే నిద్దురపోయే నా కంటి నిద్దురమొత్తం వీడిపోయే హే నీవల్లే చేరిపోయే నా రక్తంలో మత్తే ఎక్కి తూగిపోయే హే నా వల్లే
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
ఎన్నెన్నో జన్మాలు వెతికాయి రాత్రంత నా రెండు నయనాలు నీకోసము నాలోని ఎరుపంత మింగేసి నీ పెదవి కసితీర తీస్తుందె నా ప్రాణము ఓఓ నడిచేటి నదిలాగె వచ్చావురా అదిరేటి ఎద చప్పుడయ్యావురా నన్నైన నే మరిచి పోగలనురా అరె నిను మరిచి పోతే నేనుంటానయ్యా
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
ఆకాశమేదాటి స్వర్గాలె వెతికాను నీలాంటి దేవత లేనే లేదు ఏ భాషలేనట్టి నీ కంటి ఊసులకు అర్ధాలు వెదికేను నా ధ్యానము నువ్ ఔనన్న కాదన్న నా సోకువి ఏడ్చిన నవ్విన నా బంటువి గెలిచిన ఓడిన నా విజయమే విడిచిన దాచిన నా ప్రాణమే
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
శనివారం, ఫిబ్రవరి 24, 2018వేణూశ్రీకాంత్2 వ్యాఖ్యలు
సీమటపాకాయ్ చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సీమటపాకాయ్ (2011) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం : చిలకరెక్క గణేష్ గానం : హేమచంద్ర, ఉష
కందిచేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందు కొచ్చినావు ముద్దుపెట్ట చూసినావు ఎట్టా ఉంది మామ ఒళ్ళు నీకేట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టెట్ట ఉంది నీ ఒళ్ళూ..
అరె అందమంత ఆరబోసి గడ్డిమోపు ఎత్తుకోని గట్టుమీద పోతు ఉంటె వయసు వేడి మీద ఒళ్ళు ఇట్టిట్టా ఉంది పిల్ల ఒళ్ళూ ఇట్టా ఉంది పిల్ల ఒళ్ళూ ఎట్టేట్టో ఉంది పిల్లా ఒళ్ళూ
బావ నువ్వు అంటే భలే మోజు అంటివి రోజు కొంటె లుక్కులిచ్చి నవ్వు రువ్వుతుంటివి నిమ్మతోట కాడ నన్ను చేరమంటివి తీర చేరినాక నువ్వు తుర్రుమంటివీ నమ్మానమ్మ నీ మాట
ఆశ హుష్ కాకాయె ఈ పూట నమ్మానమ్మ నీ మాట
ఆశ హుష్ కాకాయె ఈ పూట
మాచర్ల సంతకెళ్ళి పూలుతెస్తివి కొప్పులోన గుచ్చమంటె నడుము నొక్కబోతివి మంచెకాడ కొంగు పట్టి లాగబోతివి నన్ను అటూ ఇటూ కదలకుండ చేయి పట్టుకుంటివి పైటలాగుతుంటీవి నువ్ పరేషాను పెడుతుంటివి పైటలాగుతుంటీవి నువ్ పరేషాను పెడుతుంటివి
ఊరిలోన పేరువున్న పోరగాడిని నీ ఒంపుసొంపు చూసి వదిలిపెట్టలేకపోతిని ఊరగాయలాంటి నీ ఊపు చూస్తిని అబ్బ నోరు ఊరి ఒక్కసారి ముందుకొస్తినీ పట్టేయ్ పిల్ల ఇంక నా చేయి శివరాత్రే ఇంక ప్రతి రేయి పట్టేయ్ పిల్ల ఇంక నా చేయి శివరాత్రే ఇంక ప్రతి రేయి
కందిచేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందు కొచ్చినావు ముద్దుపెట్ట చూసినావు ఎట్టా ఉంది మామ ఒళ్ళు నీకేట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టెట్ట ఉంది నీ ఒళ్ళూ..
అరె అందమంత ఆరబోసి గడ్డిమోపు ఎత్తుకోని గట్టుమీద పోతు ఉంటె వయసు వేడి మీద ఒళ్ళు ఇట్టిట్టా ఉంది పిల్ల ఒళ్ళూ ఇట్టా ఉంది పిల్ల ఒళ్ళూ ఎట్టేట్టో ఉంది పిల్లా ఒళ్ళూ
ఈ రోజు బాలల దినోత్సవం సంధర్బంగా వారికి శుభాకాంక్షలు అందజేసుకుంటూ.. వారిలో స్ఫూర్తి నింపే ఈ చక్కని గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
గోల్కొండ హైస్కూల్ చిత్రంలోని ఒక ఉత్తేజభరితమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఒకమనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఇక్కడ ఎంబెడ్ చేసినది పాట ట్రైలర్ మాత్రమె పూర్తిపాట లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : ఒకమనసు (2016)
సంగితం : సునీల్ కశ్యప్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : హేమచంద్ర, ప్రణవి
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం ఎంత బాగుందిలే పరవశం
నా మనసున తొలకరి వానలు కురిసినవే నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే నా కనులలో రంగుల తారలు మెరిసినవే నా అల్లరి ఆశలు అలలుగ ఉరికినవే
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం ఎంత బాగుందిలే పరవశం
నేల మొత్తం వాన విల్లై వూగుతోందీ వింతగా వీధులన్నీ వెన్నెలల్లే వెలిగిపోయే ఎంత బాగా ఓ చల్లనిగాలే రోజూ నిలువెల్లా తాకినా
హా ఈరోజే మరి నన్నూ గిలి గిలిగా గిల్లెనా నీ జతే ఉండగా.. పూటకో పండగా.. గుండెకే వచ్చిపోదా..
నా ఎదురుగ జరిగే సంగతులేవైనా అది నీ వలనే అని గమనిస్తూ ఉన్నా నా లోపల జరిగే వేడుక ఏదైనా ఇక జంటగా నీతో జరపాలంటున్నా
నేను అంటే నేను కాదే నీకు ఇంకో పేరులే నువ్వు అంటే నువ్వు కాదే నాకు ఇంకో అర్థమేలే
చూపులు కలిసిన తరుణం మహబాగా ఉందిలే మనసుకి పట్టిన వ్యసనం అది నువ్వే అందిలే గట్టిగా హత్తుకో.. ముద్దులే పెట్టుకో.. నన్నిలా కప్పుకోరా.. నేనున్నది అన్నది గురుతుకి రాకుండా నా వెన్నెల వేకువ అన్నీ నువ్వైపో ఈ లోకం కంటికి ఎదురే పడకుండా నా లోకం మైకం అన్నీ నువ్వైపో
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం ఒకటిగా మారగా ఇద్దరం గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం ఎంత బాగుందిలే పరవశం
ప్రేమలో ఉన్న వాళ్ళకు ప్రపంచమే తెలీదంటారు కదా.. అలాంటి ఓ కుర్రాడు ప్రేమలో పడుతూ లేస్తూ ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాడో అనిరుధ్ స్వరం కట్టిన ఈ పాటలో వినండి. ఈ పాట చిత్రీకరణ అందులో ధనుష్ నటన చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : రఘువరన్ బి.టెక్ (2014)
సంగీతం : అనిరుథ్ రవిచందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హేమచంద్ర
చూడండి సారు మన సూపర్ స్టారు
కుమ్మేస్తన్నారు వన్ సైడు ప్యారు
ఎర్రబసే ఎగురున ఐఫిల్ టవరే వొంగునా
రేల్వే ట్రాకు పై ఎరోప్లెయినే తిరుగునా
తిరుగున...తిరుగున...తిరుగున....తిరుగున
అయ్యో చూడండి సారు మన సూపర్ స్టారు...
వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు
టెడ్డీ బేర్ పలుకునా బార్బీ డాల్ పాడునా
రేయిన్ బో రంగులో బ్లాక్ కలర్ దొరుకునా
దొరుకున... దొరుకున...... దొరుకున..... దొరుకున
అహా చూడండి సారు మన సూపర్ స్టారు
దుమ్ము లేపేస్తున్నారు లవ్ మాగ్నెటిక్ పవరూ
గూగుల్ గాల్లో కలిసినా
ఫేస్బుక్ షటరే మూసిన అరెరె రఘువర
నీ లవ్వే గెలుచునా సిమ్ కార్డే లేనిదే సెల్ ఫోను మోగునా
ఊహలు గుస గుసలాడే సినిమా కోసం కళ్యాణి కోడూరి గారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈరోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
గురువారం, ఫిబ్రవరి 13, 2014వేణూశ్రీకాంత్5 వ్యాఖ్యలు
నిన్న తొంభైలలో పాటలు విన్నారు కదా ఇంకో ఇరవై ఏళ్ళు ముందుకు వస్తే ప్రస్తుత కాలంలో వస్తున్న పాటలలో ఈ రెండు పాటలూ చాలా బాగుంటాయ్. ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన కె.ఎమ్.రాధాకృష్ణ స్వరకల్పనలో వచ్చిన ఈ పాటకు ఆషా భోంస్లే స్వరం ప్లస్ తన ఉచ్చారణే ఒక సొగసును అద్దాయి అనిపిస్తుంది. తెలుగు భాషాప్రేమికులకు ఈ మాటలు మింగుడు పడకపోవచ్చు కానీ కాజల్ కు ఈ వైవిధ్యమైన స్వరంతో ఇలా పాడడం చాలా చక్కగా సూట్ అయిందని నా అభిప్రాయం. ఈపాట చిత్రీకరణ కూడా కృష్ణవంశీ శైలిలో చాలాబాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : చందమామ (2007) సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : ఆషా భోంస్లే, కె.ఎం. రాధాకృష్ణన్
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ...
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ ఆ ఆ ఆ ఆ
సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ.. పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ రారెరెరాఆ..
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా ఆ ఆ
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
ఆ ఆ ఆ ఆ ఆ
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ ఆ ఆ ఆ రారెరెరాఅ..ఆఅ..
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ... పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
మణిశర్మ స్వరసారధ్యంలో అభిరుచి ఉన్న దర్శకుడు చైతన్య దర్శకత్వంలో వచ్చిన బాణం చిత్రంలోని "నాలో నేనేనా.." పాట కొత్తపాటలలో ది బెస్ట్ పాట, చాలా బాగుంటుంది. సోలో లాగా అనిపించే ఈ డ్యూయెట్ ని మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. ఈ పాట గురించి గతంలో సినిమా విడుదలైనపుడు నేను రాసుకున్న టపా ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బాణం(2009) సహిత్యం : రామజోగయ్య శాస్త్రి సంగీతం : మణి శర్మ గానం : హేమచంద్ర , సైంధవి
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నేలేని మైమరపునా.. ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో.. విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన మనసే నాదీ.. మాటే నీదీ.. ఇదేం.. మాయో...
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నేలేని మైమరపునా.. ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో.. చిన్న మాటేదో నిన్నడగనా..
ఔనూ కాదు తడబాటునీ..
అంతో ఇంతో గడి దాటనీ.. విడి విడి పోనీ పరదానీ..
పలుకై రానీ ప్రాణాన్నీ.. ఎదంతా పదాల్లోన పలికేనా.. నా మౌనమే ప్రేమ ఆలాపన.. మనసే..నాదీ.... మాటే..నీదీ.. ఇదేం.. మాయో..
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నేలేని మైమరపునా.. ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో.. చిన్న మాటేదో నిన్నడగనా..
భీష్మ...
-
త్రివిక్రం గారి ప్రియ శిష్యుడు వెంకీ కుడుముల ఇంటిల్లి పాది హాయిగా
నవ్వుకుంటూ చూసొచ్చేలా తీసిన సినిమా భీష్మ. సినిమాలో అక్కడక్కడ మనం
త్రివిక్రమ్ సినిమా చూస...