శనివారం, ఆగస్టు 01, 2015

చూడండి సారూ...

ప్రేమలో ఉన్న వాళ్ళకు ప్రపంచమే తెలీదంటారు కదా.. అలాంటి ఓ కుర్రాడు ప్రేమలో పడుతూ లేస్తూ ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాడో అనిరుధ్ స్వరం కట్టిన ఈ పాటలో వినండి. ఈ పాట చిత్రీకరణ అందులో ధనుష్ నటన చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రఘువరన్ బి.టెక్ (2014)
సంగీతం : అనిరుథ్ రవిచందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హేమచంద్ర

చూడండి సారు మన సూపర్ స్టారు
కుమ్మేస్తన్నారు వన్ సైడు ప్యారు
ఎర్రబసే ఎగురున ఐఫిల్ టవరే వొంగునా
రేల్వే ట్రాకు పై ఎరోప్లెయినే తిరుగునా
తిరుగున...తిరుగున...తిరుగున....తిరుగున

అయ్యో చూడండి సారు మన సూపర్ స్టారు...
వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు

టెడ్డీ బేర్ పలుకునా బార్బీ డాల్ పాడునా
రేయిన్ బో రంగులో బ్లాక్ కలర్ దొరుకునా
దొరుకున... దొరుకున...... దొరుకున..... దొరుకున

అహా చూడండి సారు మన సూపర్ స్టారు
దుమ్ము లేపేస్తున్నారు లవ్ మాగ్నెటిక్ పవరూ

గూగుల్ గాల్లో కలిసినా
ఫేస్బుక్ షటరే మూసిన అరెరె రఘువర
నీ లవ్వే గెలుచునా సిమ్ కార్డే లేనిదే సెల్ ఫోను మోగునా
బిబిసి ఛానల్లో చిత్రహార్ చూపునా
సండే రోజున గుడ్ ఫ్రైడే వచ్చునా
అరెరె రఘువరా నీ లవ్వే గెలుచున


1 comments:

నిజంగానే వన్సైడ్ లవ్ లో కన్వీనియన్స్ అదే కదా..యేవైనా చెప్పేయచ్చు..అవతల వాళ్లు ఓకే అన్నాకే అసలు చిక్కు..చెప్పినవన్నీ చేయాలిగా మరి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.