అఖండుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అఖండుడు (1970)
సంగీతం : టి.చలపతి రావు
సాహిత్యం : దాశరధి
గానం : పి.బి.శ్రీనివాస్
ఓ..ఓ..ఓ..ఓ..ఓఓ..
ఓ..హో..హో..ఒ ఒ ఒ ఊ
ఒ ఒ ఒ ఊ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
హంస..నడలదానా
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
నా వలపు..తెలుపుకోనా
నీ మనసు..తెలుసుకోనా
నీ పెదవిపై..చిరునవ్వునై
నీ పెదవిపై..చిరునవ్వునై
కలకాలం..ఉండిపోనా
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
నీ సొంపులు చూసి..నీ సొగసులు చూసి
నీ సొంపులు చూసి..సొగసులు చూసి
నా మది తొందర చేసే..
నీ మోములో ఒక జాబిలి..
నీ మోములో..ఓ..ఒక జాబిలీ
నా కన్నుల వెన్నెల..సొగసే
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
నీ చల్లని మాటే..ఒక కమ్మని పాటై
నీ చల్లని మాటే కమ్మని పాటై
వినిపించెను నా నోట..
నా రాగమే అనురాగమై..
నా రాగమే..ఏ..అనురాగమై
వేసింది పూలబాట
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
నా వలపు..తెలుపుకోనా
నీ మనసు..తెలుసుకోనా
నీ పెదవిపై..చిరునవ్వునై
నీ పెదవిపై..చిరునవ్వునై
కలకాలముండిపోనా
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
ఒక తీయని స్వప్నం..అది మలచిన శిల్పం
ఒక తీయని స్వప్నం..మలచిన శిల్పం
నాలో నిలచిన..రూపం
ఈ రూపమే..నా మనసులో
ఈ రూపమే..ఏ..నా మనసులో
వెలిగించెను..రంగుల దీపం
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
1 comments:
పాత సినిమాల్లో చాలా మటుకు..పాప్ సాంగ్స్ లో కూడా మనసుని హత్తుకునే మెలొడీ దాగి ఉంటుంది కదండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.