పదహారేళ్ళ వయసు చిత్రంలోని ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా
తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడా నా సందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా
కొండల్లో కోనల్లో కూయన్న ఓ కొయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా
1 comments:
హేట్సాఫ్ టూ..రాఘవేంధ్రరావుగారు,వేటూరి గారూ,చక్రవర్తిగారూ,జానకమ్మ..లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీదేవి..మరో మాట లేదు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.