శుక్రవారం, ఆగస్టు 21, 2015

కలల మహరాజు..

భాషా చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందామ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : భాషా (1995)
సంగీతం : దేవా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
నచ్చిన వాడే నా ఆశే తీరగ వచ్చెనిలా
వెలిగేనమ్మా నా కన్నుల చల్లని వెన్నెలలే
గంగై నా మది పొంగేనే దిగిరా నా జతనీవే..

కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

రావే కలవాణీ నీవేలే అలివేణీ
మదినేలీ అలరించే మారాణీ ప్రేమల మాగాణీ 
నీవే రాజువనీ వలచినదీ పూబోణీ 
మదిలో అనురాగం విరబూయగ చేరే మహరాణీ
తరించేటి మోజే ఫలించాలి నేడూ 
తాపాలు తీరే విలాసాలు చూడూ 
ఇది కలరవమా తొలి కలవరమా

కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

తోడై వచ్చాడే మది నాకే ఇచ్చాడే 
నీడై నను కాచే మొనగాడే జతగా దొరికాడే 
ముద్దుల మురళి వినీ ఎద పొన్నై పూచిందీ 
పాటే విరితోటై సిరిపైటే స్వాగతమిచ్చిందీ 
నామేని వీణా శృతి చేసుకోరా 
తాపాలలోనా జత చేరుకోనా 
ఏ విందుకనీ ఈ తొందరలు 

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
నచ్చిన వాడే నీ ఆశే తీరగ వచ్చెనిలా
వెలిగేనమ్మా నీ కన్నుల చల్లని వెన్నెలలే
మోహంలో మది గంగై పొంగెనుగా నా జతనీవే..

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

1 comments:

ఈ సినిమాలో అన్ని పాటలూ ట్యూన్స్+పిక్చరైజేషన్ చాలా బావుంటాయి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.