మంగళవారం, ఆగస్టు 18, 2015

నీ మది చల్లగా...

ఎప్పుడు విన్నా మనసుకు ఊరటనిచ్చే అందమైన పాటను ఈ రోజు తలచుకుందామా. ఈ పాట చిత్రీకరణ కూడా నాకు చాలా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : ధనమా దైవమా (1973)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : సుశీల

నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...

ఏ సిరులెందుకు?... ఏ నిధులెందుకు?
ఏ సౌఖ్యములెందుకు?... ఆత్మశాంతి లేనిదే..
మనిషి బ్రతుకు నరకమౌను...
మనసు తనది కానిదే...

నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...

చీకటి ముసిరినా?... వేకువ ఆగునా?
ఏ విధి మారినా... దైవం మారునా?
కలిమిలోన లేమిలోన... 
పరమాత్ముని తలచుకో...

నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...

జానకి సహనము... రాముని సుగుణము
ఏ యుగమైనను నిలచె ఆదర్శము
వారి దారిలోన నడచువారి జన్మ ధన్యము...

నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...


1 comments:

డివైన్ లల్లుబీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.