శనివారం, ఆగస్టు 22, 2015

ఈ రేయి తీయనిది..

ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో వచ్చిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి


పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి
ఆఆఅ..ఆఅహహ..ఆహా..

పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగ నునుమేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది
 

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది  
 

4 comments:

సన్నగా వయలిన్ రాగాలు గుండెని తాకుతున్నట్టుంటుందీ పాట..

రాజేశ్వరరావు గారు తెలుగువారవడం తెలుగుతల్లి అదృష్టం.సుశీల సరస్వతీ దేవి వీణయే!బాలసుబ్రహ్మణ్యం ఎంతో న్యాయం చేసారు.

అవును రాజా రావు గారూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

చాలా బాగా చెప్పారు శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.