సోమవారం, ఆగస్టు 10, 2015

జోరుమీదున్నావు తుమ్మెదా...

రమేష్ నాయుడి గారి స్వరకల్పనలో వచ్చిన ఒక అద్భుతమైన గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : దాసం గోపాల కృష్ణ
గానం : సుశీల

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

ముస్తాబు అయ్యావు తుమ్మెదా
కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా
మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా
ఆ మాలెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా
గుత్తంగ కుట్టావు తుమ్మెదా
ఒత్తైన పరుపుపై తుమ్మెదా
అత్తర్లు చల్లావు తుమ్మెదా
ఆ ... ఆ...  ఆ...  ఆ...  ఆ
పక్కవేసుంచావు తుమ్మెదా
ఆ పక్కెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా


1 comments:

అప్పుడూ..ఇప్పుడూ..యెప్పుడూ ..అమ్మాయిలూ జాగ్రత్త అని అందంగా తెలిపే పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.