గురువారం, ఆగస్టు 13, 2015

చెక్కిలి మీద చెయ్యి వేసి..

మాంగల్య బలం చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మాంగల్యబలం (1958) 
సంగీతం : మాస్టర్ వేణు 
సాహిత్యం : శ్రీశ్రీ / కొసరాజు 
గానం : మాధవపెద్ది, జిక్కి 

చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన

చేసిన మేలు మరువలేను చిన్నవాడా 
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా 

ఆడదాని బ్రతుకంటే తీగవంటిది 
బగా నీరు పోసి పెంచకుంటె సాగనంటదీ 
ఆడదాని బ్రతుకంటే తీగవంటిది 
మగతోడు ఉంటేనే జోరుగుంటదీ 
అది మూడు పూలు ఆరుకాయలవుతుంటది 

చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన

చదువు సంధ్యాలేని చవటను గానోయ్ 
నీ చాతుర్యమంతా నేను కనిబెడితినోయ్ 
చదువు సంధ్యాలేని చవటను గానోయ్
మగవారి నాటకాలు విని యుంటినోయ్ 
వారి మోజులెంత బూటకాలొ తెలుసుకొంటినోయ్ 

చేసిన మేలు మరువలేను చిన్నవాడా 
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా

ఒంటిగానే బ్రతుకంతా నడుపుకొందువా 
అబ్బా జంట జోలి లేకుండా జరుపుకొందువా 
ఒంటిగానే బ్రతుకంతా నడుపుకొందువా 
లోకులంటే కాకులనీ మర్చిపోదువా 
ఈ లోకమంటె లెక్కలేక ఎగిరిపోదువా

చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా
నీవు చింతబోదువెందుకే ఇంతలోన
నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన

ఊకదంపు నీతులన్నీ ఆలకిస్తినోయ్ 
నీ ఊహలోని కిటుకంతా విప్పి చూస్తినోయ్ 
ఊకదంపు నీతులన్నీ ఆలకిస్తినోయ్
సూటి పోటి మాటలన్నీ కట్టిపెట్టవోయ్ 
ఇంక చాటుమాటు చూపులన్నీ దాచిపెట్టవోయ్ 

చేసిన మేలు మరువలేను చిన్నవాడా 
నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా
నా జీవితమే మారిపోయే నేటితోడా


1 comments:

యెటువంటి విషయాన్నైనా ఇంత సున్నితంగా చెప్పగలిగితే యెదుటివారెప్పుడూ హర్ట్ కారేమో కదా వేణూజీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.