సత్యవతి(మంగ్లీ) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సత్యవతి(మంగ్లీ) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, ఏప్రిల్ 04, 2021

ఊరంతా వెన్నెలా...

రంగ్ దే సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. వీడియో ప్రోమో ఇక్కడ. 


చిత్రం : రంగ్ దే (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్    
సాహిత్యం : శ్రీమణి
గానం : మంగ్లి 

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
జగమంతా వేడుక మనసంతా వేధన
పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః

ఎవరికీ చెప్పవే ఎవరినీ అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మెచ్చని కూడా 
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్నా 
బాధ రంగే బతుకులో ఒలికిస్తూ

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఎవరితో పయనమో ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు 
కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః



  

సోమవారం, మార్చి 01, 2021

సారంగ దరియా...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న కొత్త సినిమా ’లవ్ స్టోరీ’ కోసం తెలంగాణా జానపదానికి చక్కని మాటలు కూర్చారు సుద్దాల అశోక్ తేజ. నిన్ననే విడుదలై యూట్యూబ్ నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : లవ్ స్టోరీ (2021)
సంగీతం : పవన్ సి.హెచ్  
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ 
గానం : మంగ్లీ

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

కాళ్ళకు ఎండి గజ్జల్ 
లేకున్నా నడిస్తే ఘల్ ఘల్ 
కొప్పుల మల్లె దండల్ 
లేకున్నా చెక్కిలి గిల్ గిల్ 
నవ్వుల లేవుర ముత్యాల్ 
అది నవ్వితే వస్తయ్ మురిపాల్ 
 
నోట్లో సున్నం కాసుల్ 
లేకున్నా తమ్మల పాకుల్ 
మునిపంటితో మునిపంటితో 
మునిపంటితో నొక్కితే పెదవుల్ 
ఎర్రగ ఐతదిరా మన దిల్ 

చురియా చురియా చురియా 
అది సుర్మా పెట్టిన చురియా 
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
 
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

ఓఓఓ..హోఓఓఓఓ...
హోఓఓఓఓ.. ఓఓఓఓ.. 

రంగేలేని నా అంగీ 
జడతాకితే ఐతది నల్లంగీ
మాటల ఘాటూ లవంగీ 
మర్ల పడితే అది శివంగీ
తీగలు లేని సారంగి 
వాయించబోతే అది ఫిరంగీ
గుడియా గుడియా గుడియా
అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని సెంపల ఎన్నెల కురియా 
దాని సెవులకు దుద్దుల్ మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళ దునియా 
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా 

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

ఓఓఓ..హోఓఓఓఓ...
హోఓఓఓఓ.. ఓఓఓఓ.. 


 

బుధవారం, డిసెంబర్ 11, 2019

రాములో రాములా...

అలవైకుంఠపురములో చిత్రంలోని మరో సూపర్ హిట్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల వైకుంఠపురములో (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : అనురాగ్ కులకర్ణి, సత్యవతి (మంగ్లి)

హే బ్రో ఆపమ్మ
ఈ డిచుక్ డిచుక్ కాకుండ
మన మ్యూజిక్ ఏమైన ఉందా?

అబ్బా కడుపు నిండి పోయింది బంగారం

బంటూ గానికి ట్వంటీటూ
బస్తిల మస్తు కట్టౌటూ
బచ్చాగాండ్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే సాలక ఓ నైటూ 
ఎక్కి డొక్కు బుల్లెట్టూ
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
 
సిల్కు చీర గట్టుకొని
చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లంగట్టిన బిర్యానీకి
బొట్టు బిల్ల పెట్టినట్టు
బంగ్లా మీద నిల్సోనుందిరో
ఓ సందామావ
సుక్క తాగక షక్కరొచ్చరో
ఏం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ

రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో

హేయ్ తమ్మలపాకే ఏస్తుంటే
కమ్మగ వాసన వస్తావే
ఎర్రగ పండిన బుగ్గలు
రెండూ యాదీ కొస్తాయే
అరె పువ్వుల అంగీ ఏస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెల 
దూరి లొల్లే చెస్తావే

అరె ఇంటి ముందు లైటు
మిణుకు మిణుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె నువ్వు లాగినట్టు ఒళ్ళు ఝల్లుమంటాందే

నాగస్వరం ఊదుతుంటె
నాగు పాము ఊగినట్టు
ఎంటాపడి వస్తున్న నీ
పట్టా గొలుసు సప్పూడింటు
పట్టనట్టే తిరుగుతున్నవే
ఓ సందామావ
పక్కకు పోయి తొంగిజూస్తవె
ఏం టెక్కురా మావ

రాములో రాములా నన్నాగం జేసిండురో
రాములో రాములా నా పానం తీసిండురో
రాములో రాములా నన్నాగం జేసిండురో
రాములో రాములా నా పానం తీసిండురో

రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో


సోమవారం, ఆగస్టు 27, 2018

శైలజరెడ్డి అల్లుడు చూడే...

శైలజారెడ్డి అల్లుడు సినిమాలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం : గోపీసుందర్
సాహిత్యం : శ్యాం కాసర్ల 
గానం : సత్యవతి (మంగ్లీ)

ఛమ్ ఛమ్ బల్ బరి జాతరే చూడే
బమ్‌చిక్ బమ్ బలిపోతాయ్యాడే
ప్రేమా పంతం నడుమన వీడే నలిగిపోతుండే
ఈ పోరడు హల్వా అయితుండే

తిప్పలు మస్తుగా బడ్డా
కొప్పులు రెండు కలువవు బిడ్డా
ఇంతటి కష్టం పడక
ఢిల్లీకి రాజవ్వచ్చుర కొడక

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్

శాసనమే తన మాట
నీ అత్త శివగామి బయట
పంతం కూతురు ఎదుట
టామ్ అండ్ జెర్రీ ఆట

అమ్మకు అచ్చు జిరాక్సు
ఈ బొమ్మకు పిచ్చి పీక్సు
బద్దలు కానీ బాక్సు
వద్దనే మాటకు ఫిక్సు

అత్తను చూస్తే నిప్పుల కుండ
కూతురు చూస్తే కత్తుల దండ
ఈ ఇద్దరూ సల్లగుండ

పచ్చటి గడ్డి భగ్గున మండ
పట్టిన పట్టు వద్దనకుండ
ఏ ఒక్కరు తగ్గకుండ
బాబు నీ నెత్తిమీదేస్తే బండ
పడ్డవురా నువ్వు లేవకుండ

అంటుకుపోతే ఆంటికి కోపం
బిగుసుకుపోతే బ్యూటికి కోపం
సన్ ఇన్ లానే సాండ్‌విచ్ పాపం
ఇరుక్కు పోయిండే
ఈ పోరడు మెషీన్ల చెరుకయిండే

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్

ఆ రైలు పట్టాలోలే
పక్కన్నే ఉంటారు వీళ్లే యే యే
మెళ్లోనే వేస్తారు నగలే యే యే
ఒళ్లంత చూస్తే ఇగోలే
కలిసుందాం రా సినిమా ఆ ఆ
కలిసే చూస్తారమ్మ
అటు ఇటు అచ్చు బొమ్మా ఆ ఆ
ఎన్నడు కలవవులేమ్మ

కట్టిన బట్ట పెట్టిన బొట్టు దగ్గర ఉండి
ఎక్కే బండి అన్నింట్ల అమ్మ సెలక్షన్
కడుపున పుట్టి అట్టకు మట్టి
పెరిగిన కుట్టి మాటలబట్టి
కట్టయ్యె ఉన్న కనెక్షన్
బాబు మట్టయ్యిపోయే ఎఫెక్షన్ 
నువ్వు తట్టుకోరా ఎమోషన్

అంటుకుపోతే ఆంటికి కోపం
బిగుసుకుపోతే బ్యూటికి కోపం
సన్ ఇన్ లానే సాండ్‌విచ్ పాపం
ఇరుక్కు పోయిండే
ఈ పోరడు మెషీన్ల చెరుకయిండే

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.