సోమవారం, ఏప్రిల్ 05, 2021

మనసెందుకిలా...

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం : శ్రీజో
గానం : అర్మాన్ మాలిక్, రమ్యబెహరా

హే మనసెందుకిలా 
నిలిచిన చోటిక నిలవదుగా
నీ కనులకి బహుశా ఏమైందో తెలుసా
ఆ పెదవులు చేసే మాయకి 
మాటలు చాలవిక
నా నడకలు నన్నే చేరక మానవుగా
అరక్షణము ఉండదు తిన్నగా ప్రాణము
అలజడి పడి నిను విడదే
అది విని గుండెలనాపిన దూరం 
మెలమెల్లగా కరిగినదే

ఊ ఊఊ ఊ ఊఊ… 
ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ

దగ్గరైన కొద్దీ దొరక్క జారకు
నీలి కళ్ళ తోటి కొరక్క మానకు
ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు
నిజము కదా
ఊపిరాడకుంటే ఈ కౌగిలేందుకు
ఎంత కోరికంటే ఓ గుండె చాలదు
ప్రేమ పొంగుతూనే పెదాలు దాచకు 
జతపడవా
ఎంతగానో నన్ను నేను ఆపుకున్న
చెంత చేరమంటూ సైగ చేస్తావే
ఆటలాడుతూనే ఒక్కటై కలిసే 
మనసులివే

ఊ ఊఊ ఊ ఊఊ… 
ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ

హా చెంప గిల్లుతుంటే నీ చూపు చల్లగా
గుండె అందుకుందే కేరింత కొత్తగా
ఊరుకోమనంటే ఆగేది కాదుగా 
మది సరదా
చెప్పలేక నీతో మనస్సు దాచగా
రెక్కలొచ్చినట్టు వయస్సు గోలగా
ఒక్కమాటతోనే తీసింది సూటిగా 
ప్రతి పరదా

ఎందుకని ఉండనీవు నన్ను ఊరికే
మాటలాడి మాయలోకి తోస్తావే
ఎంత ముద్దుగుంది దగ్గరవుతుంటే 
మన జగమే

ఊ ఊఊ ఊ ఊఊ… 
ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ ఊఊ



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.