చైతన్ భరధ్వాజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చైతన్ భరధ్వాజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, జనవరి 17, 2021

చుక్కల చున్నీకే...

ఎస్సార్ కళ్యాణమండపం సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఎస్సార్ కళ్యాణమండపం (2021)
సంగీతం : చైతన్ భరధ్వాజ్  
సాహిత్యం : భాస్కరభట్ల 
గానం : అనురాగ్ కులకర్ణి 
 
హే చుక్కల చున్నీకే 
నా గుండెను కట్టావే
ఆ నీలాకాశంలో 
గిర్రా గిర్రా తిప్పేసావే
మువ్వల పట్టీకే 
నా ప్రాణం చుట్టావే
నువ్వెళ్ళే దారంతా 
అరె..! ఘల్లు ఘల్లు మోగించావే
వెచ్చా వెచ్చా ఊపిరితోటి 
ఉక్కిరి బిక్కిరి చేశావే
ఉండిపో ఉండిపో నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయ్యారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా

కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకోలేను డప్పే కొట్టి చెప్పాలేను
పట్టలేని ఆనందాన్నే ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు 
నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాటాడకు
కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా

ఓ ఎడారిలా ఉండే నాలో సింధూ నదై పొంగావే
ఉండిపో ఉండిపో ఎప్పుడూ నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయ్యారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా

బాధనే భరించడం అందులోంచి బయటికి రాడం
చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారు
వాళ్లకీ తెలుసో లేదో హాయినే భరించడం
అంతకన్న కష్టం కదా అందుకు నేనే సాక్ష్యం కదా
ఇంతలా నేను నవ్వింది లేదు 
ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంకాలాగా 
మనసేనాడు ఊగలేదు

హే దాయి దాయి అంటూ ఉంటే 
చందమామై వచ్చావే
ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయ్యారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా 
 

మంగళవారం, డిసెంబర్ 10, 2019

బుజ్జి బుజ్జి బంగారం...

గుణ 369 చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుణ369 (2019)
సంగీతం : చైతన్ భరధ్వాజ్ 
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : నాకాష్ అజిజ్, దీప్తి పార్థసారధి

కలలో కూడా కష్టం కదే ఈ హాయి
కథ మొత్తం తిప్పేశావే అమ్మాయి

వదలకుండ పట్టుకుంటా నీ చెయ్యి
నువ్వట్టా నచ్చేశావోయ్ అబ్బాయి

నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా
నొప్పి పుట్టి ఎక్కళ్లేని సంతోషంలో తుళ్లుతున్నా
నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకోనా
పిచ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా

తప్పదింక భరించవే నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం చల్లుతుంది తీపి కారం

నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం తెంచుతుంది సిగ్గు దారం

సొంత ఊరిలో కళ్ల ముందరే
కొత్త దారులెన్నో పుట్టాయే
అంతేలేరా జంటగుంటే అంతేలేరా
సొంతవారితో ఉన్న నిన్నలే
గుర్తురాము పొమ్మనన్నాయే
జతలో పడితే జరిగే జాదూ ఇదేగా

ముద్దులెన్నో పెట్టాలిగా
పెట్టి గాల్లో పంపాలిగా
ఊపిరంతా గంధమైపోయేంతగా
ముందుకొచ్చే ఉన్నానుగా
ఎందుకమ్మా ఇంకా దగా
నన్ను మళ్లీ మళ్లీ ఊరించేంతగా

తప్పదింక భరించరా నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం పెట్టమాకు అంత దూరం

నిన్ను తాకితే ఒక్కసారిగా
పట్టుకుంది నన్ను అదృష్టం
చాల్లే చాల్లే ఎక్కువైంది తగ్గించాల్లే
ఉన్న జన్మనీ ముందు జన్మనీ
చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం
అడెడే అదిగో ముదిరే పైత్యం అదేలే

ఎన్నో ఎన్నో అన్నారులే
ఎన్నో ఎన్నో విన్నాములే
వట్టి మాటల్లోనే ఎన్నో వింతలే
సర్లే సర్లే చెప్పావులే
సందు సందు తిప్పావులే
వచ్చి చేతల్లోనే చూపిస్తా భలే

తప్పదింక భరించనా నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం నచ్చుతుంది శుక్రవారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం గుచ్చుతుంది పూలహారం


శనివారం, మే 11, 2019

సంపద్దోయ్ నన్నే...

సెవెన్ చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సెవెన్ (2019)
సంగీతం : చైతన్ భరధ్వాజ్ 
సాహిత్యం : శుభం విశ్వనాథ్
గానం : మధుశ్రీ

సంపద్దోయ్ నన్నే
మీసమంటి సూదితో
అందగాడా
సూడద్దోయ్ నన్నే
కోడె ఈడు చూపుతో
తుంటరోడా

సుట్టుపక్కలున్న వాళ్ళు
సద్దు సేత్తె ఒప్పుకోరు
రెచ్చగొట్టమాకు నన్నే
ఊరంతా గోలేనా..ఆఆ..
నీ మాయలోనే తేలానే నేనే
కౌగిలింతలో ఇంకనిన్ను నన్ను
ఇద్దరంటె పిచ్చోళ్ళే

పచ్చ బొట్టులాగా నిన్ను
అంటుకుంటినోయ్
చూసుకుంటినోయ్ 
దాచుకుంటినోయ్
నిన్నీ జన్మలో
కుంకుం బొట్టులా
పెట్టుకుంటినోయ్
గుండె గుళ్ళో
మాటే ఇస్తున్నా


సంపద్దోయ్ నన్నే
మీసమంటి సూదితో
అందగాడా
సూడద్దోయ్ నన్నే
కోడె ఈడు సూపుతో
తుంటరోడా


ఆకువక్క పంటలే
సిగ్గు బుగ్గ పండెలే
పెదాలలో తూరుపంతా
వాలిందిలే
రెండు రెక్కలొచ్చి
తేలి తేలి పోదామా
సన్నజాజల్లె మారి
వాడిపోదామా
చచ్చి పుట్టాలే ఇవ్వాళ్ళే
లోలో చూడు దాగుంది నువ్వే
పత్తి లాంటి నన్నే
ఒత్తి చేసినావులే
దీపమల్లె
చూసుకుంటా ఇంక
నిన్ను నేను
ఇంటిముంగిట

పచ్చ బొట్టులాగా నిన్ను
అంటుకుంటినోయ్
చూసుకుంటినోయ్ 
దాచుకుంటినోయ్
నిన్నీ జన్మలో
కుంకుం బొట్టులా
పెట్టుకుంటినోయ్
గుండె గుళ్ళో మాటే ఇస్తున్నా


చల్లా చల్లా గాలులే
పిల్లి మొగ్గలేసెలే
అల్లి బిల్లి ఆశలన్నీ నీవల్లనే
చేతి గాజు లాగ మార్చి
నిన్ను ఉంచెయనా
కాలి మెట్టెల్లే నిన్ను
చుట్టి పెట్టేయ్ నా
పిల్ల బంగారే హయ్యారే
నాలో చూడు నిండుంది నువ్వే
గాజు బొమ్మ మీద
దిష్టి చుక్క నువ్వెలే
వెన్నెలల్లే మారిపోరా
ఆడుకుంటా నేను
చంటి పాపలా

పచ్చ బొట్టులాగా నిన్ను
అంటుకుంటినోయ్
చూసుకుంటినోయ్ 
దాచుకుంటినోయ్
నిన్నీ జన్మలో
కుంకుం బొట్టులా
పెట్టుకుంటినోయ్
గుండె గుళ్ళో మాటే ఇస్తున్నా 

 

సోమవారం, డిసెంబర్ 10, 2018

పిల్లా..రా...

ఆర్.ఎక్స్ 100 చిత్రంలోని ఒక పాపులర్ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : RX100 (2018)
సంగీతం : చైతన్ భరధ్వాజ్
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : అనురాగ్ కులకర్ణి

మబ్బులోన వాన విల్లులా...
మట్టిలోన నీటి జల్లులా..
గుండెలోన ప్రేమ ముల్లులా..
దాగినావుగా

అందమైన ఆశతీరకా..
కాల్చుతుంది కొంటె కోరికా..
ప్రేమ పిచ్చి పెంచడానికా..?
చంపడానికా?

కోరుకున్న ప్రేయసివే..
దూరమైన ఊర్వశివే..
జాలి లేని రాక్షసివే..
గుండెలోని నా కసివే..

చేపకళ్ళ రూపసివే..
చిత్రమైన తాపసివే..
చీకటింట నా శశివే..
సరసకు చెలి చెలి రా..

ఎల్లా విడిచి బ్రతకనే పిల్లా రా..
నువ్వే కనబడవా.. కళ్ళారా..
నిన్నే తలచి తలచిలా.. ఉన్నాగా..
నువ్వే ఎద సడివే.. అన్నాగా..

ఎల్లా విడిచి ప్రతకనే పిల్లా.. రా..
నువ్వే కనబడవా.. కళ్ళారా..
నిన్నే తలచి తలచిలా.. ఉన్నాగా..
నువ్వే ఎద సడివే..

మబ్బులోన వాన విల్లులా..
మట్టిలోన నీటి జల్లులా..
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా!!

అందమైన ఆశతీరక..
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా?


చిన్నాదానా.. ఓసి అందాల మైనా
మాయగా మనసు జారిపడిపోయెనే
తపనతో నీ వెంటే తిరిగెనే
నీ పేరే పలికెనే
నీ లాగే కులికెనే
నిన్ను చేరగా..

ఎన్నాళ్ళైనా అవి ఎన్నేళ్ళు ఐనా
వందేళ్ళు ఐనా.. వేచి ఉంటాను నిన్ను చూడగా

గండాలైనా సుడి గుండాలు ఐనా.. ఉంటానిలా
నేను నీకే తోడుగా.. ఓ.. ప్రేమా
మనం కలిసి ఒకటిగా.. ఉందామా 
ఇదో ఎడతెగనీ.. హంగామా
 
ఎలా విడిచి బతకనే పిల్లా.. రా..
నువ్వే కనబడవా..

  
అయ్యో రామ.. ఓసి వయ్యారి భామ..
నీవొక మరపురాని మృదుభావమే
కిల కిల నీ నవ్వు తళుకులే
నీ కళ్ళ మెరుపులే
కవ్విస్తూ కనపడే గుండెలోతులో..

ఏం చేస్తున్నా.. నేను ఏ చోట ఉన్నా..
చూస్తూనే ఉన్నా..
కోటి స్వప్నాల ప్రేమ రూపము.
గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా..
రక్త మందారాలతో..

కాలాన్నే.. మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్లీ మన కథనే.. రాద్దామా

ఎల్లా విడిచి బతకనే పిల్లా రా..
నువ్వే కనబడవా?


గురువారం, ఆగస్టు 02, 2018

ఎవరే ఎవరే మనసుని పట్టి...

ఆర్ ఎక్స్ హండ్రడ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : శ్రీమణి
గానం : హరిచరణ్, ఉమానేహ

ఏ ఎవరే ఎవరే మనసుని పట్టి
దారం కట్టి ఎగరేసారే గాలిపటంలా
ఏ ఎవరే ఎవరే అడుగును పట్టి
చక్రం కట్టి నడిపించారే పూలరధంలా
 
ఎవరెవరో కాదది నీలోపల
దాక్కొని ఉండే టక్కరి నేనేగా
ఎక్కడని చూస్తావే నీ పక్కనె ఉన్నానుగా

అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్
అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట
వస్తాలే లక్షలమైళ్ళైనా నీ వెంట
హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర

విన్నావా మైనా గుండెల్లోనా హాయిల రాగాలెన్నో
ఎగిరే ట్యూనా చేపల్లోనా సోనా మెరుపులు ఎన్నో
నీలో రేగిన వేగం కల చెరిపే గాలుల రాగం
అలజడిలో గువ్వల గొడవే నే మరిచేసా

చూసావా మబ్బుల ఒళ్లే రుద్దే
మెరుపుల సబ్బులు ఎన్నో
ఎర్రని సూర్యుని తిలకం దిద్దే
సాయంకాలం కన్ను
ఏమైనా ఇంతందం చెక్కిందెవరో
చెబుతారా తమరు

ఎవరెవరో కాదది నీలోపల
తన్నుకు వచ్చే సంతోషం ఉలి రా
చక్కగా చెక్కేందుకు నెచ్చెలిగా నేనున్నానుగా
 
అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్
అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట
వస్తాలే లక్షలమైళ్ళైనా నీ వెంట
హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర

సెలయేరుకు పల్లం వైపే మళ్ళే నడకలు నేర్పిందెవరు
నేలకు పచ్చనిరంగే అద్ది స్వచ్ఛత పంచిందెవరు
ఎందుకు మనకా గొడవ నీ మాటైనా నువ్వినవా
నా తియ్యని పెదవే తినవా ఓ అరనిమిషం

ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు
వలపుకి తలుపే తీసిందెవరు తొలిముద్దిచ్చిందెవరు
ఏమైనా నాలో ఈ హైరానా తగ్గించేదెవరు

ఎవరెవరో కాదది నీలోపల
హద్దులు దాటిన అల్లరిని త్వరగా
దారిలో పెట్టేందుకు తోడల్లే నేనున్నానుగా

అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్
అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట
వస్తాలే లక్షలమైళ్ళైనా నీ వెంట
హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.