సోమవారం, ఫిబ్రవరి 22, 2016

గులాబి కళ్ళు రెండు...

యువన్ శంకర్ రాజా సంగీతంలో శ్రీమణి రాసిన ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : శ్రీమణి
గానం : జావేద్ అలీ

గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే.. ఓహో..
జిలేబి వొళ్ళో చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నావే.. ఓహో..
రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాళానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే పిల్లా పిల్లా ఓ.. ఓహో..

నాతోటి నీకింత తగువెందుకే నా ముద్దు నాకివ్వకా
అసలింత నీకెంత పొగరెందుకే పిసరంత ముద్దివ్వకా
నాపైన కోపమే చల్లార్చుకో ముద్దుల్తొ వేడిగా
నాపై ఉక్రోషమే తీర్చేసుకో పెదాల్తొ తీయగా
పిసినారి నారివే గోదావరి నా గుండెల్లో ఉప్పొంగి
ఉరికేంత ముద్దియ్యవే మరి మనోహరి
నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే...

ఏం మధువు దాగుందొ ఈ మగువలో చూస్తేనె కిక్కెక్కెలా
ఆ షేక్స్‌పియర్ అయినా నిను చూసెనో ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే పరదేశి నేనైనా
నీ పెంకి ముద్దునే భరించగా స్వదేశినవ్వనా
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి
నా అంతు తేల్చేసి న్యూక్లియర్ రియాక్టరై
నా అణువణువు అణుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే...

గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి
గుండెలోకి గుచ్చుతున్నావే.. ఓహో..
జిలేబి వొళ్ళు చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నావే.. ఓహో..
రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి
ఉడికించి పోతావె రాక్షసి సరాసరి
నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె
ఊర్వశి నీలో నిషా నషాళానికంటే
ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే పిల్లా పిల్లా ఓ.. ఓహో..



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.