గురువారం, ఫిబ్రవరి 18, 2016

శివరాతిరి నిదుర రాదే హో...

ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన ఓ చక్కని పాట విందామీరోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : మైఖేల్ మదన కామరాజు (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర

శివరాతిరి నిదుర రాదే హో
తొలి రాతిరి హాయి నీదే హో
మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి
శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి..
వయసు విరిసె
శివరాతిరి నిదుర రాదే హో
శివరాతిరి..

అంబరాన చల్లగాలి సంబరాలు చిలికె
వెచ్చనైన మచ్చికైన ఊసులెన్నో పలికె
చెప్పరాని ఆశలన్నీ కళ్ళలోన కదిలె
కమ్మనైన బాసలేవో గుండెలోన రగిలె
నీ నవ్వులే మల్లె పువ్వులే చూపే వెన్నెలే
నీ మాటలే పసిడి కోటలే నీవే నేనులే

శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి
వయసు విరిసె

శివరాతిరి నిదుర రాదే హో
తొలి రాతిరి హాయి నీదే హో
మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి
శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి
వయసు విరిసె
శివరాతిరి..

వన్నెలన్నీ వేచె నేడు వచ్చి చూడవేల
చందనాల తందనాల విందునందుకోవా
అర్ధరాత్రి అందగాడి ముద్దు తీర్చరాదా
పాల గువ్వ పక్కకొస్తే స్వర్గమదే కాదా
పైటంచున దాచుకుంటినే వయ్యారాలనే
నా కళ్ళతో నేను చూస్తే వన్నె తరుగునా

శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి
వయసు విరిసె

శివరాతిరి నిదుర రాదే హో
తొలి రాతిరి హాయి నీదే హో
మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి
శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి 
వయసు విరిసె
శివరాతిరి నిదుర రాదే హో
తొలి రాతిరి హాయి నీదే హో
శివరాతిరి..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.