తమ్ముడు చిత్రంకోసమ్ సిరివెన్నెల గారు వ్రాసిన ఓ అందమైన ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందామ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : తమ్ముడు (1999)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రమణ గోగుల, సునీత
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా
మనసు నిన్నే తలచుకుంటోంది
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా
మనసు నిన్నే తలచుకుంటోంది
వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
ఇదిగిదిగో కళ్లలో చూడు
కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు
నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా
బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
హే కోయిలా.. ఓ కోయిలా..
హే కోయిలా.. ఓ కోయిలా..
2 comments:
superb andee
థాంక్స్ శ్రీరామ్ గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.