సాలూరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాలూరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, జనవరి 03, 2021

పాలించరా రంగా...

విప్రనారాయణ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల 
గానం : ఏ. ఎం. రాజా

పాలించరా రంగా 
పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
కరుణాంతరంగ శ్రీరంగా...
పాలించర రంగా.. 

మరువని తల్లివి... తండ్రివి నీవని...
మరువని తల్లివి... తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా...
మొరవిని పాలించే..ఏ.. దొరవని
మొరవిని పాలించే..ఏ..ఏ.. దొరవని
శరణంటినిరా... శ్రీరంగా

పాలించర రంగా... 

మనసున నీ స్మృతి మాయకమునుపే 
మనసున నీ స్మృతి మాయకమునుపే
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా... ఆ... ఆ...
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా ..ఆ..ఆ...రంగా
కనియద మనసారా...

పాలించరా రంగా 
పరిపాలించరా రంగా

కరులును హరులును మణిమందిరములు
కరులును హరులును మణిమందిరములు
సురభోగాలను కోరనురా... 
సురభోగాలను కోరనురా...
దరి కనరానీ భవసాగరమును....
దాటించుమురా గరుడ తురంగా...

పాలించరా రంగా 
పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
పాలించర రంగా.. 
 

శుక్రవారం, డిసెంబర్ 25, 2020

జీవము నీవేకదా దేవా...

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ శ్రీహరికి నమస్కరించుకుంటూ భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు  
సాహిత్యం : సముద్రాల  
గానం : సుశీల  

ఆదుకోవయ్యా! ఓ!  రమేశా! 
ఆదుకోవయ్యా

పతితపావన శ్రితజనావన 
సుజన జీవన మాధవా!
భువననాయక ముక్తిదాయక 
భక్తపాలక కేశవా 

ఆదుకోవయ్యా! ఓ!  రమేశా! 
ఆదుకోవయ్యా

సర్వలోక కారణా! సకలశోక  వారణా!
జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా!
దుష్టగర్వ  శిక్షణా! శిష్ట  శాంతి రక్షణా! 
శాంతి  రక్షణా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా దేవా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా!!

జనకుడు నీపై కినుక వహించీ 
నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ 
సర్వము నీవే కదా స్వామీ !!

నిన్నేగానీ పరులనెరుంగా!
రావే! వరదా! బ్రోవగరావే! 
వరదా! వరదా! అని మొరలిడగా 
కరివిభు గాచిన స్వామివి 
నీవుండ భయమేలనయ్యా||
జీవము నీవే కదా||

హే! ప్రభో! హే! ప్రభో!
లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! 
కరుణా భరణా! కమల లోచన !
కన్నుల విందువు చేయగరావే ! 
అశ్రిత భవ భంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీ పద యుగళీ 
సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా 
పన్నగశయనా నారాయణా

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

మదిలో వెలిలో చీకటిమాపీ
ఆఆఅ... ఆఆఆ.అ....
మదిలో వెలిలో చీకటి మాపీ
పథము జూపే పతితపావనా!
పథము జూపే పతిత పావనా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

భవజలధినిబడి  తేలగలేని, 
జీవులబ్రోచే పరమపురుషా! 
నను కాపాడి నీ బిరుదమునూ  
నిలువుకొంటివా శ్రితమందార

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

విశ్వమునిండీ వెలిగే నీవే 
నాలోనుండీ నన్నుకావగా!
విషమునుద్రావా వెరువగనేలా 
విషధర శయనా! విశ్వపాలనా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా
 


సోమవారం, డిసెంబర్ 21, 2020

చూడుమదే చెలియా..

ఏ.ఎమ్.రాజా గారి స్వరంలో ఓ ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది మూగవైన ఏమిలే అన్నా చూడుమదే చెలియా అన్నా ఈ ప్రత్యేకత అమృతంలా మన వీనుల ద్వారా హృదయానికి చేరుకుని కనుల ముందు సన్నివేశాన్ని సాక్షత్కరింపచేసేస్తుంది. తను గానం చేసిన విప్రనారాయణ లోని ఈ మధురమైన పాట నాకు చాలా ఇష్టం, వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : సముద్రాల 
గానం : ఏ.ఎమ్.రాజా 

చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..


బృందావనిలో నందకిశోరుడు
బృందావనిలో నందకిశోరుడు
అందముగా దీపించే లీలా...
చూడుమదే చెలియా..కనులా
చూడుమదే చెలియా..


మురళీ కృష్ణుని మోహన గీతికి
మురళీ కృష్ణుని మోహన గీతికి
పరవశమైనవి లోకములే..
పరవశమైనవి లోకములే
విరబూసినవీ పొన్నలు పొగడలు
విరబూసినవీ పొన్నలు పొగడలు
పరిమళమెగసెను మలయానిలముల 
సోలెను యమునా...

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..
 
నారీ నారీ నడుమ మురారి
నారీ నారీ నడుమ మురారి
హరికీ హరికీ నడుమ వయ్యారీ
హరికీ హరికీ నడుమ వయ్యారీ
తానొకడైనా...ఆఆ.అ.అ.ఆఅ...
తానొకడైనా తలకొక రూపై
తానొకడైనా తలకొక రూపై
మనసులు దోచే రాధామాధవ కేళీ నటనా..
 
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..
 



శనివారం, డిసెంబర్ 19, 2020

యా రమితా వనమాలినా...

భక్త జయదేవ సినిమాలోని ఒక చక్కని జయదేవుని అష్టపదిని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. క్వాలిటీ ఉన్న ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భక్తజయదేవ (1961)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : జయదేవుడు 
గానం : ఘంటసాల, సుశీల 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 

వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
 
అమృత మధుర మృదుతర వచనేన 
అమృత మధుర మృదుతర వచనేన 
జ్వలతి న సా మలయజ పవనేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 

సజల జలద సముదయ రుచిరేణ 
దళతి న సా హృది విరహభరేన 
సజల జలద సముదయ రుచిరేణ 
దళతి న సా హృది విరహభరేన 

సకల భువనజన వర తరుణేన 
సకల భువనజన వర తరుణేన 
వహతి న సా రుజ మతి కరుణేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా

అనిల తరళ కువలయ నయనేన
తపతి న సా కిసలయ శయనేన
యా రమితా వనమాలినా 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా
 
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
వికసిత సరసిజ లలితముఖేన 
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన
 
అమృత మధుర మృదుతర వచనేన 
అమృత మధుర మృదుతర వచనేన 
జ్వలతి న సా మలయజ పవనేన 

యా రమితా వనమాలినా 
సఖీ ! యా రమితా వనమాలినా 


 

శుక్రవారం, డిసెంబర్ 18, 2020

మేలుకో శ్రీరంగా...

విప్రనారాయణ సినిమాలోని ఒక చక్కని మేలుకొలుపు గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తిపాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల సీనియర్ 
గానం : ఏ. ఎం. రాజా  

కౌసల్యా సుప్రజా రామ 
పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం 
దైవమాహ్నికమ్‌ 

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద 
ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త 
త్రైలోక్యం మంగళం కురు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూచి విరులు
విరితేనెలాని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాళి లేచెను నిదురా

చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది వేళాయె పూజలకు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

పరిమళ ద్రవ్యాలు బహువిధములౌ 
నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ముపూని 
మహర్షి పుంగవులు
మురువుగా పాడ 
తుంబురు నారదులును
నీ సేవకై వచ్చి నిలచియున్నారు
సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని 
మొగసాల కాచియున్నారు 

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

దేవరవారికై పూవుల సరులు తెచ్చిన
తొండరడిప్పొడి మురియ
స్నేహదయాదృష్టి చిల్కగా జేసి
పెద్దను విడి కటాక్షింప రావయ్యా

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
 

బుధవారం, నవంబర్ 18, 2020

రారా ప్రియా సుందరా...

భక్తప్రహ్లాద చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భక్తప్రహ్లాద (1967)
సంగీతం : సాలూరి 
సాహిత్యం : దాశరథి 
గానం : సుశీల

రారా! ప్రియా! సుందరా!
రారా! ప్రియా! సుందరా!
రారా! ప్రియా! సుందరా!

కౌగిలిలో నిన్ను కరగింతురా
కౌగిలిలో నిన్ను కరగింతురా
రారా! ప్రియా! సుందరా!
రారా! ప్రియా! సుందరా!

వెన్నెల వేళ విలాసాలతేల 
వెన్నెల వేళ విలాసాలతేల 
వేచితి నీకై క్షణాలే యుగాలై
వేచితి నీకై క్షణాలే యుగాలై
విరహములో నేను వేగినదాన 
విరహములో నేను వేగినదాన 
సరగున నన్నేలరా.. ఆఅ.ఆఆ..        
సరగున నన్నేలరా.. ఆఅ.ఆఆ..

రారా! ప్రియా! సుందరా! ఆఆఅ...
రారా! ప్రియా! సుందరా!
కౌగిలిలో నిన్ను కరిగింతురా
రారా! ప్రియా! సుందరా!
 


శుక్రవారం, నవంబర్ 13, 2020

మ్రోగింది కళ్యాణ వీణా...

కురుక్షేత్రం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కురుక్షేత్రం (1977)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

పిల్ల గాలితో నేనందించిన
పిలుపులే విన్నావో..ఓ..ఓ..
నీలి మబ్బుపై నే లిఖియించిన
లేఖలందుకున్నావో..
ఆ లేఖలే వివరించగా..
రస రేఖలే ఉదయించగా
ఆ లేఖలే వివరించగా..
రస రేఖలే ఉదయించగా
కల వరించి.. కలవరించి
కల వరించి.. కలవరించి..
పులకిత తనులత నిను చేరుకోగా..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

మత్త కోకిలలు ముత్తైదువులై
మంగళ గీతాలు పాడగా..ఆ..
మయూరాంగనలు ఆట వెలదులై..
లయ లహరులపై ఆడగా..
నా యోగమే ఫలియించగా..
ఆ దైవమే కరుణించగా..
నా యోగమే ఫలియించగా..
ఆ దైవమే కరుణించగా..
సుమశరుడే పురోహితుడై..
సుమశరుడే పురోహితుడై..
శుభ ముహూర్తమే నిర్ణయించగా..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
   

శుక్రవారం, నవంబర్ 06, 2020

అభినందన మందారమాల...

తాండ్రపాపారాయుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తాండ్ర పాపారాయుడు (1986)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : ఏసుదాస్, సుశీల

అభినందన మందార మాల..
అభినందన మందార మాల..
అభినందన మందార మాల.. 
అధినాయక స్వాగత వేళ..ఆ..
అభినందన మందార మాల..

స్త్రీజాతికీ.. ఏనాటికీ.. స్మరణీయ 
మహనీయ వీరాగ్రణికి..
అభినందన మందారమాల.. 
అధినాయక స్వాగత వేళ..ఆ..

వేయి వేణువులు నిన్నే పిలువగ.. 
నీ పిలుపు నావైపు పయనించెనా
వేయి వేణువులు నిన్నే పిలువగ.. 
నీ పిలుపు నావైపు పయనించెనా

వెన్నెల కన్నెలు నిన్నే చూడగ..
వెన్నెల కన్నెలు నిన్నే చూడగ.. 
నీ చూపు నారూపు వరియించెనా
నీ చూపు నారూపు వరియించెనా..

నా గుండె పై నీవుండగా.. 
దివి తానే భువిపైనే దిగివచ్చెనా
అభినందన మందారమాల.. 
అలివేణి స్వాగత వేళ..ఆ..
అభినందన మందారమాల..

సౌందర్యమూ సౌశీల్యమూ.. 
నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల..

వెండి కొండపై వెలసిన దేవర.. 
నెలవంక మెరిసింది నీ కరుణలో
వెండి కొండపై వెలసిన దేవర.. 
నెలవంక మెరిసింది నీ కరుణలో
 
సగము మేనిలో ఒదిగిన దేవత..
సగము మేనిలో ఒదిగిన దేవత.. 
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో..
ప్రియ భావమే లయ రూపమై.. 
అలలెత్తి ఆడింది అణువణువులో

అభినందన మందారమాల.. 
ఉభయాత్మల సంగమవేళ..ఆ..
అభినందన మందారమాల..
 

మంగళవారం, జులై 28, 2020

రంజుభలే రాంచిలక...

మావిచిగురు సినిమాలో అల్లురామలింగయ్య గారు జీన్స్ పాంట్ వేస్కుని అమ్మాయిల వెంటపడుతూ ఆటపట్టించే ఈ పాటను రంజుభలే రాంచిలుక అన్న రాజబాబు గారి పాటలోని పదాలను వాడి అల్లు గారిదే ముత్యాలూ వస్తావా అన్న పాట  బాణీలో స్వరపరిచిన పాట. సో ఆల్మోస్ట్ దానికి రీమిక్స్ అనుకోవచ్చేమో. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. వీడియో క్వాలిటీ తక్కువగా ఉంది సో యూట్యూబ్ లో ఆడియో సాంగ్ ఇక్కడ వినవచ్చు.


చిత్రం : మావిచిగురు (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, అనుపమ

హే లవ్లీ గర్ల్స్ .. ఇట్సె బ్యూటిఫుల్ డే..
యూ ఆర్ సో యంగ్..

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

నీ ఫ్రాకు చూసి నీ సోకు చూసి
బ్రేక్ డాన్సు చేసే మూడొస్తు ఉందే
నీ ఫ్రాకు చూసి నీ సోకు చూసి
బ్రేక్ డాన్సు చేసే మూడొస్తు ఉందే
సిద్ధం అంటే సరదా పడదామే..ఏ..ఏ..

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

ముత్తాతనంటూ మోమాట పడకే
సత్తాను చూస్తే మత్తెక్కుతావే
ముత్తాతనంటూ మోమాట పడకే
సత్తాను చూస్తే మత్తెక్కుతావే
ముస్తాబంతా చిత్తైపోతుందే..ఏ..ఏ..

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక

ఇక ఒరిజినల్ సాంగ్ ముత్యాలు వస్తావా పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : బాలు, సుశీల 

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ

చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయో

నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ
నీ కొంటె చూపు కొరికేస్తు ఉందీ
నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ
నీ కొంటె చూపు కొరికేస్తు ఉందీ
కన్నూ కన్నూ ఎపుడో కలిసిందీ

ఏందయ్యగోల.. సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా
ఏందయ్యగోల.. సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా
నిన్నూ నన్నూ చూస్తే నామరదా

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ

పరిమినెంటుగాను నిన్ను చేసుకొంటాను
ఉన్నదంత ఇచ్చేసీ నిన్ను చూసుకుంటాను
ఇంటా బయటా పట్టుకునుంటానూ
అహా... ఒహో.. ఏహే.. ఏ..

ఏరుదాటిపోయాక తెప్ప తగల ఏస్తేను
ఊరంతా తెలిసాక వదలి పెట్టి పోతేను
బండకేసి నిను బాదేస్తానయ్యో
రేవులోన నిను ముంచేస్తానయ్యో 

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయో 

 

సోమవారం, జులై 13, 2020

ఆడువారి మాటలకు...

ఖుషి సినిమా కోసం మిస్సమ్మ చిత్రంలోని "ఆడువారి మాటలకు" పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట ఒరిజినల్ ఫ్లేవర్ ఏమాత్రం చెడకుండా ఈ తరం అభిరుచికి తగినట్లుగా రీమిక్స్ అంటే ఇలాగే చేయాలనిపించేలా మణిశర్మ చేసిన ఈ రీమిక్స్ ఒరిజినల్ అంత పాపులర్ అయింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : ఖుషి (2001)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రీమిక్స్ : మణిశర్మ 
సాహిత్యం : పింగళి
గానం : ఖుషి మురళి

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచో
చెలిమిజేయ రమ్మనిలే
అలిగి తొలగి నిలిచినచో
చెలిమిజేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
మర్యాదగ పొమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
మర్యాదగ పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టమెలే
విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టమెలే
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ తరానికి రీమిక్స్ నచ్చితే ఆ తరానికి ఒరిజినల్ పాట ఎంతగా నచ్చిందో చెప్పనక్కర్లేదు కదా. ఆ ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : ఏ. ఎం. రాజా

ఔనంటే కాదనిలే
కాదంటే అవుననిలే
ఔనంటే కాదనిలే
కాదంటే అవుననిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో
చెలిమిజేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో
మర్యాదగ పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...

విసిగి నసిగి కసిరినచో
విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టమెలే
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...

ఔనంటే కాదనిలే
కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...
 

ఆదివారం, జులై 05, 2020

ఈ రేయి తీయనిది...

చిట్టి చెల్లెలు చిత్రంలోని ఒక అందమైన పాటను జానీ చిత్రం కోసం రీమిక్స్ చేశారు. పల్లవిని అలాగే ఉపయోగించుకున్నా చరణాలను మార్చి రాసిన ఈ పాట మీరూ వినండి. ఒరిజినల్ కి థీటుగా సాగిన ఈ రీమిక్స్ నాకు నచ్చిన పాటలలో ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జానీ (2003)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రీమిక్స్ : రమణ గోగుల 
సాహిత్యం : సినారె, సిరివెన్నెల
గానం : హరిహరన్, నందిత

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి


ఓ వరములా దొరికె నీ పరిచయం 
నా మనసులో కురిసెనే అమృతం 
నా నిలువునా అలలయే పరవశం 
నీ చెలిమికే చేయని అంకితం 
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం 

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి

నీ ఊపిరే వెచ్చగా తగలని 
నా నుదుటిపై తిలకమై వెలగని 
నా చూపులే చల్లగా తాకని 
నీ పెదవిపై నవ్వుగా నిలవని 
ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది
 
ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిట్టి చెల్లెలు చిత్రంలోని ఒరిజినల్ వర్షన్ సంగీత సాహిత్యాలివి. ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పన ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మాటలలో చెప్పలేం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి


పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి
ఆఆఅ..ఆఅహహ..ఆహా..

పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగ నునుమేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది
 

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది  
  

మంగళవారం, మే 19, 2020

చిలిపి నవ్వుల...

ఆత్మీయులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : దాశరథి
గానం : బాలు, సుశీల

చిలిపి నవ్వుల నిను చూడగానే
వలపు పొంగేను నాలోనే
వలపు పొంగేను నాలోనే

ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో
నిన్ను నే చేరుకున్నాను
నిన్ను నే చేరుకున్నాను


చూపుల శృంగారమొలికించినావు
ఆఆ..ఆఆ.ఆఆఆ...
చూపుల శృంగారమొలికించినావు
మాటల మధువెంతో చిలికించినావు
వాడని అందాల వీడని బంధాల
తోడుగా నడిచేములే..


చిలిపి నవ్వుల నిను చూడగానే
వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో
నిన్ను నే చేరుకున్నాను


నేను నీదాననే నీవు నావాడవే
నను వీడిపోలేవులే
కన్నుల ఉయ్యాలలూగింతునోయి
కన్నుల ఉయ్యాలలూగింతునోయి
చూడని స్వర్గాల చూపింతునోయి

తీయని సరసాల తీరని సరదాల
హాయిగా తేలేములే..

ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో
నిన్ను నే చేరుకున్నాను
నిన్ను నే చేరుకున్నాను

చిలిపి నవ్వుల నిను చూడగానే
వలపు పొంగేను నాలోనే
వలపు పొంగేను నాలోనే
ఆ..ఆ..ఆ..ఆ..


సోమవారం, మార్చి 23, 2020

ఏ దేశమేగినా...

అమెరికా అబ్బాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమెరికా అబ్బాయి (1986)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : సినారె
గానం : సుశీల 

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

రాయప్రోలన్నాడు ఆనాడూ..
అది మరిచిపోవద్దు ఏనాడూ..

పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా
వేదాల వెలసినా ధరణిరా
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా..
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ..

వెన్నెలదీ ఏ మతమురా...?
కోకిలదీ ఏ కులమురా...?
గాలికి ఏ భాష ఉందిరా...?
నీటికి ఏ ప్రాంతముందిరా...?

గాలికీ నీటికీ లేవు భేధాలూ..
మనుషుల్లో ఎందుకీ తగాదాలు
కులమత విభేదాలూ

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా... ఎవ్వరెదురైనా...
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....

ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...

అందుకే నిరంతరం సాగాలి దీక్షా

 

సోమవారం, మార్చి 16, 2020

నారాయణ మంత్రం...

భక్త ప్రహ్లాద చిత్రం లోని ఒక చక్కని పాటను గుర్తు చేసుకుందాం. సాలురి వారి స్వరకల్పనలో సుశీల గారు గానం చేసిన ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


 చిత్రం : భక్తప్రహ్లాద
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 

గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 

తల్లియు తండ్రియు నారాయణుడె
గురువు చదువు నారాయణుడె
యోగము యాగము నారాయణుడె
ముక్తియు దాతయు నారాయణుడె
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 

నాథహరే శ్రీ నాథహరే
నాథహరే జగన్నాథహరే
 

 

ఆదివారం, మార్చి 08, 2020

బంగారు పాపాయి...

మహిళా దినోత్సవం సంధర్భంగా నారీమణులందరకూ శుభాకాంక్షలందజేస్తూ రావుబాలసరస్వతి గారు గానం చేసిన ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : మంచాళ జగన్నాధరావు
గానం : రావు బాల సరస్వతి 

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి తేవాలి
ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

మా పాప పలికితే మధువులే కురియాలి
మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి

మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప?
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు

తెనుగుదేశము నాది తెనుగు పాపను నేను
తెనుగుదేశము నాది తెనుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి వెలియించాలి
మా నోములపుడు మాబాగా ఫలియించాలి
మా నోములపుడు మాబాగా ఫలియించాలి

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.