ఆదివారం, ఏప్రిల్ 18, 2021

కుకుకూ కుకుకూ కుకుకూ...

రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : భువన చంద్ర
గానం : బాలు, చిత్ర

కుకుకూ కుకుకూ కుకుకూ 
ఎవరో నీవని అనకూ
కళ్ళతోనే గుండె తట్టిచూడు
ప్రేమనాడి కాస్తా పట్టి చూడు
తొలి తొలి వలపుల తలపులో
మై మరపులో

కుకుకూ కుకుకూ కుకుకూ
నీవే నేనని తెలుసు
కళ్ళతోని గుండె తట్టి చూశా
ప్రేమనాడి జాడ పట్టి చూశా
తొలి తొలి పరువపు పిలుపులో
మై మరపులో

కుకుకూ కుకుకూ కుకుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ

మనసున మెల్లగ ఊయలలూగిన
విరహాపు మెరుపులు కన్నావా
తనువును తాకిన అల్లరి గాలుల
కమ్మని గుస గుస విన్నవా
కొంగుపట్టి లాగి కొత్త కొత్తగా
అబ్బాయి నన్ను చుట్టకుంటే
ఎంత మైకమో
అత్తిపత్తి లాగా మెత్త మెత్తగా
అమ్మాయి సిగ్గు దాచుకుంటే 
ఎంత అందమో

కుకుకూ కుకుకూ కుకుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ

నింగికి నేలకి బాటలు వేసిన
తొలకరి చినుకుల ఆరాటం
విరిసిన పువ్వుల పంచకు చేరిన
గడసరి తుమ్మెద కోలాటం
చిన్నదాని పాలబుగ్గ వంపులో
కీల్లాడి ముద్దు పెట్టుకుంటె 
ఎన్ని సొంపులో
హత్తుకున్నమేని వత్తిగింపులో
అల్లడుతున్న పిల్లవాడికి 
ఎన్ని చిక్కులో

కుకుకూ కుకుకూ కుకుకూ 
ఎవరో నీవని అనకు
కళ్ళతోనే గుండె తట్టిచూడు
ప్రేమనాడి కాస్త పట్టి చూడు
తొలి తొలి వలపుల తలపులో
మై మరపులో

కుకుకూ కుకుకూ కుకుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.