మంగళవారం, ఏప్రిల్ 20, 2021

కుకు కూకూ ఎద కోయిల పాడేనా...

నిన్నే ఇష్టపడ్డాను సినిమా లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నిన్నే ఇష్టపడ్డాను (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు, చిత్ర

కుకు కుకు కుకు కుకు
కుకు కుకు కుకు కుకు కూకూ 
ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కూకూ 
మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా 
కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా
కుకుకుకూ కుకుకుకు కుకుకుకు కుకుకూ

కుకు కుకు కుకు కుకు కూకూ 
ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కూకూ 
మధుమాసం నేడేనా

ఎన్ని రంగులో నిన్నమొన్న చూడలేదు 
కమ్ముకొచ్చే ఇంతలో ఇలా
ఎన్ని ఉహలో ఉన్నచోట ఉండనీవు 
గాలిచిందు లెంతసేపిలా
కొంటె ఊసులు కొత్త ఆశలు 
అల్లుకుంటే అన్ని వైపులా
గుప్పెడంత ఈ చిన్ని గుండెలో 
గుట్టునింక ఆపడం ఎలా
కుకుకుకూ కుకుకుకు కుకుకుకు కుకుకూ

కుకు కుకు కుకు కుకు కూకూ 
ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కూకూ 
మధుమాసం నేడేనా

ఇన్నిరోజులు ఉన్నమాట చెప్పలేదు 
చిన్నదాని సన్నజాజులు
నన్ను ఎప్పుడూ రెప్పలెత్తి చూడలేదు 
కన్నెపిల్ల కంటి చూపులు
సైగ చేయడం నేర్చుకున్నవి 
ముచ్చటైన లేత నవ్వులు
కొమ్మచాటుగా దాగనన్నవి 
విచ్చుకున్న సిగ్గు పువ్వులు
కుకుకుకూ కుకుకుకు కుకుకుకు కుకుకూ

కుకు కుకు కుకు కుకు కూకూ 
ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కూకూ 
మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా 
కమ్మనైన ఈ స్వరాన లీనమైపోనా
కుకుకుకూ కుకుకుకు కుకుకుకు కుకుకూ
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.