లిప్సిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లిప్సిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, మార్చి 10, 2021

ఎవడే...

రాథాకృష్ణ సినిమాలోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రాథాకృష్ణ (2021)
సంగీతం : ఎమ్.ఎమ్.శ్రీలేఖ  
సాహిత్యం : కృష్ణచైతన్య 
గానం : లిప్సిక భాష్యం, మోహన భోగరాజు 

గలగలా గాజుల సప్పుడు వింటే పిల్లా
పగ్గమేసేటోన్ని లగ్గమాడెయ్ రాదా పిల్లో ఓ ఓఓ
నీ మనసుకు నచ్చేటోడు యాడో పుట్టే ఉంటాడే 
ఏ ఏఏ, పిల్లో, ఓ ఓఓ

అందాల రాముళ్ళాంటి బంగారు బుల్లోడే
మందారం బుగ్గే మీటి ముద్దాడే సిన్నోడే
ఎవడే నాకోసం వరుడై పుట్టినవాడు 
ఎవడే నాకోసం ఆశగ వేచినవాడు 
ఎవడే నా కథకే నాయకుడయ్యే పిల్లాడు బూచాడు 
ఎవడే ఈ బొమ్మకు రంగులు అద్దే వాడు 
ఎవడే ఈ కొమ్మకు హంగులుదిద్దే వాడు 
ఎవడే నా మనసున మత్తే చల్లే చెలికాడు

రారా వేణుగోప బాల రాజిత సద్గుణ జయశీల
సార సాక్ష నేరమేమి మారు బాధ కోర్వనేలా
రారా వేణుగోప బాల రాజిత సద్గుణ జయశీల

సోగ్గాడు సుకుమారుడు భేషైన మగధీరుడు
మోజున్న యద చోరుడు నా పోరడు
నా తీపి ఊహల్లోకొచ్చేవాడు
నా లో న కోటి కళలను నా జూ గ్గా రేపెటోడు
మో హా లే మేలుకొల్పేవాడు ఊఊ ఊ

నా ఇంద్రుడు నా చంద్రుడు గడసరి గోవిందుడు
గోపాలుడు సరసపు శూరుడు నా కొంటె గ్రీకువీరుడు

ఎవడే నా ఇష్టం కష్టం తెలిసినవాడు 
ఎవడే నే గీసిన గీతను దాటని వాడు 
ఎవడే నా ప్రేమను ఇట్టే గెలిచే మొనగాడు బూచాడు 
ఎవడే నాకోసం వరుడై పుట్టినవాడు 
ఎవడే నాకోసం ఆశగ వేచినవాడు 
ఎవడే నా కథకే నాయకుడయ్యే పిల్లాడు

గారాల గుణవంతుడు రాగాల శ్రీమంతుడు
నా ప్రేమ శశికాంతుడు
ఆగడు నూరేళ్ళు నా జంటే కోరేవాడు
ఏనాడు చేయి వదలక నా నీడై సాగేటోడు
నా ఈడు జోడు తానైనోడు ఊఊ ఊ

వేధించడు సాధించడు అవి ఇవి ఆశించడు
శాశించడు సొగసరి కాముడు కవ్వించే ప్రేమలోలుడు

ఎవడే నా కల్లోకొచ్చే అల్లరి వాడు 
ఎవడే నా ఒళ్ళో వాలి గిల్లేవాడు 
ఎవడే నా మెళ్ళో హారం వేసే చిన్నోడు బూచాడు
ఎవడే నాకోసం వరుడై పుట్టినవాడు 
ఎవడే నాకోసం ఆశగ వేచినవాడు 
ఎవడే నా కథకే నాయకుడయ్యే పిల్లాడు



సోమవారం, జూన్ 01, 2020

పిల్లగాలుల పల్లకీలో...

మల్లెల తీరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ జ్యూక్ బాక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మల్లెలతీరం (2013)
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
సంగీతం : పవన్ కుమార్
గానం : లిప్సిక 

పిల్లగాలుల పల్లకీలో
మల్లె మధువై నీలొ చేరి
నిన్ను చూస్తూ నన్ను నేనే
వెదుకుకుంటున్నా

మరచి విశ్వము మరచి నేనే
మరచి సర్వము నన్ను నేనే
మౌనమే మకరందమౌతూ
మురిసిపోతున్నా


కన్న కలలే వెన్నెలవుతూ
కన్నులెదుటే విరగబూసె
ఎన్ని జన్మల పుణ్య ఫలమో
నిన్ను కలిసితిని

అలుకలన్ని ఆవిరయ్యె
వేదనంతా వేడుకయ్యె
చీకటంతా వెలుతురయ్యె
చెలిమి తోడయ్యే


ఆకశములో చందమామ
కొలను పూసిన కలువ భామ
నేల నడిచెను కలసి మెలసి
కొత్త దారులలో

పలుకు తేనెల గోరు వంకతొ
పంజరములో రామచిలుకను
కలిపి నడిపిన బ్రహ్మ రాతను
మార్చు వారెవరో


గోరు వెచ్చని నింగి మనసు
ఆకు పచ్చని నేల సొగసు
కలసి కమ్మని తోడు నీడై
అడుగులేసేనా

నేల రాలిన చినుకు వానగు
వాన నీరె పారు ఏరగు
పారు యేరులె పొంగి పొరలుతు
సంద్రమయ్యెనుగా


అంత సంద్రమె ఆవిరౌతు
మబ్బు లోపలె చేరే నీరై
అట్టి నీరె చిట్టి చినుకై
మట్టి తాకెనుగా

మనసులొకటై మమతలొకటై
ఆశలొకటై బాసలొకటై
పరిమళించిన జంట మల్లెలు
జతను వీడేనా
 

 

సోమవారం, మే 21, 2018

అమ్మాయే చల్లో అంటు...

ఛలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఛలో (2017)
సంగీతం : మహతి స్వరసాగర్
సాహిత్యం : కృష్ణ మదినేని
గానం : యాసిన్ నిజార్, లిప్సిక

అమ్మాయే చల్లో అంటు నాతో వచ్చేసిందిలా
లైఫంతా నీతో ఉండే ప్రేముందీ నాలోనా
పిల్లేమో తుళ్ళి తుళ్ళి నన్నే అల్లేసిందిలా
నీకోసం మళ్ళీ పుట్టే పిచ్చుందీ నీ పైనా

ఐలవ్యూ లవ్యూ అంటూ నా గుండె కొట్టుకుందే
నా హనీ హనీ అంటూ నీ పేరే పలికిందే 
 
ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

చలో చలో అనీ నీతోనె వస్తూ ఉన్నా
ఏమైపొయినా పదా
పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా
ఇదే నిజం కదా
ఓ మేరి లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో
మారెనే నన్నే మార్చెనే
ఏ పెహలి నజర్ నువ్వంటె నన్నే మించే
ఇష్టం నాదిలే దునియా నీదిలే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటె మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

తనే తనే కదా నీ వాడు అంటూ ఉంది
మదే నన్నే తట్టీ
ముడే పడె కదా ఏ నాడో అంటూ ఉంది
గుడే గంటే కొట్టి
ఓ మేరి జానా నీ నవ్వె నన్నే
పట్టి గుంజెలేసనే ప్రాణం లాగనే
ఓ తూహి మేరా గుండెల్లో నిన్నే ఉంచా
నేనె లేనులే నువ్వె నేనులే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటె మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలెస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.