రామ భక్త హనుమాన్ గానం చేసిన పాటకన్నా గొప్ప రాముని పాట ఏముంటుంది చెప్పండి కె.వి.మహదేవన్ గారి సంగీత సారధ్యంలోని ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఈలపాట రఘురామయ్య గారి గళం నిజంగా ఆంజనేయుడే పాడుతున్నాడా అన్నట్లుంటుంది, మీరూ చూసీ విని తన్మయత్వాన్ని పొందండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : శ్రీరామాంజనేయ యుద్దం (1974)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : గబ్బిట వెంకటరావు
గానం : కే.రఘురామయ్య (ఈలపాట)
జయతు జయతు మంత్రం
జన్మ సాఫల్య మంత్రం
రామ్ రామ్ రామ్
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
రామ్ రామ్ రామ్
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం
రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
నీల మేఘ శ్యామా
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
తల్లి తండ్రి గురువు నీవే తోడు-నీడ నీవే
తల్లి తండ్రి గురువు నీవే తోడు-నీడ నీవే
ధరణి ఎల్ల పాలన జేసె పరంజ్యోతి వే
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య
తెలియ తరమా పలుక వశమా నీదు మహిమా రాఘవ
రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
నీల మేఘ శ్యామా
రాతి నైన నాతిని జేసె నీ దివ్య పాదమూ
రాతి నైన నాతిని జేసె నీ దివ్య పాదము
కోతి నైన జ్ఞానిని జేసె నీ నామము
నీదు సరి దైవము లేరయ్య నిన్ను నే నమ్మితి రామయ్య
నీదు సరి దైవము లేరయ్య నిన్ను నే నమ్మితి రామయ్య
నీదు చరణం పాప హరణం మాకు శరణం రాఘవ
రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
నీల మేఘ శ్యామా
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
నీల మేఘ శ్యామా
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
తల్లి తండ్రి గురువు నీవే తోడు-నీడ నీవే
తల్లి తండ్రి గురువు నీవే తోడు-నీడ నీవే
ధరణి ఎల్ల పాలన జేసె పరంజ్యోతి వే
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య
తెలియ తరమా పలుక వశమా నీదు మహిమా రాఘవ
రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
నీల మేఘ శ్యామా
రాతి నైన నాతిని జేసె నీ దివ్య పాదమూ
రాతి నైన నాతిని జేసె నీ దివ్య పాదము
కోతి నైన జ్ఞానిని జేసె నీ నామము
నీదు సరి దైవము లేరయ్య నిన్ను నే నమ్మితి రామయ్య
నీదు సరి దైవము లేరయ్య నిన్ను నే నమ్మితి రామయ్య
నీదు చరణం పాప హరణం మాకు శరణం రాఘవ
రామ నీల మేఘ శ్యామా కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వ భౌమ
నీల మేఘ శ్యామా
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
2 comments:
చిన్నప్పుడు పోటీలు పడి ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేసేవాళ్ళం నేనూ, అక్కా..ఐతే రాములవారిని తలుచుకుంటూ చెసే వాళ్ళం. ఆయనకి రాములవారంటే ప్రాణం కాబట్టి మమ్మల్ని తొందరగా కరుణించేస్తారని..అంత ఇష్టం ఆ స్వామంటే. అందులోనూ ఈ పాట యెప్పుడు విన్నా మనసుకి తెలీని శక్తి కలుగుతుంది వేణూజీ.
మీ జ్ఞాపకాలు బాగున్నాయండీ శాంతి గారు థాంక్స్ ఫర్ షేరింగ్ దెమ్ హియర్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.