శుక్రవారం, ఏప్రిల్ 25, 2014

జాబిలమ్మ నీకు అంత కోపమా

ఒకప్పుడు మంచి మెలోడీలు అందించిన ఎస్.ఎ.రాజ్కుమార్ గారి సంగీత సారధ్యంలో సిరివెన్నెల గారు రాసిన ఈ పాట చాలారోజుల పాటు ప్రేమికులకు ప్రేయసి అలక తీర్చడానికి ఉపయోగపడి ఉంటుందేమో ఆరోజుల్లో... మీరూ చూసీ వినీ ఎలా ఉందో చెప్పండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : పెళ్ళి (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు  

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 
అల్లాడిపోదా రేయి ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..
 

చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా
చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా
ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా
హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా
మరి అంత దూరమా కలలుకన్న తీరమా
 
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..

మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మా
మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా
ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా
తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా
ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 
అల్లాడిపోదా రేయి ఆపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 
జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .. 
 

6 comments:

చాలా బాగుంది ....... సిరివెన్నల గారి పాటలు మరిన్ని అప్లోడ్ చేయగలరని ఆశిస్తున్నాను .

థాంక్స్ సంజయ్ గారు... తప్పకుండా పోస్ట్ చేస్తాను.

ఈ పాటంటే నాకు చాలా కోపం వేణూజీ..యెందుకో మా వారికి బాగా తెలుసు..అందరితో పంచుకో లేక పోయినా తనకర్ధ మౌతుందనే ఈ కామెంట్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు, ఐతే మీకు నచ్చని పాట వేశాననమాట :-)

చాల అద్భుతమైన పాట

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.