సోమవారం, ఏప్రిల్ 21, 2014

ఒకే ఒక మాట...

ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ పాటకి సంబంధించి ఒక్కటే లోటేమిటంటే ఇది చక్రి పాడటం.. మరెవరైనా గాయకుడు పాడుంటే ఈ పాట మరింత బాగుండేదేమో అనిపిస్తుంటుంది అపుడపుడు. మీరూ ఆస్వాదించండి ఈ సిరివెన్నెల ప్రేమ గీతాన్ని. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం : చక్రం (2005)
సంగీతం : చక్రి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చక్రి

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలనీ..

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా 

ఆఆఆఅ...ఓఓఓఓఓఓ...
ఆఆఆఅ...ఓఓఓఓఓఓ...


నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు
నమ్మననీ నవ్వుకొని చాల్లే పోమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటిమైమరుపులో నను పొల్చుకుంటాననీ
తల ఆన్చి నీగుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని 

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా  

ఒహ్హో..ఓఓ... ఒహ్హ్హోఓఓఓఓ
ఒహ్హో..ఓఓ... ఒహ్హ్హోఓఓఓఓ
 
 నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆక్షణం నను వొదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నేదేననీ నీకైనా తెలుసా అనీ
నీకు చెప్పాలని 

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా  

నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలనీ..

ఒకే ఒక మాట
మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట
పెదవోపలేనంత తీయంగా 

 

4 comments:

You nailed it. LOL. I have the same feeling on Chakri. He (many other musicians as well) spoiled many beautiful songs this way :(

$

ఆయన పాటే కాదు..ఇచ్చిన ట్యూన్ తో మాటలు కూడా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాయని నా ఫీలింగ్ వేణూజీ.

హహహహ థాంక్స్ శాంతి గారు మీరు చెప్పినది కరెక్టే :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.