శనివారం, ఏప్రిల్ 05, 2014

ఎవరైనా ఎపుడైనా...

శ్రీను వైట్ల కమర్షియల్ బాట పట్టకముందు తీసిన మరో మంచి సినిమా "ఆనందం" లోని ఈ పాటకూడా నాకు చాలా ఇష్టం మీరూ ఆస్వాదించండి సిరివెన్నెల గారి సాహిత్యం చాలా బాగుంటుంది, దేవీ సంగీతం సైతం గుర్తుండిపోతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ప్రతాప్ పాడిన వర్షన్ ఇక్కడ చిత్ర గారి వర్షన్ ఇక్కడ వినవచ్చు లేదా రెండూ ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఆనందం(2001)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : ప్రతాప్, చిత్ర

ఓఓఓఓఓఓ...ఓఓఓఓఓఓఓ..
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా
చిగురాశలు మెరిసేలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
 
చూస్తూనే ఎక్కడి నుంచో
చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పోపొమ్మంటూ
తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి
సరికొత్తగా తోస్తుంది
తన రూపం తానే చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందో
బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో

ఎవరైనా ఎపుడైనా
సరిగా గమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా
చిగురాశలు మెరిసేలా
తోలి శకునం ఎప్పుడు ఎదురైందో 

దిరనననన దిరదిరనా.. దిరనననన దిరనన దిరననా..
దిరనననన దిరదిరనా.. దిరనన దిరనా.. 
దిరనననన దిరదిరనా.. దిరనననన దిరనన దిరననా..
దిరనననన దిరదిరనా.. దిరనన దిరనా.. 
దిరనననన దిరనన దిరనన 
దిరనననన దిరనన దిరదిరనా 

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడిరాతిరి తొలివేకువ రేఖ
నిదురించే రెప్పలపై
ఉదయాలను చిత్రించి
ఒక చల్లని మది పంపిన లేఖ

గగనాన్ని నేలని కలిపే
వీలుందని చూపేలా
ఈ వింతల వంతెన
ఇంకా ఎక్కడిదాకా
చూసేందుకు అచ్చంగా
మన భాషే అనిపిస్తున్నా
అక్షరము అర్ధం కాని ఈ విధి రాత
కన్నులకే కనబడని
ఈ మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడిరాతిరి తొలివేకువ రేఖ
నిదురించే రెప్పలపై
ఉదయాలను చిత్రించి
ఒక చల్లని మది పంపిన లేఖ 
 


2 comments:

థీం సాంగ్స్ పాటర్న్ మార్చేలా వుందీ పాట అనిపిస్తుంటుందండీ..అచ్చమైన దేవి మార్క్ పాట..

థాంక్స్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.