చైతన్య సినిమాలోనిదే మరో మధురమైన పాట నాకు చాలా ఇష్టమైనది, ఇళయరాజా సంగీతం ఓలలాడిస్తే వేటూరి వారి సాహిత్యం అందమైన ప్రాసలతో చిత్రంగా మనసుకు హత్తుకుపోతుంది. నాగార్జునా గౌతమిల గురించి చెప్పేదేముంది. ఈ చక్కని పాటను మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : చైతన్య (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, కోరస్
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, కోరస్
పాప ఈడు గోలా.. పాట పేరు జోలా..
ఊగుతోంది బాల... యవ్వనాల డోలా...
నీవు వేణువైతే.. నేను ఊపిరౌతా...
మోగాలి ఎదలో ఈల.. మోహాల సరి రాగాలా...
ఊగుతోంది బాల... యవ్వనాల డోలా...
నీవు వేణువైతే.. నేను ఊపిరౌతా...
మోగాలి ఎదలో ఈల.. మోహాల సరి రాగాలా...
Be happy... happy all the time...
Be happy... happy all the time...
Be happy... happy all the time...
Be happy... happy all the time...
Be happy... happy all the time...
Be happy... happy all the time...
ఏదో సాగింది చిలిపి కథా.. ఓటమి గెలుపైన వలపు కథా...
కునుకే రాకున్న కనుల కథా.. ఉడికే పరువాల పడుచు కథా..
పూసేటి వేసంగి పూరేకులో... రాస్తాను నీ పేరు తేనెలతో...
తెన్నేటి ఇసుకమ్మ తీరాలలో... వేస్తాను పాదాలు నీ జతలో...
పాషాణమై పోకు వైఢూర్యమా....
పాప ఈడు గోలా..పాట పేరు జోలా..
ఊగుతోంది బాల...యవ్వనాల డోలా...
ఆటే కారాదు బ్రతుకు సుమా... అతికే మనసంటు లేదు సుమా..
చేతులు కలిపింది చెలిమి సుమా... ఎగిరే నా ప్రేమ పావురమా..
ఆనాటి స్నేహాల వాకిళ్ళలో.. ఈనాడు వేచేను దోసిలి తో...
కాలాలు దాటాను కౌగిళ్ళలో... స్వర్గాలు చూడాలి నీ ఒడిలో..
శిల నీవు కాబోకు శృంగారమా...

2 comments:
ఏదో సాగింది చిలిపి కథా.. ఓటమి గెలుపైన వలపు కథా...
కునుకే రాకున్న కనుల కథా.. ఉడికే పరువాల పడుచు కథా..
ప్రేమ లోని దగ్గిరతనాన్ని.దగ్గిరతనం లోని మాధుర్యాన్నీ..యెంతో సున్నితంగా చెప్పరు వేటూరిగారు..
థాంక్స్ శాంతి గారు.. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.