శనివారం, ఏప్రిల్ 19, 2014

ఆకాశ గంగా...

వాన సినిమా కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. ఈ పాటలు విడుదలైన కొత్తలో ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు. కార్తీక్ చాలా బాగా పాడాడు. ఈ అందమైన పాట మీరూ విని ఆస్వాదించండి. ఎంబెడ్ చేసిన వీడియో వాటర్ ఫాల్స్ తో చేసిన అద్భుతమైన ప్రజంటేషన్. ఈ పాట సినిమాలోని వీడియో చూడాలంటే ఇక్కడ చూడండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : వాన (2007)
సంగీతం : కమలాకర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్

ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండె లయలో విన్నా నీ అలికిడీ...

ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
ఆకాశ గంగా..

ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా..
ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపూ తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా

ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
ఆకాశ గంగా..
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
ఆకాశ గంగా.. 
 

4 comments:

This and "yeduta nilichindi choodu" song from the same movie were my favorite bed time numbers for long time. Absolutely no words to praise Karthik for his voice in romantic songs which he sings from his heart.
You may also consider posting "Neeli meghama, antha vegama" song from "Village lo Vinayakudu" sung by Karthik himself.

$

థాంక్స్ సిద్ గారు... ఈ రెండు పాటలు నేను కూడా తరచూ వినేవాడ్నండి. నీలిమేఘమా పాట త్వరలో పోస్ట్ చేస్తాను.

ప్రాణమంటి పాట వేణూజీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.