తాపీ ధర్మారావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తాపీ ధర్మారావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, అక్టోబర్ 21, 2015

ఎంత కృపామతివే.. భవాని...

నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని మహిషాసుర మర్ధిని అలంకరణలో అర్చించుకుంటూ కీలుగుఱ్ఱం చిత్రంలోని ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కీలుగుఱ్ఱం (1949)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : తాపీ ధర్మారావు
గానం : ఘంటసాల, శ్రీదేవి

ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే


కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా...
కన్యకు గూర్చితి కళ్యాణ మహా
 
ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే

ఏదో పనిపై ఏగే వానికి...
ఏదో పనిపై ఏగే వానికి ..
ఈ విద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివి... హహ...

ఎంత కృపామతివే ..భవాని...ఎంత దయానిధివే
 
నూతనముగా ఈ లేత మారుతము
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా...
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే ..
వదలిన గానమో... ఏమో
వదలిన గానమో... ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే 
సామ గానమే ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే 
సామ గానమే ఏమో
సామ గానమే ఏమో...


ఈ మహిషాసుర మర్ధిని స్త్రోత్రాన్ని కూడ వినండి మొదటి భాగం.

 
ఇది రెండవ భాగం.


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.