శుక్రవారం, ఏప్రిల్ 16, 2021

కు కు కు కు కూ ...

అల్లరి ప్రేమికుడు సినిమాకోసం కీరవాణి గారు స్వరపరచిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : వేటూరి  
గానం : బాలు, చిత్ర

కు కు కు కు కూ ..
కొమ్మారెమ్మ పూసే రోజు 
కు కు కు కు కూ ..
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు 
నిదురించే ఎదవీణ కదిలే వేళలో 
మామిడి పూతల మన్మధ కోయిల 
కు కు కు కు కూ .. 
కొమ్మారెమ్మ పూసే రోజు 

స్వరాలే 
వలపు వరాలై 
చిలిపి శరాలై 
పెదవి కాటేయగా
చలించే స్వరాలే 
వలచి వరించే వయసు వరాలే 
ఎదలు హరించే చిలిపి శరాలై
కలలు పండించగా 
గున్నమావి గుబురులో 
కన్నె కోయిలమ్మ 
తేనే తెనుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే 
ముసి ముసి ముసి ముసి
ముద్దబంతులై విరియగ
సామగ సనిదని 
సామగ సనిదని 
సామగ సామగ సామగ సామగ 
సా మగసని నీ గసరిద 
దా సనిదమ మా నిదమగ గా గమగమదని ..
సా సాగెనిపుడు నీ నీపెదవుల దా దారివిడిచి 
మా మార్గశిరపు గా గాలులు 
మురళిగ విన్న వేళ 
కన్నె రాధ పులకించే 

కు కు కు కు కూ ..
కొమ్మా రెమ్మా పూసే రోజు
కు కు కు కు కూ ..
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు

ఆఆ 
ఫలించే రసాలే
తరిచి తరించే పడుచు నిషాలో
కవిత లిఖించే యువత పెదాల
సుధలు పొంగించగా  
సన్న జాజి తొడిమలో చిన్ని వెన్నెలమ్మ 
సందె వెలుగులోనే తానమాడవమ్మ 
కన్నె చూపులే 
కసి కసి కసి కసి
కారు మబ్బులై ముసరగ
సామగ సనిదని
సామగ సనిదని  
సామగ సామగ సామగ సామగ  
సా మగసని నీ గసరిద 
దా సనిదమ మా నిదమగ గా గమగమదని ..
సాయమడుగు సా నీపరువము నీ 
దాగదిపుడు దా మాఘనెలల మా గాఢపు గా 
మమతల పూలు కోసి మాలుకోసు పలికించే

కు కు కు కు కూ ..
కొమ్మా రెమ్మా పూసే రోజు
కు కు కు కు కూ ..
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.