ఆదివారం, ఫిబ్రవరి 28, 2021

రంగులద్దుకున్నా...

ఉప్పెన చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఉప్పెన (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్  
సాహిత్యం : శ్రీమణి 
గానం : యాజిన్ నిజార్, హరిప్రియ

జించక్ జించక్ చా
జించక్ జించక్ చా
జించక్ జించక్ చా
జించక్ జించక్ చా
జించక్ జించక్ చా
జించక్ జించక్ చా

రంగులద్దుకున్నా
తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా
కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటునున్న…
పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా…
జంట వేరులౌదాం
ఎవ్వరీ కంటిచూపు చేరలేని 
ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం

రంగులద్దుకున్నా 
తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా 
కొమ్మలల్లే ఉందాం

తేనె పట్టులోన
తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన 
ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు
మీనాల వైనాల కొంటె 
కోణాలు తెలుసుకుందాం
లోకాల చూపుల్ని 
ఎట్టా తప్పించుకెళ్ళాలో 
కొత్త పాఠాలు నేర్చుకుందాం
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
ఏ క్షణం విడివిడిగా లేమందాం

రంగులద్దుకున్నా
తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా
కొమ్మలల్లే ఉందాం

మన ఊసు మోసే
గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే 
నేలను పాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి 
లాంతర్లో దీపాన్ని చేసి 
చూరుకేలాడదీద్దాం
సాక్ష్యంగా సంద్రాలు ఉంటె 
దిగుడు బావిలో దాచి మూత పెడదాం
నేనిలా నీతో ఉండడం కోసం 
చేయనీ ఈ చిన్నపాటి మోసం
నేరమేం కాదే ఇది మన కోసం

రాయిలోన శిల్పం 
దాగి ఉండునంటా
శిల్పి ఎదురైతే 
బయటపడునంటా
అద్ధమెక్కడున్నా 
ఆవైపు వెళ్ళకంటా
నీలో ఉన్న నేనే 
బయటపడిపోతా
పాలలో ఉన్న నీటిబొట్టులాగా
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నేనిలా నీ లోపల దాక్కుంటా

హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
 

శనివారం, ఫిబ్రవరి 27, 2021

నేడే నాకు నేను...

చూసీ చూడంగానే చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చూసీ చూడంగానే (2020)
సంగీతం : గోపీ సుందర్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
గానం : గోపీ సుందర్ 

నేడే నాకు నేను 
పరిచయమౌతున్నా
నీలో నన్ను చూసి 
పరవశమౌతున్నా
సెకనుకు పదిసార్లు
నీ పేరంటున్నా
నేనోసారైనా
నాకు గుర్తు రాకున్నా
కవినేమ్ కాకున్నా
కవితలు రాస్తున్నా
తెలియని రంగుల్లో
నీతో కలలుకంటున్నా

ఇన్ని నాళ్ళుగా
నిన్ను చూపని
నిన్న మొన్నపై 
కోపమున్నదే
నిన్ను చూడక
నిన్ను కలవక
తెల్లవారదే రోజు గడవదే
ప్రేమనూ మరోటనూ
నువ్వు నా నిజం
నిండుగా నువ్వై
మారనీ జగం
నా నిను విడిచి
నిమిషం కదలదుగా

ఎదుట నిలిచిన
కలిసి గడిపిన
ఎంతకీ చెలి తనివి తీరదే
తలపు తలపున
నిన్ను కోలిచినా
ఎందుకో మరి దాహం మారదే
నేలపై నేరుగా దేవతై నువ్వే
వాలినావిలా లాలి పాడగా
నీ కలయికలో
మనసే వెలిగినదే
ఏంటా కోపమంతా 
చూడలేను నీలోనా
నువ్వే దూరమైతే 
మనసిది నిలిచేనా
అలగకే నాపైనా
ఉరమకే ఏమైనా
 
నిన్ను వీడి క్షణమైనా
నేను ఉండలేనన్నా
ఎవరే నీ కన్నా
నిన్ను నమ్ముకుని నేనున్నా
మాటలాడి మన్నించి
మరల కలిసిపోమన్నా
 

శుక్రవారం, ఫిబ్రవరి 26, 2021

మనసు మరీ మత్తుగా...

వి చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వి (2020)
సంగీతం : అమిత్ త్రివేది
సాహిత్యం : సిరివెన్నెల   
గానం : అమిత్ త్రివేది, షాషా తిరుపతి

మనసు మరీ మత్తుగా 
తూగిపోతున్నదే ఏమో ఈ వేళా
వయసు మరీ వింతగా 
విస్తుబోతున్నదే నీదే ఈ లీలా
అంతగా కవ్వింస్తావేం గిల్లి
అందుకే బందించేయ్ నన్నల్లి
కిలాడి కోమలీ… గులేబకావళీ
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ

మనసు మరీ మత్తుగా 
తూగిపోతున్నదే ఏమో ఈ వేళా
వయసు మరీ వింతగా 
విస్తుబోతున్నదే నీదే ఈ లీలా

ఓ అడుగులో అడుగువై 
ఇలా రా నాతో నిత్యం వరాననా
హ.. బతుకులో బతుకునై 
నివేదిస్తా నా సర్వం జహాపనా
పూలనావ.. గాలితోవ.. హైలో హైలెస్సో
ఓ.. చేరనీవా చేయనీవా.. సేవలేవేవో

ఓ… మనసు మరీ మత్తుగా 
తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
ఓ.. వయసు మరీ వింతగా 
విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…

మనసులో అలలయే 
రహస్యాలేవో చెప్పే క్షణం ఇదీ..
మనువుతో మొదలయే 
మరో జన్మాన్నై పుట్టే వరమిదీ..
నీలో ఉంచా నాప్రాణాన్ని 
చూసి పోల్చుకో
ఓ.. నాలో పెంచా నీ కలలన్నీ.. 
ఊగనీ ఊయల్లో

మనసు మరీ మత్తుగా 
తూగిపోతున్నదే ఏమో ఈ వేళా
ఓ.. వయసు మరీ వింతగా 
విస్తుబోతున్నదే నీదే ఈ లీలా
అంతగా కవ్విస్తావేం గిల్లి..
అందుకే బందించేయ్ నన్నల్లి..
కిలాడి కోమలీ… గులేబకావళీ…
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…
 

 

గురువారం, ఫిబ్రవరి 25, 2021

కోపం వస్తే మండుటెండ...

తారకరాముడు చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తారకరాముడు (1997)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల   
గానం : బాలు, చిత్ర 

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండికొండ

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

నాకు తెలుసా మంచి చెడ్డ
నువ్వు చెబితే నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా

నీ అల్లర్లు అందం
నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించె
నీ నేస్తమె మంచి గంధం 

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా
గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట.
మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చెసెదొకటే పేర్లే వేరట
అవునో కాదో తెలియదు కానీ
నువు చెబుతుంటే అవునంటా
మరి అంతలోనె 
బుంగమూతి సంగతేంటటా

నాకు తెలుసా మంచి చెడ్డ
నువు చెబితె నెర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా.. ఆ..

నిండు కుండ కాదు కనుక తొణుకుతుందది.
అంత వింత అందులోన ఏమిటున్నది
నాలో తెలివికి దీన్లో నీటికి
పోలికె గుళుకు గుళుకు పలుకుతున్నది.
అమృతం లాంటి హృదయం నీది
అంతకన్న వేరే వరమేది?
అది తెలిసి కూడ కసురుతుంటె
నేరమెవరిది?

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

ఏంటో
నాకు తెలుసా మంచి చెడ్డ
నువు చెబితె నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా

నీ అల్లర్లు అందం
నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించె
నీ నేస్తమె మంచి గంధం 
 

బుధవారం, ఫిబ్రవరి 24, 2021

ఏమిటో ఇది...

రంగ్ దే చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రంగ్ దే (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి  
గానం : కపిల్ కపిలన్, హరిప్రియ

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది

అలలా నా మనసు తేలుతుందే
వలలా నువు నన్ను అల్లుతుంటే
కలలా చేజారిపోకముందే
శిలలా సమయాన్ని నిలపమందే
నడక మరిచి నీ అడుగు ఒడిన 
నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన 
నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో
కలిపే ఒక కొత్త నిన్ను నాతో
నేనే ఉన్నంత వరకు నీతో
నిన్నే చిరునవ్వు విడువదనుకో
చినుకు పిలుపు విని 
నెమలి పింఛమున రంగులెగసినట్టు
వలపు పిలుపు విని 
చిన్ని మనసు చిందేసే ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది
 

మంగళవారం, ఫిబ్రవరి 23, 2021

ఓ చెలీ క్షమించమన్నానుగా...

అనగనగా ఒక రోజు చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అనగనగా ఒక రోజు (1997)
సంగీతం : శ్రీ కొమ్మినేని
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : మనో, చిత్ర 

ఏమ్మా కోపమా​.. 
​లేదు చాలా సంతోషం​.​​.
లేటయ్యిందనా​..​
యే ​ఛీ నాతో మాట్లాడకు..​
​మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు.. ​
​​వీడెళ్ళి​​ వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు.. ​
​ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు..​ కాబట్టి ఇంత లేటు..​
​​
ఓ చెలీ క్షమించమన్నానుగా​..​
నీకిది ఇవాళ కొత్త కాదుగా..​ 
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. 
ఏం చేస్తే చల్లారుతుందది..  ​
​​పోపోవోయ్ చాలు గాని 
ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది​.. ​
సరేలే..​ ​టుమారో ఇలా​ 
లేటు చెయ్యనింక ఒట్టు.. ​
​​ 
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్తకాదుగా..

స్టోరీ చెప్పవద్దు.. బోరే కొట్టవద్దు.. 
వదిలేసేయ్ నన్నిలా..
సారీ చెప్పలేదా.. ఫైరింగ్ ఆపరాదా.. 
ఫైటింగ్ ఎంతసేపిలా..
నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు..
వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు..
ఏమి చేసినా అహో అని 
మెచ్చుకోమనా మహాశయా..
చిన్న తప్పుకే మరీ ఇలా 
దుంప తెంచితే ఎలాగట.. 
పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో..
నీతో లవ్వంటే మరీ కత్తి మీద సాము కాదా..

ఓ చెలీ క్షమించమన్నానుగా.. 
నీకిది ఇవాళ కొత్తకాదుగా..
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. 
ఏం చేస్తే చల్లారుతుందది..  ​
​​పోపోవోయ్ చాలు గాని 
ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది​.. ​
సరేలే..​ ​టుమారో ఇలా​ 
లేటు చెయ్యనింక ఒట్టు.. ​
​​ 
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్తకాదుగా..
 
నీకూ నాకు మధ్య వేరే మాట లేదా 
టాపిక్ మార్చవెందుకు..
స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు 
వెయిట్ చెయ్యి మంచి మూడుకు..
దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా..
ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా..
కలుసుకున్నది డిబేటుకా.. 
ప్రేమ అన్నది రివెంజుకా..
ఎంతసేపని భరించను.. ఛస్తున్నదే నా ఓపిక..
టెంపరే మారదే లెంపలే వేసుకున్నా..
ఓకే అనేస్తే ఎలా.. లోకువేగా నీకు ఇంక..

ఓ డియర్ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా.. 
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. 
ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోమ్మా చాలు గాని 
ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే టుమారో ఇలా 
బెట్టు చెయ్యనింక ఒట్టు..
ఓ డియర్ క్షమించమన్నానుగా
 


సోమవారం, ఫిబ్రవరి 22, 2021

మనసున ఎదో రాగం...

ఎంతవాడు గాని చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఎంతవాడు గాని (2015)
సంగీతం : హారీస్ జైరాజ్ 
సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్ 
గానం : చిన్మయి 

మనసున ఎదో రాగం 
విరిసేను నాలో తేజం
చెప్పలేని ఎదో భావం నాలో కలిగేలే

సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా 
మునిగే మనసు అస్సలు బెదరలేదు లే

ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు 
ననువిడి వెళిపోవుట నేను చూసానే 
తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి 
కలలో కలలో నను నేనే చూసానే

నాకేం కావాలి నేడు 
ఒక మాట అడిగి చూడు 
ఇక నీవే నాకు తోడూ 
అని లోకమనేదెపుడు

నాకేం కావాలి నేడు 
ఒక మాట అడిగి చూడు 
ఇక నీవే నాకు తోడూ 
అని లోకమనేదెపుడు
 
దోసిట పూలు తేచ్చి ముంగిట ముగ్గులేసి 
మనసును అర్పించగా ఆశ పడ్డానే 
వలదని ఆపునది ఏదని అడిగే మది 
నదిలో ఆకు వలే కొట్టుకుపోయానే 
గరికలు విరులయ్యే మార్పే అందం 
ఎన్నో యుగములుగా మెలిగిన బంధం

ఒక వెండి గొలుసు ఓలే 
ఈ మనసు ఊగెనిపుడు 
తొడగాలి వజ్రమల్లె 
నే మేరియుచుంటినిపుడు

ఒక వెండి గొలుసు ఓలే 
ఈ మనసు ఊగెనిపుడు 
తొడగాలి వజ్రమల్లె 
నే మేరియుచుంటినిపుడు
 
మనసున ఎదో రాగం 
విరిసేను నాలో తేజం 
చెప్పలేని ఎదో భావం నాలో కలిగేలే 
సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా 
మునిగే మనసు అస్సలు బెదరలేదులే 
ఉన్నది ఒక మనసు వినదది నాఊసు 
నను విడి వెళిపోవుట నేను చూసానే 
తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి 
కలలో కలలో నను నేనే చూసానే

ఒక వెండి గొలుసు ఓలే 
ఈ మనసు ఊగేనిపుడు 
తొడగాలి వజ్రమల్లె 
నే మేరియుచుంటి నిపుడు
  

 

ఆదివారం, ఫిబ్రవరి 21, 2021

కురిసెనా కురిసెనా...

ఒరేయ్ బుజ్జిగా చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఒరేయ్ బుజ్జిగా (2020)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : కృష్ణకాంత్ 
గానం : అర్మాన్ మాలిక్, పి.మేఘన

హో.. కురిసెనా కురిసెనా
తొలకరి వలపులే మనసున
మురిసెనా మురిసెనా 
కలలకి కనులకి కలిసేనా..
నింగిలో తారలే జేబులో దూరెనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన

విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..

ఓ ఓ.. కురిసెనా కురిసెనా 
తొలకరి వలపులే మనసున
మురిసెనా మురిసెనా 
కలలకి కనులకి కలిసేనా

ఒక వరము అది… నన్ను నడిపినది
పసితనముకు తిరిగిక తరిమినది
పెదవడిగినది నీలో దొరికినది
ఒక్కసారి నన్ను నీలా నిలిపినది
చూస్తూ చూస్తూ నాదే లోకం
నీతో పాటే మారే మైకం
ఇద్దరి గుండెల చప్పుడులిప్పుడు అయ్యే.. ఏకం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో..

ఓ ఓ.. కురిసెనా కురిసెనా 
తొలకరి వలపులే మనసున
మురిసెనా మురిసెనా 
కలలకి కనులకి కలిసేనా
 
కొత్త మలుపు ఇది.. నిన్ను కలిపినది
నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది
చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది
ఎక్కడున్నా పక్కనుండే తలపు ఇది
నిన్నా మొన్న బానే ఉన్నా
నిద్దుర మొత్తం పాడౌతున్నా
నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్నా

కురిసెనా కురిసెనా తొలకరి వలపులె మనసున
మురిసెనా మురిసెనా కలలకి కనులకి కలిసేనా
నింగిలో తారలే జేబులో దూరెనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన

విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో
విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం
  

శనివారం, ఫిబ్రవరి 20, 2021

అనగనగనగా అరవిందట...

అరవిందసమేత చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అరవిందసమేత (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : అర్మాన్ మాలిక్

చీకటి లాంటి పగటిపూట 
కత్తుల్లాంటి పూలతోట 
జరిగిందొక్క వింతవేట 
పులిపై పడిన లేడి కథ వింటారా?

జాబిలి రాని రాతిరంతా 
జాలే లేని పిల్ల వెంట
అలికిడి లేని అల్లరంతా 
గుండెల్లోకి దూరి అది చూస్తారా?

చుట్టూ ఎవ్వరూ లేరూ 
సాయం ఎవ్వరూ రారూ
చుట్టూ ఎవ్వరూ లేరూ 
సాయం ఎవ్వరూ రారూ
నాపై నేనే ప్రకటిస్తున్నా 
ఇదేమి పోరూ 

అనగనగనగా 
అరవిందట తన పేరూ
అందానికి సొంతూరూ 
అందుకనే ఆ పొగరూ..

అరెరరెరరెరే.. 
అటు చూస్తే కుర్రాళ్లూ..
అసలేమైపోతారూ.. 
అన్యాయం కదా ఇది 
అనరే ఎవ్వరూ..

ప్రతినిమిషమూ తన వెంట 
పడిగాపులే పడుతుంటా
ఒకసారి కూడ చూడకుంది క్రీగంటా
ఏమున్నదో తన చెంతా 
ఇంకెవరికీ లేదంతా 
అయస్కాంతమల్లె 
లాగుతుంది నన్నూ
చూస్తూనే ఆ కాంతా 
తను ఎంత చేరువనున్నా
అద్దంలో ఉండె ప్రతిబింబం అందునా
అంతా మాయలా ఉంది 
అయినా హాయిగా ఉంది
భ్రమలా ఉన్నా బానే ఉందే 
ఇదేమి తీరు!!

మనవే వినవే అరవిందా.. 
సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. 
కాదంటె సరిపోతుందా?
మనవే వినవే అరవిందా.. 
సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. 
కాదంటె సరిపోతుందా?

అనగనగనగా.. 
అరవిందట తన పేరూ..
అందానికి సొంతూరూ.. 
అందుకనే ఆ పొగరూ..

అరెరరెరరెరే.. 
అటు చూస్తే కుర్రాళ్లూ..
అసలేమైపోతారూ.. 
అన్యాయం కదా ఇది 
అనరే ఎవ్వరూ..

మనవే వినవే అరవిందా.. 
సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. 
కాదంటె సరిపోతుందా?
మనవే వినవే అరవిందా.. 
సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. 
కాదంటె సరిపోతుందా?
  

శుక్రవారం, ఫిబ్రవరి 19, 2021

నిలవదే మది నిలవదే...

శతమానంభవతి చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శతమానంభవతి (2017)
సంగీతం : మిక్కీ.జె.మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : బాలు  

నిలవదే మది నిలవదే 
సిరి సొగసును చూసి 
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి 
దేవదాసే.. కాళిదాసై.. 
ఎంత పొగిడినా 
కొంత మిగిలిపోయేంత
అందం నీది 

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి 
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి

అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
ఆదోలాంటి తేనెల బాణం 
దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలో 
పూలగంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కదే 
హాయి రాగాలు ఆమనిగా
దినమొక రకముగ పెరిగిన 
సరదా నినువిడి మనగలదా

నిలవదే మది నిలవదే 
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే 
తొలి వలపున తడిసి

ఎలా నీకు అందించాలో 
ఎదలో కదిలే మధురిమను
నేనే ప్రేమ లేఖగ మారి 
ఎదుటే నిలిచాను
చదువుకుని బదులిదని 
చెప్పుకో లేవులే మనసా
పదములతో పనిపడని 
మౌనమే ప్రేమ పరిభాష
తెలుపగ తెలిపిన వలపొక 
వరమని కడలిగ అలలెగశా

నిలవదే మది నిలవదే 
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే 
తొలి వలపున తడిసి
దేవదాసే.. కాళిదాసై.. 
ఎంత పొగిడినా 
కొంత మిగిలిపోయేంత
అందం నీది
 


గురువారం, ఫిబ్రవరి 18, 2021

జల జల జలపాతం...

ఉప్పెన చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఉప్పెన (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి  
గానం : జస్ ప్రీత్, శ్రేయాఘోషల్  

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరుఅలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను

హే... మన జంటవైపు 
జాబిలమ్మ తొంగి చూసెనే
హే... ఇటు చూడకంటూ
మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే  

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను

సముద్రమంత ప్రేమ
ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుందీ లోపలా
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఎలాగ బైటపడుతోంది ఈవేళా
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్నూ
నీ నుంచి నన్నూ 
తెంచలేదు లోకం  

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

ఇలాంటి తీపి రోజు
రాదు రాదు రోజూ
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు
తడపదంట ఒళ్లు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఏక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను 
మనకు మనమే సొంతం 

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను
 

బుధవారం, ఫిబ్రవరి 17, 2021

ఓ మై లవ్లీ లలనా...

పడిపడి లేచే మనసు చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : పడిపడిలేచేమనసు (2018)
సంగీతం : విశాల్ చంద్రశేఖర్ 
సాహిత్యం : కృష్ణ కాంత్ 
గానం : సింధూరి విశాల్ 

నందగోపాల ఏమిటి ఈ లీల 
కంటపడవేమి రా.. 
ఎంత విన్నారా వేచి ఉన్నారా
మాయ విడవేమిరా

రాక్షసుల విరిచి 
దాగి నను గెలిచి 
ఆటలాడెవు రా ఆఅ 
కానరావేమి రా

ఓ మై లవ్లీ లలనా
ఏల నే రమ్మంటి 
ఓ మై లవ్లీ లలనా
ఏమి టే నే వింటి
ఓ మై లవ్లీ లలనా
నీదు బాధ కంటి
ఓ మై లవ్లీ లలనా
ఎలా దాగి వుంటీ 
ఓ మై లవ్లీ లలనా
కొంటెగా నిన్నంటి 
ఓ మై లవ్.. ఆఅ.. 

యదు భూషణా సురా 
పూతనా వధే చేసినా 
కాళింది లోతునా 
కాళీయునణచినా
మహాసురులకే ముక్తే పంచినా
దివ్య రూపమే గనే కాంక్షగా
నిన్నే కాంచగా కన్నార కన్నార 
ప్రియా గోపిలోల ముకుందా కృష్ణా

ఓ మై లవ్లీ లలనా
ఏల నే రమ్మంటి 
ఓ మై లవ్లీ లలనా
కొంటె గా నిన్నంటి
ఓ మై లవ్లీ లలనా
ఓ మై లవ్లీ లలనా
ఓ మై లవ్లీ లలనా


మంగళవారం, ఫిబ్రవరి 16, 2021

చిరునవ్వే నవ్వుతూ...

ఓయ్ చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఓయ్ (2009)
సంగీతం : యువన్ శంకర్ రాజా 
సాహిత్యం : వనమాలి
గానం : కె.కె.  

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..
చిగురాశని రేపుతూ నీ ప్రేమని తెస్తావనీ..
నిను వెతికానే..నన్నే తాకే..గాలులనే ఆరా తీస్తూ..
నిలుచున్నానే నీకై వేచే..తీరాన్నే ఆరాధిస్తూ..
ప్రతి జన్మా..నీతోనే..
I am waiting for you baby..
ప్రతి జన్మా..నీతోనే..
I am waiting for you baby..
ఓఓఓ..ఓ..ఓ..ఓ..ఓఓఓఓఓ..ఓఓఓ...
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..
చిగురాశని రేపుతూ నీ ప్రేమని తెస్తావనీ..

నువ్వూ నేనూ ఏకం అయ్యే..ప్రేమల్లోనా..ఓ..ఓ..
పొంగే ప్రళయం నిన్నూ..నన్నూ..వంచించేనా..
పువ్వే ముళ్ళై కాటేస్తోందా..ఆ..ఆ..ఆ...
నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ..ఆ...
విధినైనా వెలేయనా..నిను గెలిచేయనా..
నీకోసం నిరీక్షణా..ఆ..ఆ..
I am waiting for you baby..
ప్రతి జన్మా..నీతోనే..
I am waiting for you baby..
ఓఓఓ..ఓ..ఓ..ఓ..ఓఓఓఓఓ..ఓఓఓ...

ప్రేమనే ఒకే మాటే..ఆమెలో గతించిందా..
వీడనీ భయం ఏదో..గుండెనే తొలుస్తోందా..
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా..
విధినైనా వెలేయనా..నిను గెలిచేయనా..
నీకోసం నిరీక్షణా..ఆ..ఆ..
I am waiting for you baby..

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ..
చిగురాశని రేపుతూ నీ ప్రేమని తెస్తావనీ..
నిను వెతికానే..నన్నే తాకే..గాలులనే ఆరా తీస్తూ..
నిలుచున్నానే నీకై వేచే..తీరాన్నే ఆరాధిస్తూ..
ప్రతి జన్మా..నీతోనే..
I am waiting for you baby..
ప్రతి జన్మా..నీతోనే..
I am waiting for you baby..
 


సోమవారం, ఫిబ్రవరి 15, 2021

టిక్ టిక్ టిక్ టిక్...

సవ్యసాచి చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సవ్యసాచి (2018)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : అనంత శ్రీరామ్ 
గానం : హైమత్, శ్రేయ గోపరాజు  

కోపం అపార్థం
ఓ ఇంకా ఇంకా పెంచిందే నీ అందం
రోషం ఆవేశం
నాలో కొంచెం పెంచిందేదో పంతం
Tick tick tick tick tick tick tick
కదిలిన ముల్లే గుండెల్లోన గుచ్చే
Tick tick tick tick tick tick tick
నువ్విక నాకే ఆఖరి మజిలీవి
లవ్ మీ.. లవ్ మీ.. ఓ.. 
నీడగా ఉంటానే ప్రతిసారి
I am very sorry లేదు వేరే దారి

చాలా చాలా చేశానిప్పటికే
Please don't mind
చూసి చూసి చూడనట్టోదిలేసేయ్
Love is blind
కోపం that's the part of game
ఆటయ్యాక జస్టే డ్రీమ్ 
నీలో ప్రేమ ఎంతుందో
నాలో కూడా same to same

Tick tick tick tick tick tick tick
గడవదు కాలం నీతో పాటే ఉంటే
Tick tick tick tick tick tick tick
గడియారానికి సంకెళ్ళేసి మరీ
ఓ Honey ఓ
ఆపేస్తాగా ఆ సమయాన్ని
చుట్టూ లోకం ఏమైనా అయిపోని
Tick tick tick tick tick tick tick
Tick tick tick tick tick tick tick
 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.