సోమవారం, ఫిబ్రవరి 08, 2021

హే ఇది నేనేనా...

సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం లోని ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సోలో బ్రతుకే సో బెటర్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్      
సాహిత్యం : రఘురామ్ 
గానం : సిద్ శ్రీరామ్  

ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
గుండెల్లో మొదలయ్యిందే…
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
నన్నిట్టా చేరిందే… ధీమ్ ధీమ్ తననన థోమ్

కలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా 
పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా
నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా
అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా

నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట
ఈ అవకాశం చేజారిందంటే మల్లీ రాదంటా
అనుమతినిస్తే నీ పెనిమిటినై ఉంటానే నీ జంటా
ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కధ మనదేనంటా

హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే
నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా 

మే నెల్లో మంచే పడినట్టు 
జరిగిందే ఏదో కనికట్టు
నమ్మేట్టుగానే లేనట్టు ఓ ఓ 
వింటర్ లో వర్షం పడినట్టు
వింతలు ఎన్నెన్నో జరిగేట్టు 
చేసేసావే నీమీదొట్టు ఓ ఓ…

ఖచ్చితంగా నాలోనే 
మోగిందేదో సన్నాయి
ఈ విధంగా ముందెపుడూ 
లేనే లేదే అమ్మాయి

హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే
నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!! 



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.