గురువారం, ఫిబ్రవరి 25, 2021

కోపం వస్తే మండుటెండ...

తారకరాముడు చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తారకరాముడు (1997)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల   
గానం : బాలు, చిత్ర 

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండికొండ

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

నాకు తెలుసా మంచి చెడ్డ
నువ్వు చెబితే నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా

నీ అల్లర్లు అందం
నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించె
నీ నేస్తమె మంచి గంధం 

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా
గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట.
మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చెసెదొకటే పేర్లే వేరట
అవునో కాదో తెలియదు కానీ
నువు చెబుతుంటే అవునంటా
మరి అంతలోనె 
బుంగమూతి సంగతేంటటా

నాకు తెలుసా మంచి చెడ్డ
నువు చెబితె నెర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా.. ఆ..

నిండు కుండ కాదు కనుక తొణుకుతుందది.
అంత వింత అందులోన ఏమిటున్నది
నాలో తెలివికి దీన్లో నీటికి
పోలికె గుళుకు గుళుకు పలుకుతున్నది.
అమృతం లాంటి హృదయం నీది
అంతకన్న వేరే వరమేది?
అది తెలిసి కూడ కసురుతుంటె
నేరమెవరిది?

కోపం వస్తే మండుటెండ
మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

ఏంటో
నాకు తెలుసా మంచి చెడ్డ
నువు చెబితె నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా

నీ అల్లర్లు అందం
నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించె
నీ నేస్తమె మంచి గంధం 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.