ఒకే ఒక్కడు చిత్రం లోని ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఒకేఒక్కడు (1999)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : ఏ.ఎం.రత్నం
గానం : హరిహరన్, మహలక్ష్మి అయ్యర్
నెల్లూరి నెరజాణా
నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణా
నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా
పెదవెంట ఉసురొలకా
నీ వల్ల ఒక పరి జననం
ఒక పరి మరణం అయినదీ
అరె పారేటి సెలయేరు
అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెలే
అరె కాలం మరిచి
అడవి చెట్టు పూచెనులే
నెల్లూరి నెరజాణా
నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
జొన్న కంకి ధూళే పడినట్టు
కన్నులలొ దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవె
ఒక మారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచీ
మాటలను జుర్రుకొనీ
వేళ్లతొ వత్తిన మెడపై
రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది
నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే
ఇక ఒళ్లు మొత్తం
చెయ్యవలెను పుణ్యమునే
నెల్లూరి నెరజాణా
నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
ఒక ఘడియ కౌగిలి బిగియించి
నా ఊపిరాపవె ఓ చెలియా
నీ గుండె లోగిలి నే చేరా
నన్ను కొంచెం హత్తుకొ చెలికాడా
చినుకంటి చిరుమాటా
వెలుగంటి ఆ చూపు
దేహమిక మట్టిలొ కలిసి
పోయేవరకు ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా
నువు మరణించిపోవుటెల
అరె నీ జీవమె నేనేనయా
చంపదలచు మరణమైన
మాయమయా
నెల్లూరి నెరజాణా
నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా
పెదవెంట ఉసురొలకా
నీ వల్ల ఒక పరి జననం
ఒక పరి మరణం అయినదీ
అరె పారేటి సెలయేరు
అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెలే
అరె కాలం మరిచి
అడవి చెట్టు పూచెనులే
నెల్లూరి నెరజాణా
నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ
నన్ను కొంచెం మార్చుకుంటా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
1 comments:
“నెల్లూరునెఱజాణ” 🤔. హుఁ, ఇదొక గొప్ప పాట అని అయితే అనను గానీ ఈ పదప్రయోగం మాత్రం నన్నొకసారి అయోమయంలో పడేసింది, వేణుశ్రీకాంత్ గారు. ఏనాడో పూర్వీకుల కాలం నుండే జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న ఈ మాటను నేనొకసారి ఒక కామెంటులో వాడినప్పుడు ఒక బ్లాగరు గారు హర్షించ లేదు 😏. (వారిదేమన్నా ఆ ప్రాంతమేమో మరి 🤔)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.