శతమానంభవతి చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శతమానంభవతి (2017)
సంగీతం : మిక్కీ.జె.మేయర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : బాలు
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాసే.. కాళిదాసై..
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
ఆదోలాంటి తేనెల బాణం
దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలో
పూలగంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కదే
హాయి రాగాలు ఆమనిగా
దినమొక రకముగ పెరిగిన
సరదా నినువిడి మనగలదా
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
ఎలా నీకు అందించాలో
ఎదలో కదిలే మధురిమను
నేనే ప్రేమ లేఖగ మారి
ఎదుటే నిలిచాను
చదువుకుని బదులిదని
చెప్పుకో లేవులే మనసా
పదములతో పనిపడని
మౌనమే ప్రేమ పరిభాష
తెలుపగ తెలిపిన వలపొక
వరమని కడలిగ అలలెగశా
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాసే.. కాళిదాసై..
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.