ఆదివారం, ఫిబ్రవరి 14, 2021

అరెరే ఆకాశంలోనా...

ప్రేమికులకు వేలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కలర్ ఫోటో చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కలర్ ఫోటో (2020)
సంగీతం : కాలభైరవ
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ 
గానం : అనురాగ్ కులకర్ణి, కాలభైరవ  

అరెరే ఆకాశంలోనా
ఇల్లే కడుతున్నావా
 
సూరీడు కూడా పడలేని సోటా
రంగేసినాడు తలదాసుకుంటా
తన రూపు తానే తెగ సూసుకుంటా
మా కిట్టి గాడు పడ్డాడు తంటా
 
అరెరే ఆకాశంలోనా
ఇల్లే కడుతున్నానా

ఓ… సిత్రలహరీ పాటంతా తానూ
రేడియోలో గోలంట నేను
బొమ్మ కదిలేలా గొంతు కలిసేనా
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ
నేనేమో కట్ అయినా టిక్కెట్టునీ
మన జంట హిట్ అయినా సినిమా అని
అభిమానులే వచ్చి సుత్తారని
 
పగలు రేయంటూ లేదు…
కలలే కంటూ ఉన్నా
తనతో నుంచుంటే చాలు…
కలరూ ఫొటోలోనా…
 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.