జస్టిన్ ప్రాభాకరన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జస్టిన్ ప్రాభాకరన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, ఫిబ్రవరి 03, 2021

ఓ కలలా కథలా...

డియర్ కామ్రేడ్ చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్   
సాహిత్యం : రెహ్మాన్     
గానం : సత్యప్రకాష్, చిన్మయి 

ఓ కలలా కథలా
కలిసి దూరాలే తీరాలై
ఓ జతగా జగమై కదిలె
పాదాలే ప్రాణాలై

ఇది విదియే విదిగా
కలిపే ఊహించని మలుపై
ఇరుదిశలే ఒకటై నిలిచే
తొలి వేకువలో
ఈ క్షణమే మనకే దొరికే
సంతోషం మనదై కడవరకూ
మనతో నడిచె ఈ దారిలొ

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనే కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

గడిచిన కాలం గాయం ఏదో చేసిన
మనసుపై మందె పూసే 
మంత్రమున్నదె
నిరంతరం నీడ లాగ
ఉంటున్నది తానేగా
ఉషస్సులొ ఊపిరి పంచే
గాలి పాటలా
ఒక చినుకేదొ తాకి
చిగురేస్తుంటె చైత్రం
తడి కన్నుల్లొ విరిసె
చిరునవ్వె నీ సొంతం

విడిపోలేవు గంధాలు 
ఆ పూలకుండే
అవి కనరాని బంధాలులే..
దారిలొ దారిలొ దారిలొ.

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

మనసుకు నేడే మళ్ళీ ఇంకొ జన్మల
ఎడారిలొ పూలై పూసే
వాన జల్లులా…
వసంతమై ఈ ప్రవాహం
వర్ణాలతొ సావాసం
ప్రతిక్షణం పచ్చగ నవ్వె
కొత్త జీవితం

పడి లేచేటి పాదాలు
పారాడుతుంటే నడిపిస్తుంది
ఈ కాలమే…

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇలా
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

ఓ కలలా కథల
కలిసి దూరాలె తీరాలై
ఓ జతగ జగమై కదిలే
పాదాలే ప్రాణాలై

ఇది విదియె విదిగా
కలిపే ఊహించని మలుపై
ఇరుదిశలే ఒకటై నిలిచే
తొలి వేకువలొ
ఈ క్షణమే మనకె దొరికె
సంతోషం మనదై కడవరకు
మనతో నడిచె ఈ దారిలొ

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇలా
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం



ఆదివారం, జూన్ 21, 2020

గిర గిర గిర తిరగలి...

డియర్ కామ్రేడ్ చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ 
సాహిత్యం : రెహ్మాన్ 
గానం : గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల 

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగీ అరిగి పోయినా…
దినుసే నలగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్

అలుపెరగక తన వెనకాలే
అలసీ సొలసి పోయినా
మనసే కరగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్ 

చినదేమో తిరిగే చూడాదే.. 
ప్రేమంటే అసలే పడదే హోయ్

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగీ అరిగి పోయినా
దినుసే నలగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్

అలుపెరగక తన వెనకాలే
అలసీ సొలసి పోయినా
మనసే కరగా లేదులే
హోయ్.. హోయ్.. హోయ్..
హోయ్.. హోయ్.. హోయ్..

అలలు అలసి చతికిలపడునా
కలలు నిలిచి కలవర పడునా
సహజ గుణము నిముషము విడునా
ఏమి జరిగినా...
మనసునెపుడు వదలని తపన 
వినదు అసలు ఎవరేమనినా 
గగనమొరిగి తనపై పడిన 
ఆశ కరుగునా...

వేసవిలోన పెనుతాపం 
ఓ ఆరాటంలా 
నింగిని తాకి దిగిరాద 
వర్షంలా

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా 
దినుసే నలగా లేదులే

సన్నాయి డోలు పెళ్లి పాట పాడే 
అబ్బాయి ఓరకంట చుస్తున్నాడే 
బంగారు బొమ్మ తల ఎత్తి చూడే 
నీ ఈడు జోడే అందాల చందురూడే

ఎవరికెవరు తెలియదు మునుపు 
అడిగి అడిగి కలగదు వలపు
ఒకరికొకరు అని కలపనిదే 
మనని వదులునా

ఎదురుపడిన క్షణమొక మలుపు 
అడుగు కలిపి కదిలితే గెలుపు 
దిశలు రెండు వేరై ఉన్నా పయనమాగునా 
నేనంటే తానే తను నేనె ఒకటై ఉన్నానే 
పొమ్మన్నా పోనే పడతానే లేస్తానే

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగీ అరిగి పోయినా
దినుసే నలగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్

అలుపెరగక తన వెనకాలే
అలసి సొలసి పోయినా
మనసే కరగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్
 

శుక్రవారం, మే 17, 2019

కడలల్లె వేచె కనులే...

డియర్ కామ్రేడ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్    
సాహిత్యం : రెహ్మాన్
గానం : సిధ్ శ్రీరామ్, ఐశ్వర్యా రవిచంద్రన్   

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
ఒడిచేరి ఒకటై పోయే
ఒడిచేరి ఒకటై పోయే
తీరం కోరే ప్రాయం

విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంతచేరి సేదతీర ప్రాయమిలా
చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా
కాలాలు మారినా మారినా
నీ ధ్యాస మారునా
నీ ధ్యాస మారునా
అడిగింది మోహమే
నీ తోడు ఇలా ఇలా

విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే


నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే
నీవుగా

బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో

నీలోన చేరగా
నా నుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీ వైపు ఇలా ఇలా 

సోమవారం, మే 13, 2019

నీ నీలి కన్నుల్లోని...

డియర్ కామ్రేడ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్   
సాహిత్యం : రెహ్మాన్ 
గానం : గౌతమ్ భరధ్వాజ్ 

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే

నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే నా
కళ్ళే వాకిళ్లే
తీసి చూసే ముంగిళ్లే
రోజు ఇలా నే వేచి ఉన్నాలే
ఊగే ప్రాణం నీవల్లే

ఎవరూ చూడని
ఈ అలజడిలో
కుదురు మరచిన
నా ఎద సడిలో 
ఎదురు చూస్తూ
ప్రతి వేకువలో
నిదుర మరచిన
రాతిరి ఒడిలో

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.