శుక్రవారం, మే 17, 2019

కడలల్లె వేచె కనులే...

డియర్ కామ్రేడ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్    
సాహిత్యం : రెహ్మాన్
గానం : సిధ్ శ్రీరామ్, ఐశ్వర్యా రవిచంద్రన్   

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
ఒడిచేరి ఒకటై పోయే
ఒడిచేరి ఒకటై పోయే
తీరం కోరే ప్రాయం

విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంతచేరి సేదతీర ప్రాయమిలా
చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా
కాలాలు మారినా మారినా
నీ ధ్యాస మారునా
నీ ధ్యాస మారునా
అడిగింది మోహమే
నీ తోడు ఇలా ఇలా

విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే


నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే
నీవుగా

బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో

నీలోన చేరగా
నా నుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీ వైపు ఇలా ఇలా 

2 comments:

అవైటింగ్ ఫర్ దిస్ మూవీ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.