బుధవారం, మే 22, 2019

కుష్ కుష్...

గీతా ఛలో చిత్రంలోని ఒక పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గీతా...ఛలో (2019)
సంగీతం : జుదా శాండీ
సాహిత్యం :
గానం : ధనుంజయ్, మౌనిక 

క్రీస్తు పూర్వం ద్వాపర కాలం
ఉన్నాడొక వెన్నదొంగ
క్రీస్తు శకం ఈ కలికాలం
ఉన్నాడొక కన్నె దొంగ
గుచ్చే చూపులోడు
పంచు మాటలోడు
చుంచుం మాయలోడు
సురా సుకుమారా
గోల్డెన్నూ స్టారూ..

సాగర తీరనా నులి ఇసుకను కట్టేద్దాం
ఎత్తైన శిఖరం ఎక్కి ఆ నింగిని తాకేద్దాం
ఒక్క చోటే ఉండక ఈ లోకం చుట్టేద్దాం
శృతి మించె వయసు చూపించె దురుసు
నీదేలే రేసూ చిందేసే మనసూ
శృతి మించె వయసు చూపించె దురుసు
నీదేలే రేసూ చిందేసే మనసూ

కుష్ కుష్ వీడు టక్కరోడూ
కుష్ కుష్ వీడు మోజులోడు
కుష్ కుష్ వీడు వేటగాడు
కుష్ కుష్ వీడు ఆటగాడూ
కుష్ కుష్ వీడు సోకులోడు
కుష్ కుష్ వీడు ట్రిక్కులోడు

ఈ గుణ సుందరి సూర్యకమలం
ఈ సిరి కలువే చంద్ర కిరణం
తనకై వేచి ఉంది తులసీ నిత్యం
తన చేయి ముగ్గులేయు రంగోలికందము
సిగ్గుమొగ్గలున్న
గజ్జె కట్తుకున్నా
చిందులేయనున్న
నాట్యమయూరి
కొంటె చూపు మైనా
దివి నుండి దిగినా
బహు చక్కనైన
కన్యాకుమారి


పంచు మాటలోడు
చుంచుం మాయలోడు
సురా సుకుమారా
గోల్డెన్నూ స్టారూ..
కుష్ కుష్ వీడు టక్కరోడూ
కుష్ కుష్ వీడు మోజులోడు
కుష్ కుష్ వీడు వేటగాడు
కుష్ కుష్ వీడు ఆటగాడూ
కుష్ కుష్ వీడు సోకులోడు
కుష్ కుష్ వీడు ట్రిక్కులోడు


2 comments:

రష్మిక మూవీ ఇదొకటుందని తెలీదు..పాట చాలా బావుంది..

కన్నడలో హిట్ అయిన ఓల్డ్ మూవీని డబ్ చేసినట్లున్నారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.