బుధవారం, మే 08, 2019

ఇంతేనా ఇంతేనా...

సూర్యకాంతం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సూర్యకాంతం (2019)
సంగీతం : మార్క్ కె. రాబిన్  
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : సిద్ శ్రీరామ్

ఇంతేనా ఇంతేనా
ప్రేమంటే ఇంతేనా
పడిన దాకా తెలియదే

ఇంతేనా ఇంతేనా
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే

నిదుర లేదు
కుదురు లేదు
నిమిషమైనా నాకె

కదల లేను
వదలలేను
మాయ నీదేనా

మాటలైనా రానే రావు
పెదవి దాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా
నేను నిన్నేనా

ప్రేమ ఆకాశం
సరిపోయేనా దేహం
నీతో సావాసం
నను చేసేనా మాయం

తారలన్నీ రాలిపోయే
కన్నులై వెలిగే
దూరమంత తీరిపోయే
మనసు తనువును తాకితే

ఎదురు చూడని స్నేహమే
ఎదురు వచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే
వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పలేకున్నా
ఆ మాయలో నేను ఉన్నా
ఎంత చూస్తున్నా చాల లేదమ్మా
నా కళ్ళలో దాగే పొవా

ఇంతేనా ఇంతేనా
ప్రేమంటే ఇంతేనా
పడిన దాకా తెలియదే

ఇంతేనా ఇంతేనా
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే

నిదుర లేదు కుదురు లేదు
నిమిషమైనా నాకే
కదల లేను వదలలేను
మాయ నీదేనా

మాటలైనా రానే రావు పెదవి దాటే పైకే
పక్కనున్నా వెతుకుతున్నా నేను నిన్నేనా

ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం
నీతో సావాసం నను చేసేనా మాయం
తారలన్నీ రాలిపోయే కన్నులై వెలిగే
దూరమంత తీరిపోయే
మనసు తనువును తాకితే 


2 comments:

పాట మెలోడియస్ గా ఉంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.