అక్కడొకడుంటాడు చిత్రంలోని ఒక పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అక్కడొకడుంటాడు (2019)
సంగీతం : చంద్రలేఖ సార్క్స్
సాహిత్యం : దేవేంద్ర కె.
గానం : కారుణ్య
ఏ యోగీ యోగీ రే యోగీ
అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
కదిలి చూడు
కాలయముడై వేటాడగా
అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
నిలిచె నేడు
ధర్మధీరుడై పోరాడగా
ఏ యోగీ యోగీ రే యోగీ
శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
తీరాన ఓ మౌనరాగం
గుండెల్లొ గాయాల గేయం పాడగా
సాగింది ఓ రుధిర యాగం
ఎగిసింది ఓ వీర ఖడ్గం జ్వాలగా
పిలిచే కదన రంగం
చేసే సింహ నాదం
ధర్మం ధ్యేయమైతె
కాలం లొంగి రాదా
అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
కదిలి చూడు
కాలయముడై వేటాడగా
అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
నిలిచె నేడు
ధర్మధీరుడై పోరాడగా
ఏ యోగీ యోగీ రే యోగీ
శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
2 comments:
కారుణ్య ఆల్వేస్ రాక్స్..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.