గురువారం, మే 23, 2019

నా కళ్ళు చూసేది...

ప్రేమకథా చిత్రమ్ 2 సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమకథాచిత్రమ్ 2 (2019)
సంగీతం : జె.బి(జీవన్ బాబు)
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : సత్య యామిని  

నా కళ్ళు చూసేది నీ కలనే
నా మనసు మోసేది నీపై ఊహలనే
చిరునవ్వంటూ తెలిసింది నీ వలనే
నా అడుగు నడిచింది నిను చేరాలనే
ప్రతి రోజు నీ రాకతొ మొదలు
నాలో ఇక రాయని కథలు
నీతో ఈ మాటే తెలిపేది ఎలా

తెలుసా నా కళ్ళు చూసేది నీ కలనే
నా మనసు మోసేది నీపై ఊహలనే

ఎన్నో ఎన్నో కోపాలే
అన్నీ అన్నీ మరిచాలే
నన్నే నన్నే మార్చేటంతగా
నిన్న మొన్న అలకలు ఎన్నున్నా
చిన్ని చిన్ని చినుకులు అనుకున్నా
తుళ్ళి తుళ్ళి తడిశా వింతగా
ప్రతి సారీ వెతుకుతున్నా
ఎదురైతే నే తప్పుకున్నా
ఎదచాటుమాటు మాట ఏమిటో

ప్రతి రోజు నీ రాకతొ మొదలు
నాలో ఇక రాయని కథలు
నీతో ఈ మాటే తెలిపేది ఎలా
తెలుసా నా కళ్ళు చూసేది నీ కలనే
నా మనసు మోసేది నీపై ఊహలనే

అల్లేస్తున్నా గాలల్లే
చల్లేస్తున్నా పూవుల్నే
నువ్వే వెళ్ళె దారిలొ ముందుగా
నింపేస్తున్నా రంగులు ఎన్నెన్నో
పంపిస్తున్నా సందడులింకెన్నో
వెంటే ఉంటూ నీకే నీడలా
బదులేదీ తెలియకున్నా
విడలేనే ఏవేళనైనా
తొలిప్రేమ నాకు ప్రాణమవ్వగా

ప్రతి రోజు నీ రాకతొ మొదలు
నాలో ఇక రాయని కథలు
నీతో ఈ మాటే తెలిపేది ఎలా
తెలుసా నా కళ్ళు చూసేది నీ కలనే
నా మనసు మోసేది నీపై ఊహలనే


2 comments:

పాపం సుమంత్ అశ్విన్..పట్టు వదలని విక్రమార్కుడిలా విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు..

అలాంటి ఎన్నో ప్రయత్నాల తర్వాత సక్సెస్ అయిన నిఖిల్ నితిన్ లాంటి హీరోల ప్రోత్సాహమేమోనండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.