శనివారం, మే 25, 2019

మధురం మధురం మనోహరం...

సీత ఆన్ ద రోడ్ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీత ఆన్ ద రోడ్ (2019)
సంగీతం : ప్రణీత్ యారోన్
సాహిత్యం : సందీప్ 
గానం : హరిణి రావ్

మధురం మధురం మనోహరం
వ్యథలే వదిలిన తొలి తరుణం
సంతోషాల క్షణం ఇలా..
కావాలంది మదే ఇలా..
నాతో.. ఇలా..
కదిలా.. నేనిలా..


నాలో ప్రాణం మళ్ళీ జననం
కొమ్మలలోని చిరుగాలినిలా
చిరునవ్వులుగా తొడిగానిలా
మలుపుల దారిలో నడిచే నదిలా
మది తలపులతో నిజమై కదిలా
ఎగసే అలలా అలుపే వదిలా
కలతే లేని క్షణమై కదిలా

అరుణోదయమే అధరపు నవ్వై
అలికిడి లేని సమయము నేనై
విహంగమై విహరించా
తరంగమై పయనించా


పదపద మంటూ నాలో ప్రాణం
పరిగేడుతోంది ప్రతీ క్షణం
పరిచయమయ్యే ప్రతి నిమిషమిలా
పరవశమయ్యే మది మురిసేలా

మధురం మధురం
మనసే మధురం

 

3 comments:

చాలా అద్భుతంగా ఉందీ పాట..ప్రణీత్ యారోన్ మ్యూజిక్ చాలా బావుంది..

పెద్ద సింగర్ ఐతే ఈ పాట మంచి హిట్ అయ్యేదండి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.