ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రంనుండి ఒక పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఎవ్వరికీ చెప్పొద్దు (2019)
సంగీతం : శంకర్ శర్మ
సాహిత్యం : వాసు వలభోజు
గానం : దివ్య ఎస్. మీనన్
రెప్పకూడ వెయ్యనీవా
కళ్ళముందే ఉంటావా
ఏ వైపు చూడు నీవు
ప్రతి చోట నువ్వె
ఉంటావు ఎలాగ
ఓ నేనిన్ను చూసేందుకే
నా కళ్ళు విచ్చాయిలే
ఓ ఈ రోజు నాకింక
చాలంది సంతోషమే..
చూడకుండ ఉండనీవా
నిన్ను చూస్తూ ఉండాలా
ఓ నువ్వు ఎంత అందగాడివైన
నన్ను ఉడికిస్తావు ఎలాగా
ఓఓ నిన్ను నే చూడనే చూడను
అంటు నా చూపునే తిప్పను
నిన్ను నే చూసినా నవ్వనూ
నవ్వుతూ నీకెలా చెప్పనూ
నన్ను ఎంత దూరమైన తీసుకెళ్ళు
నేను నీకు దగ్గరైతే అవ్వనూ
అన్న మాట నేను నీకు చెప్పనూ
ఇంత సంతోషాన్ని ఎట్ల వీడనూ
ఓఓఓ.. ఎంతలా మనసుకే చెప్పనూ
ఎంతనీ నన్ను నేను ఆపనూ
ఏమిటీ అల్లరి దేవుడా
నిన్నికా నమ్మనే నమ్మను
పిచ్చి ఏదో పట్టినట్టు నన్ను నేను
తిట్టకుంటే తప్పు నాది కాదుగా
గాలి తీసుకొచ్చెనేమొ నన్నిలా
ఇంతలోనె ఇంతలేసి వింతలా
ఓఓ ఈ రోజునే ఇక్కడే
ఆపేయమంటున్నదీ
ఓఓ ఈ హాయి నాకింక
చాలంది సంతోషమే..
రెప్పకూడ వెయ్యనీవా
కళ్ళముందే ఉంటావా
ఏ వైపు చూడు నీవు
ప్రతి చోట నువ్వె
ఉంటావు ఎలాగ
ఓ నేనిన్ను చూసేందుకే
నా కళ్ళు విచ్చాయిలే
ఓ ఈ రోజు నాకింక
చాలంది సంతోషమే..
2 comments:
భలే ఉందీ పాట..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.