పింగళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పింగళి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, జనవరి 11, 2021

వేయి శుభములు...

శ్రీ కృష్ణార్జున యుద్ధం సినిమాలోని ఈ సన్నివేశాన్ని చూపించే చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఎస్. వరలక్ష్మి
 
వేయి శుభములు కలుగు నీకు 
పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి 
నిను మరవగలేములే...
వేయి శుభములు కలుగు నీకు 
పోయి రావే మరదలా.... 

వాసుదేవుని చెల్లెలా... 
నీ ఆశయే ఫలియించెలే...
వాసుదేవుని చెల్లెలా... 
నీ ఆశయే ఫలియించెలే...
దేవదేవుల గెలువజాలిన 
బావయే పతి ఆయెలే...

వేయి శుభములు కలుగు నీకు 
పోయి రావే మరదలా 

భరతవంశము నేలవలసిన 
వీరపత్నివి నీవెలే
భరతవంశము నేలవలసిన 
వీరపత్నివి నీవెలే
వీరధీర కుమారమణితో 
మరల వత్తువుగానిలే...

వేయి శుభములు కలుగు నీకు 
పోయి రావే మరదలా

ప్రాణపదముగ పెంచుకొంటిమి 
నిను మరవగలేములే...
వేయి శుభములు కలుగు నీకు 
పోయి రావే మరదలా...
 


గురువారం, డిసెంబర్ 31, 2020

కలగంటి కలగంటినే...

శ్రీకృష్ణ సత్య సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణసత్య (1971)
సంగీతం : పెండ్యాల  
సాహిత్యం : పింగళి  
గానం : జానకి 

కలగంటి కలగంటినే 
ఓ చెలియా ఓ మగువా ఓ లలనా 
కలగాని కలగంటినే 
కలగంటి కలగంటినే
 
కలలోని చోద్యములు 
ఏమని తెలుపుదునే
కలలోని చోద్యములు 
ఏమని తెలుపుదునే
తెలుప భల్ సిగ్గాయెనే
ఓ చెలియా ఓ మగువా ఓ లలనా
తలపా మైపులకించెనే

కలగంటి కలగంటినే 

అందాల శ్రీకృష్ణుడు 
విందుగా ననుచేరి
ఆఆఆ...ఆఆఆఅ... 
అందాల శ్రీకృష్ణుడు 
విందుగా ననుచేరి
సుందరి లేలెమ్మని
ఆఁ.. అయ్యో! అంత పనే !  
సుందరి లేలెమ్మని సందిట 
సందిట పొదవి నటుల 

కలగంటి కలగంటినే 
ఓ చెలియా ఓ మగువా ఓ లలనా 
కలగాని కలగంటినే 
కలగంటి కలగంటినే

మున్నెరుగని సుఖలీలల 
చెక్కిలి...
ఊహూ సరి సరి !
చెక్కిలి నొక్కుచు 
చిన్నారీ... 
చిన్నారి కోకొమ్మని 
చిరుముద్రలు
అబ్బ అయ్యో హహహ! 
చిరు ముద్రలు వేసినటుల

కలగంటి కలగంటినే 

గోముగా నను చూసి 
మోము మోమున చేర్చి
గోముగా నను చూసి 
మోము మోమున చేర్చి
భామరో...ఆఆఆఆఅ.. 
భామరో రారమ్మని 
ఏమేమో.. అవ్వ... 
ఏమేమో చేసినటుల

కలగంటి కలగంటినే 
ఓ చెలియా ఓ మగువా ఓ లలనా 
కలగాని కలగంటినే 
కలగంటి కలగంటినే
 

 

మంగళవారం, డిసెంబర్ 29, 2020

అలిగితివా సఖీ ప్రియ...

శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా... 

లేని తగవు నటింతువా 
మనసు తెలియ నెంచితివా
లేని తగవు నటింతువా 
మనసు తెలియ నెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక 
దయనుజూడవా... ఆ.. ఆ...

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా 

నీవె నాకు ప్రాణమని 
నీయానతి మీరనని
నీవె నాకు ప్రాణమని 
నీయానతి మీరనని
సత్యాపతి నా బిరుదని 
నింద యెరుగవా...ఆ...ఆ..

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా 

ప్రియురాలివి సరసనుండి 
విరహమిటుల విధింతువా
ఆ...ఆ...ఆ..ఆ...ఆ...ఆ...ఆ...
ప్రియురాలివి సరసనుండి 
విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా 
కనికరింపవా..ఆ...ఆ...ఆ.. 

నను  భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా
చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే 
ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా! 
 

సోమవారం, డిసెంబర్ 28, 2020

అలుక మానవే...

శ్రీకృష్ణ సత్య సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణ సత్య (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు  
గానం : ఘంటసాల, యస్. జానకి    

అలుక మానవే చిలకల కొలికిరొ
తలుపు తీయవే ప్రాణసఖీ
తలుపు తీయవే ప్రాణసఖీ
దారితప్పి ఇటు చేరితివా
నీ దారి చూసుకోవోయి 
నా దరికి రాకు రాకోయి

కూరిమి కలిగిన తరుణివి నీవని
తరుణము నెరిగియే చేరితినే
కూరిమి కలిగిన తరుణివి నీవని
తరుణము నెరిగియే చేరితినే
నీ నెరినెరి వలపు నే కోరితినే
నీ నెరినెరి వలపు నే వేడితినే

అలుక మానవే చిలకల కొలికిరొ
తలుపు తీయవే ప్రాణసఖీ
తలుపు తీయవే ప్రాణసఖీ

చేసిన బాసలు చెల్లించని 
భల్ మోసగాడివీఓయి
చేసిన బాసలు చెల్లించని 
భల్ మోసగాడివీఓయి
ఇక ఆశ లేదు లేదోయి
ఇక ఆశలేదు పొవోయి

దాసుని నేరము దండముతో సరి
బుసలు మాను ఓ ఒగలాడి
దాసుని నేరము దండముతో సరి
బుసలు మాని ఓ ఒగలాడి
నా సరసకు రావే సరసాంగి
నా సరసకు రావే లలితాంగి

అలుక మానవే చిలకల కొలికిరొ
తలుపు తీయవే ప్రాణసఖీ
తలుపు తీయవే ప్రాణసఖీ
 

సోమవారం, నవంబర్ 16, 2020

రసిక రాజ మణి రాజిత...

మహాకవి కాళిదాసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మహాకవి కాళిదాసు (1960)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : పింగళి  
గానం : పి.లీల, రత్నం

రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ
గాన నాట్యముల ఘన కౌశలమున 
నన్ను మించెదవె సోదరీ

రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ
ప్రియ సోదరీ 
రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ

అమరగానమున హాయి హాయిగా
అమరగానమున హాయి హాయిగా
భోజకీర్తి కాంభోజి రాగమున
భోజకీర్తి కాంభోజి రాగమున
అమరసంగతులు వేయవే

నెమిలి నీడలో నిలచిన నాగు 
సమమున సాములు చేయవే

రాగ తాళముల సరళిని రవళిని 
జగడము సాగని చందమే
రాగ తాళముల సరళిని రవళిని 
జగడము సాగని చందమే
మన జగడము సాగని చందమే

రవి గాననిచో కవి గాంచునెకదా 
రవి గాననిచో కవి గాంచునెకదా 
కవి యేమనునో విందమే
మన కవి యేమనునో విందమే

రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ
ప్రియ సోదరీ 
రసిక రాజ మణి రాజిత సభలో
యశము గాంచెదవె సోదరీ



సోమవారం, జులై 13, 2020

ఆడువారి మాటలకు...

ఖుషి సినిమా కోసం మిస్సమ్మ చిత్రంలోని "ఆడువారి మాటలకు" పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట ఒరిజినల్ ఫ్లేవర్ ఏమాత్రం చెడకుండా ఈ తరం అభిరుచికి తగినట్లుగా రీమిక్స్ అంటే ఇలాగే చేయాలనిపించేలా మణిశర్మ చేసిన ఈ రీమిక్స్ ఒరిజినల్ అంత పాపులర్ అయింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : ఖుషి (2001)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రీమిక్స్ : మణిశర్మ 
సాహిత్యం : పింగళి
గానం : ఖుషి మురళి

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచో
చెలిమిజేయ రమ్మనిలే
అలిగి తొలగి నిలిచినచో
చెలిమిజేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
మర్యాదగ పొమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
మర్యాదగ పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టమెలే
విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టమెలే
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ తరానికి రీమిక్స్ నచ్చితే ఆ తరానికి ఒరిజినల్ పాట ఎంతగా నచ్చిందో చెప్పనక్కర్లేదు కదా. ఆ ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : ఏ. ఎం. రాజా

ఔనంటే కాదనిలే
కాదంటే అవుననిలే
ఔనంటే కాదనిలే
కాదంటే అవుననిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో
చెలిమిజేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో
మర్యాదగ పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...

విసిగి నసిగి కసిరినచో
విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టమెలే
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...

ఔనంటే కాదనిలే
కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...
 

బుధవారం, జూన్ 24, 2020

మనసు పరిమళించెనే...

శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, సుశీల 

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 
మనసు పరిమళించెనే..  
తనువు పరవశించెనే
నవ వసంత గానముతో.. 
నీవు నటన సేయగనే

మనసు పరిమళించెనే..  
తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో.. 
నీవు చెంత నిలువగనే 
మనసు పరిమళించెనే.. 
తనువు పరవశించెనే

నీకు నాకు స్వాగతమనగా 
కోయిలమ్మ కూయగా
ఆ..... ఆ.... . ఆ..... ఆ....
నీకు నాకు స్వాగతమనగా 
కోయిలమ్మ కూయగా
గలగలగల సెలయేరులలో 
కలకలములు రేగగా 
మనసు పరిమళించెనే.. 
ఆ.. ఆ.. హా..
తనువు పరవశించెనే.. 
ఓ..ఓ..ఓ..
నవ వసంత గానముతో... 
నీవు చెంత నిలువగనే 

మనసు పరిమళించెనే... 
తనువు పరవశించెనే

క్రొత్త పూల నెత్తావులతో 
మత్తుగాలి వీచగా
ఆహ .. ఆ . అ ఆ
క్రొత్త పూల నెత్తావులతో 
మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు 
గుములు గుములుగా... 
ఝుం ఝుమ్మని పాడగా 

మనసు పరిమళించెనే... 
తనువు పరవశించెనే

తెలి మబ్బులు కొండ కొనలపై 
హంసల వలె ఆడగా
అహా .. ఆ . అ.. ఆ
తెలి మబ్బులు కొండ కొనలపై 
హంసల వలె ఆడగా
రంగరంగ వైభవములతో 
ప్రకృతి విందు సేయగా

మనసు పరిమళించెనే...  
తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో 
నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే... 
తనువు పరవశించెనే 



బుధవారం, మే 27, 2020

నా సరి నీవని...

సి.ఐ.డి. చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సి.ఐ.డి (1965)
సంగీతం : ఘంటసాల      
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, సుశీల 

నా సరి నీవని నీ గురినేనని
ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది
పులకలు కలిగెనులే

నీకు నాకు వ్రాసి ఉన్నదని
ఎఫుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది
కలవరమాయెనులే


నా సరి నీవని నీ గురి నేనని
ఇపుడే తెలిసెనులే

నా హృదయమునే వీణ చేసుకొని
ప్రేమను గానం చేతువని..
ఆఆఆఆ.. ఆఆ..
నా హృదయమునే వీణ చేసుకొని
ప్రేమను గానం చేతువని
నీ గానము నా చెవి సోకగనే
నా మది నీదై పోవునని
నీ గానము నా చెవి సోకగనే
నా మది నీదై పోవునని..

నీకు నాకు వ్రాసి ఉన్నదని
ఎపుడో తెలిసెనులే

నను నీ చెంతకు ఆకర్షించే
గుణమే నీలో ఉన్నదని
నను నీ చెంతకు ఆకర్షించే
గుణమే నీలో ఉన్నదని

ఏమాత్రము నీ అలికిడి ఐనా
నా ఎద దడ దడలాడునని
ఏమాత్రం నీ అలికిడి ఐనా
నా ఎద దడ దడలాడునని


నా సరి నీవని నీ గురి నేనని
ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలది
కలవారమాయెనులే

నా సరి నీవని నీ గురి నేనని
ఇపుడే తెలిసెనులే
 

బుధవారం, మే 06, 2020

మౌనముగా నీ మనసు పాడిన...

గుండమ్మ కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ సినిమాలో పాటలు ఎప్పుడు విన్నా ఘంటసాల గారు ఇంకా కొన్ని సినిమాలకి సంగీతం ఇచ్చి ఉంటే బావుండేదేమో అనిపిస్తుంటుంది. ఇక ఈ పాటైతే మొదట్లో వచ్చే మ్యూజిక్ బిట్ వినగానే మనసులో ఒక మధురభావన వచ్చేస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల

మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం
నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
 
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే

కదిలీ కదలని లేత పెదవుల
తేనెల వానలు కురిసెనులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదిలీ కదలని లేత పెదవుల
తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృత వాహిని
ఓలలాడి మైమరచితిలే

మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే


ముసిముసినవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముసిముసినవ్వుల మోముగని
నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ
వలపు పాశమని బెదరితిలే

మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటిలే

 

ఆదివారం, మార్చి 01, 2020

అమ్మా నొప్పులే...

మార్చి నెలంటే పరీక్షల నెల కదా.. అందుకే విద్యార్ధులందరకూ ఆల్ ద బెస్ట్ చెపుతూ ఈ నెలంతా చదువుకు సంబంధించిన పాటలు తలుచుకుందాం. ముందుగా పరీక్షలు తప్పించుకోవడానికి ఓ అల్లరి పిల్లవాడు వేసిన ఎత్తును వాళ్ళమ్మ ఎలా చిత్తు చిత్తు చేసిందో పెళ్ళిచేసి చూడు చిత్రంలోని ఈ చక్కని నృత్యరూపకం లో చూద్దామా. ఈ ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : పెళ్ళిచేసిచూడు (1952)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : పింగళి
గానం : కె.రాణి, ఉడుతా సరోజిని, ఏ.పి.కోమల

పరీక్షలు పరీక్షలు పరీక్షలు..
పాడు పరీక్షలు...
పాఠాల్రాకపోయినా
పరీక్షలొచ్చి కూర్చున్నాయ్
ఇపుడు పరీక్షకెట్లా ఎగ్గొట్టడం..
ఆఅ... కడుపులో నొప్పొచ్చిందని..
వంక పెట్టేస్తాను..


అమ్మా నొప్పులే..
అమ్మమ్మా నొప్పులే..
అమ్మా నొప్పులే..
అమ్మమ్మా నొప్పులే..
ఫస్టుక్లాసులో ప్యాసవుదామని
పట్టుబట్టి నే పాఠాల్ చదివితే
ఫస్టుక్లాసులో ప్యాసవుదామని
పట్టుబట్టి నే పాఠాల్ చదివితే
పరీక్షనాడే పట్టుకొన్నదే
బడికెట్లానే వెళ్ళేదే..

అమ్మా నొప్పులే..
అమ్మమ్మా నొప్పులే..

బాబూ లేవరా..
ఈ మందూ తాగరా..
పరీక్ష కోసం దిగులు పడకురా
వచ్చే ఏటికి ప్యాసవుదువులే
పరీక్ష కోసం దిగులు పడకురా
వచ్చే ఏటికి ప్యాసవుదువులే
నువు బాగుంటే మాకు చాలురా
నిక్షేపంగా ఇంట నుండరా...
బాబూ లేవరా..
ఈ మందూ తాగరా..


చిల్లూ గారెలా..
అయ్యయ్యో బూరెలా..
పరిక్షలిచ్చే పాపకోసమని
కమ్మ కమ్మగా నేను చేస్తినే
అయ్య నోట శని పట్టెను ఏమో
మాయల మారి నొప్పులొచ్చెనే
అయ్యో గారెలా..
అయ్యయ్యో బూరెలా..


అమ్మా ఒక్కటే
అమ్మమ్మా ఒక్కటే
అమ్మా ఒక్కటే
అమ్మమ్మా ఒక్కటే
బుద్ది వచ్చెనా నీకు బుద్ధి వచ్చెనా
బుద్ది వచ్చెనే అమ్మ బుద్ది వచ్చెనే
లెంపలేసుకో ఐతె లెంపలేసుకో
వేసుకొంటినే అమ్మ ఒక్కటివ్వవే
బుద్ది వచ్చెనా
బుద్ది వచ్చెనే అమ్మ బడికి పోదునే
బాగ చదువుకుందునే.. 



శనివారం, ఫిబ్రవరి 29, 2020

కోలు కోలోయన్న...

గుండమ్మ కథ చిత్రంలోని ఒక హుషారైన ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, సుశీల

కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు

మేలు మేలోయన్న మేలో నా రంగ
కొమ్మలకి వచ్చింది ఈడు
మేలు మేలోయన్న మేలో నా రంగ
కొమ్మలకి వచ్చింది ఈడు ఈ ముద్దు
గుమ్మలకు చూడాలి జోడు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
అహహా..అహహా..ఆ..ఆ..ఆ..
ఒహోహో..ఓ.ఓ..ఓ..

బాలబాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాల
బాలబాలోయన్న బాలో చిన్నమ్మి
అందాల గారాల బాల
ఓఓఓ ఓ ఓ ఓ ఓ ....

బేలొబేలోయన్న బేలో పెద్దమ్మి
చిలకల కులికేను చాల
బేలోబేలోయన్న దిద్దినకదిన
దిద్దినకదిన దిద్దినకదిన ద్దిన్
హోయ్ బేలోబేలోయన్న బేలో పెద్దమ్మి
చిలకల కులికేను చాల
ఈ బేల.....పలికితే ముత్యాలు రాల
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
అహహా..అహహా..ఆ..ఆ..ఆ..
ఒహోహో..ఓ.ఓ..ఓ..ఓ.ఓ..ఓ.

ముక్కు పైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమో మంచీదే పాపం
ముక్కు పైనుంటాది కోపం చిట్టెమ్మ
మనసేమో మంచీదే పాపం
ఓ.ఓ..ఓ..ఓ.ఓ..ఓ.

ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ
కంట చూసిన పోవు తాపం
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ
కంట చూసిన పోవు తాపం
జంటుంటే ఎందు రానీదు ఏ లోపం
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

కోలు కోలోయన్న కోలో నా సామి
కొమ్మలిద్దరు మాంచి జోడు
అహహా..అహహా..ఆ..ఆ..ఆ..
ఒహోహో..ఓ.ఓ..ఓ..ఓ.ఓ..ఓ. 

 

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

కలవరమాయే మదిలో...

పాతాళభైరవి సినిమా గురించి ఈ పాట గురించి తెలియని తెలుగు వాళ్ళుండరేమో కదా... ఈ మధురమైన పాటను మరోసారి చూసీ వినీ ఆనందించండి మరి... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం: పాతాళభైరవి(1951)
సంగీతం: ఘంటసాల
రచన: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి లీల

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే 
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే 
మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే

కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే

కలవరమాయే మదిలో నా మదిలో

కన్నులలోన కలలే ఆయే 
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో


శుక్రవారం, ఫిబ్రవరి 14, 2020

ఎంత ఘాటు ప్రేమయో...

ప్రేమికుల రోజు సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాతాళ భైరవి చిత్రంలోని ఒ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట  ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాతాళ భైరవి (1951)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, లీల

ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్రమీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే...

ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్రమీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే...
ఎంత ఘాటు ప్రేమయో

ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే

ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే
యెంత లేత వలపులో

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
విరహములో వివరాలను విప్పి జెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో..


 

శుక్రవారం, ఆగస్టు 30, 2019

ఆది లక్ష్మి వంటి...

జగదేక వీరుని కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జగదేకవీరుని కథ (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : సుశీల, లీల, సరోజిని, రాజరత్నం

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా

కలుగునే మీ వంటి సాధ్వి అత్తగమాకు
తొలి మేము చేసిన పుణ్యమున గాక
మందారమాలతీ పారిజాతాలతో
అందముగ ముడివేసి అలరజేసేము

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా

మనసు చల్లన కాగ మంచి గంధము పూసి
మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము
పారాణి వెలయించి పాదపూజను చేసి
కోరికలు తీరునని పొంగి పోయేమూ

ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా
సేవలంది మాకు వరములీయవమ్మా 


బుధవారం, ఆగస్టు 21, 2019

అమ్మా మహాలక్ష్మి...

గుణసుందరి కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుణసుందరి కథ (1949)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : ఘంటసాల

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
మమ్ము మా పల్లె పాలింపవమ్మా
మమ్ము మా పల్లె పాలింపవమ్మా

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా

ఎన్ని నోముల పంటవొ అమ్మా
ఎన్ని నోముల పంటవొ అమ్మా
ఏమి పుణ్యాల ఫలమౌ అమ్మా

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా

నీవు పట్టింది బంగారమమ్మా
నీవు మెట్టింది స్వర్గమె అమ్మా
నీవు మెట్టింది స్వర్గమె అమ్మా
నీవు పలికింది నిజ ధర్మమమ్మా
నీవు పలికింది నిజ ధర్మమమ్మా
నీవు మా భాగ్య దేవతవే అమ్మా

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా

ఎరుకలు జీవజనులను మరువ వలదమ్మా
పరువున రాచవారిని తీసిపోమమ్మా
పరువున రాచవారిని తీసిపోమమ్మా

నిను కన్నబిడ్డగ చూచునే అమ్మా
నిను కన్నబిడ్డగ చూచునే అమ్మా
నిను కంటిపాపగ కాచునే అమ్మా

అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా
అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా

ఆదివారం, ఫిబ్రవరి 17, 2019

ఛాంగు భళా...

మహాకవి కాళిదాసు చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహాకవి కాళిదాసు (1960)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల 

ఛాంగుభళా 
వెలుగు వెలగరా నాయనా 
ఛాంగు భళా 
భళిగ చెలగరా నాయనా..
నాయనా...ఆఆఆఆఆ..

నేలపైన నింగి వుంది
నింగి కింద నేలవుంది
నేలపైన నింగి వుంది
నింగి కింద నేలవుంది
ఈ నడాన బండమీద
వెల్లకిలా బబ్బోకా

వెలుగు వెలగరా నాయనా
ఛాంగుభళా 
భళిగ చెలగరా నాయనా

ఒక మొగోడికొకే పెళ్ళాం
ఒక మొగోడికొకే పెళ్ళాం
ఎక్కడో నక్కి వుంది
చొక్కమ్మకు దణ్ణఁవెట్టి
చుక్కా నడిగీ తెచ్చుకోనీ
చొక్కమ్మకు దణ్ణఁవెట్టి
చుక్కా నడిగీ తెచ్చుకోనీ

వెలుగు వెలగరా నాయనా
ఛాంగుభళా 
భళిగ చెలగరా నాయనా

చెట్టు కాళ్ళు నేలలోకి
చెట్టు తలో నింగి పైకి
చెట్టు కాళ్ళు నేలలోకి
చెట్టు తలో నింగి పైకి

చిటికలోన చెట్టు నెక్కి
ఛట్టున తలకాయ కొట్టి
చిటికలోన చెట్టు నెక్కి
ఛట్టున తలకాయ కొట్టి
 అరె తోకరాయుడు 
మమ్మారే అయ్యారే భళ్ళారే భలే భలే
తోకరాయుడు మెచ్చి యిచ్చిన
కొబ్బరికాయలు గుళ్ళో కొట్టి

వెలుగు వెలగరా
ఒక వెలుగు వెలగరా నాయనా
ఛాంగుభళా 
భళిగ చెలగరా నాయనా 
నాయనా... ఆఆఆఆ....


సోమవారం, సెప్టెంబర్ 24, 2018

పెళ్ళి చేసుకుని...

పెళ్ళి చేసి చూడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళిచేసి చూడు (1952)
సంగీతం : ఘంటసాల  
సాహిత్యం : పింగళి   
గానం : ఘంటసాల 

ఓ భావి భారత భాగ్య విధాతలార
యువతీ యువకులారా
స్వానుభవమున చాటు
నా సందేశమిదే.. 
వరేవ్వా తాధిన్న తకధిన్న తాంగిట తరికిట తరికిట తోం

పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

కట్నాల మోజులో మన జీవితాలనె బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు
చెప్పుకొని ప్రజలు సుఖ పడగా

తాధిన్న తకధిన్న తాంగిట తరికిట తరికిట తోం

ఇంట బయట జంట కవుల వలె
అంటుకు తిరగాలోయ్ తరంపం
ఇంట బయట జంట కవుల వలె
అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు
చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు
చంటి పాపలను సాకాలోయ్ 
 
పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

నవ భావములా నవ రాగములా
నవ జీవనమే నడపాలోయ్
నవ భావములా నవ రాగములా
నవ జీవనమె నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్

పెళ్ళి చేసుకొని...
పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
హాయిగా ఉండాలోయ్..


శుక్రవారం, సెప్టెంబర్ 14, 2018

అన్ని మంచి శకునములే...

శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం :  ఘంటసాల, సుశీల 

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే....

నావలెనే నా బావ కుడా...
నాకై తపములు చేయునులే..
తపము ఫలించి నను వరియించి..
తరుణములోనె బిరాన నన్ను చేరునులే ...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

కుడికన్ను అదిరే... కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచెనులే ....
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే ...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే

మల్లెతోరణల మంటపమందె
కనులు మనసులు కలియునులే...
కలసిన మనసుల కలరవములతో..
జీవితమంతా వసంతగానమౌనులే...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే...
మనసున మంగళవాద్యమాహా మోగెలే..


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.