బుధవారం, జూన్ 24, 2020

మనసు పరిమళించెనే...

శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, సుశీల 

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 
మనసు పరిమళించెనే..  
తనువు పరవశించెనే
నవ వసంత గానముతో.. 
నీవు నటన సేయగనే

మనసు పరిమళించెనే..  
తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో.. 
నీవు చెంత నిలువగనే 
మనసు పరిమళించెనే.. 
తనువు పరవశించెనే

నీకు నాకు స్వాగతమనగా 
కోయిలమ్మ కూయగా
ఆ..... ఆ.... . ఆ..... ఆ....
నీకు నాకు స్వాగతమనగా 
కోయిలమ్మ కూయగా
గలగలగల సెలయేరులలో 
కలకలములు రేగగా 
మనసు పరిమళించెనే.. 
ఆ.. ఆ.. హా..
తనువు పరవశించెనే.. 
ఓ..ఓ..ఓ..
నవ వసంత గానముతో... 
నీవు చెంత నిలువగనే 

మనసు పరిమళించెనే... 
తనువు పరవశించెనే

క్రొత్త పూల నెత్తావులతో 
మత్తుగాలి వీచగా
ఆహ .. ఆ . అ ఆ
క్రొత్త పూల నెత్తావులతో 
మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు 
గుములు గుములుగా... 
ఝుం ఝుమ్మని పాడగా 

మనసు పరిమళించెనే... 
తనువు పరవశించెనే

తెలి మబ్బులు కొండ కొనలపై 
హంసల వలె ఆడగా
అహా .. ఆ . అ.. ఆ
తెలి మబ్బులు కొండ కొనలపై 
హంసల వలె ఆడగా
రంగరంగ వైభవములతో 
ప్రకృతి విందు సేయగా

మనసు పరిమళించెనే...  
తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో 
నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే... 
తనువు పరవశించెనే 



4 comments:

మనసు పరిమళించెనే..పాట అటువంటిది మరి..

హహహ థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ.. :-)

Golden classic. Best duet by ghantasala and susheelamma Garu. సంగీతం సాహిత్యం, గానం , నటన,చిత్ర కరణ అన్నీ గొప్పగా ఉన్నాయి.

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ బుచికి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.