ఆదివారం, జూన్ 07, 2020

నమ్మేలా లేదే...

రాజా వారు రాణి గారు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
  

చిత్రం : రాజావారు రాణిగారు (2019) 
సంగీతం : జయ్ క్రిష్  
సాహిత్యం : సానాపతి భరధ్వాజ పాత్రుడు  
గానం : అనురాగ్ కులకర్ణి   

నమ్మేలా లేదే కల కాదే
మనసే మేఘమాయే
కమ్మేసిందేదో ఒక హాయే
చినుకే భారమాయే
ఇయ్యాలనుంది గాని
ఉయ్యాలలూగేటి మేఘమా
జాగెందుకే సరాసరి పంపించు 
చిన్నారి చినుకుని
 
నా పెదవికి కనులతో కలహమా
నా మనసుని వదలవే బిడియమా

సీత చూపే రామ బాణం 
అయినదేమో కదా
దారేది లేక నవ్వుతూనే 
నలుగుతోంది ఎద
నా మనసుని కోసే సుతారమా 
కాసేపైనా ఆగుమా
ఓ కాలమా వేళాకోళమా
జంటై ఉంటే నేరమా
 
నా పెదవికి కనులతో కలహమా
నా మనసుని వదలవే బిడియమా

పల్లెటూరే పర్ణశాలై 
వెలుగుతోంది ఎలా
గుమ్మాన్ని దాటే ఒలిపిరల్లె 
తుళ్ళిరాకే ఇలా
నా నడకనీ ఆపే నిధానమా
నీదే నాదం నాట్యమా
ఓ దూరమా నాతో వైరమా
తారాతీరం చేరుమా
 
నా పెదవికీ కనులతో కలహమా
నా మనసునీ వదలవే బిడియమా 
 

2 comments:

యెప్పుడూ వినలేదీ పాట..బావుంది..

సినిమా యావరేజ్ గా ఆడడంతో పాట కూడా మరుగున పడిపోయిందండీ. సినిమా కూడా గోదావరి అందాలతో పల్లె వాతావరణంలో బావుంటుంది. కాకపోతే బాగా స్లో పేస్.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.